Thursday, 7 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

త్వరలోనే ఏపీ టెట్ నోటిఫికేషన్!

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @అమరావతి : ఏపీరాష్ట్రంలోని టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు మరో అప్డేట్ వచ్చేసింది. త్వరలోనే టెట్ నోటిఫికేషన్ విడుదలకానుంది. ఈమేరకు విద్యాశాఖ ప్రకటన చేసింది. త్వరలోనే టెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని విద్యాశాఖ తెలిపింది. అర్హులైన వారినుంచి అప్లికేషన్లను స్వీకరించనున్నట్లు పేర్కొంది. కొత్త నోటిఫికేషన్కు సంబంధించిన వెబ్సైట్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే నోటిఫికేషన్ విడుదలయ్యాక అప్లికేషన్ తేదీలు, పేమెంట్ వివరాలను అప్డేట్ చేయనున్నారు.

జాతీయ అంతర్జాతీయ

అక్టోబరు 9 నుంచి బడ్జెట్ కసరత్తు షురూ

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @న్యూ ఢిల్లీ : ప్రపంచ ఆర్థిక అస్థిరతలు, అమెరికా 50% సుంకాల విధింపు నేపథ్యంలో ఆర్థిక శాఖ 2026-27 వార్షిక బడ్జెట్ రూపకల్పనకు వచ్చే నెల 9వ తేదీ నుంచి సన్నాహాలు ప్రారంభించనుంది.ఈ నేపథ్యంలో కేంద్ర వ్యయశాఖ కార్యదర్శి అధ్యక్షతన విభిన్న వర్గాలతో ప్రీ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 9 నుంచి ప్రారంభమవుతాయని ఆర్థిక వ్యవహారాల శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్

ఏపీలో పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్ల విడుదల

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @అమరావతి : గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్లు పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్తులకు మంగళవారం విడుదల చేశారు. వాటి బ్యాంకు ఖాతాలకు బుధవారం నిధులు జమకానున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం లో రెండో విడత రూ.1,120 కోట్ల విడుదలలో జాప్యంపై ఇటీవల పలువురు సర్పంచులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు మొత్తం నిధులను రాష్ట్ర ఆర్థికశాఖ పంచాయతీలకు 70%, మండల పరిషత్తులకు 20%, జిల్లా పరిషత్తులకు 10% చొప్పున విడుదల చేసింది.

క్రైమ్

విశాఖ ఉక్కు కర్మాగారంలో భారీ చోరీ

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @విశాఖ విశాఖ ఉక్కు కర్మాగారంలో భారీ చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం ఐదుగురుని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించిన పోలీసులు చోరీ కాబడిన కాపర్ ప్లేట్స్ విలువ కోట్లలో ఉండొచ్చు అని అంచనా

క్రైమ్

ప్రియుడి మోజులో పడి భర్తను, 22 ఏళ్ల కూతురిని హత్య చేసిన కసాయి తల్లి

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ కూతురిని హత్య చేసి అడవిలో మృతదేహం పడేసి, చుట్టూ క్షుద్రపూజలు చేసినట్లు సృష్టించిన కిల్లర్ లేడీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వడితల గ్రామంలో దారుణ ఘటన భర్త పక్షవాతంతో బాధపడుతుండగా, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న కవిత అనే మహిళ ఈ వివాహేతర సంబంధం గురించి తెలుస్తుందని భర్తను జూన్ 25న చంపి వ్యాధితో చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు పూర్తి వివాహేతర సంబంధం విషయం కూతురికి కూడా ఎలాగైనా తెలుస్తుందని, ప్రియుడితో కలిసి వర్షిణి(22)ను కూడా కడతేర్చిన కసాయి తల్లి కూతురు మృతదేహాన్ని భూపాలపల్లి – కాటారం హైవే పక్కన అడవిలో పడేసి, చుట్టూ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లి ఆధార్ కార్డు పెట్టి నరబలిలా నమ్మించిన కవిత పోలీసుల దర్యాప్తులో కవిత తీరుపై అనుమానం వచ్చి ఆరా తీయగా విస్తుపోయే నిజాలు 2 నెలల క్రితం ప్రియుడితో కలిసి భర్తను, ఇప్పుడు కూతురిని హత్య చేసినట్లు ఒప్పుకున్న కిల్లర్ లేడీ.. మరో హత్య కోసం కూడా ప్లాన్ ప్రియుడిని, కవితను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపిన పోలీసులు

జాతీయ అంతర్జాతీయ

ఎయిర్పోర్టులో భారీగా గంజాయి స్వాధీనం.. 23 ఏళ్ల మహిళ అరెస్ట్

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ బ్యాంకాక్ నుండి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న హైదరాబాద్కు చెందిన 23 ఏళ్ల మహిళను రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. ఆమె వద్ద 3.1 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.3 కోట్లుగా అంచనా. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు కలిగిరిలో ఘనంగా నిర్వహించారు..////

కలిగిరి,పున్నమి న్యూస్ : ప్రతినిధి, నాగరాజు : ///// కలిగిరి లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉదయగిరి నియోజకవర్గం పిఓసి కొట్టే వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు జనసేన పార్టీ సీనియర్ నాయకులు బద్దినేని శివ, కృష్ణoశెట్టి దిలీప్ కుమార్ ,కోసూరి సురేష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారుకార్యక్రమాన్ని ముందుగా కలిగిరి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉమాశంకర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 73 యూనిట్లు రక్తం సేకరించినట్లు నోవా బ్లడ్ బ్యాంక్ ఆర్గనైజర్ బావిశెట్టి కిషోర్ తెలియజేశారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న 73 మంది సభ్యులకు ఆర్గనైజేషన్ సభ్యులకు జనసైనికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్ద స్థాయిలో 73 యూనిట్లు రక్తం సేకరించడం చిన్న విషయం కాదని ఇన్ని యూనిట్లు రావడం ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కోసూరి సునీల్, దాసరి గణేష్, బత్తల శ్రీనివాసులు, పొన్నం నాగేశ్వరరావు, దువ్వూరి ఏడుకొండలు, కర్రాగణేష్, గుంటగాని వినోద్ కుమార్, మరియు జనసైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

సినిమా

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న అసుర సంహారం

తనికెళ్ల భరణి, మిధున ప్రియ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం అసుర సంహారం ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఆసక్తిగా సాగే కథాంశంతో దర్శకుడు శ్రీ కిషోర్ శ్రీకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇందులో డాక్టర్ పీర్ కుమార్, గూడూరు కిషోర్, మస్తాన్ రావు, గూడూరు నజీర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా కి కెమెరామెన్ బాలు, ఎడిటింగ్ సెల్వ, పాటలు ప్రవీణ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మిధున ప్రియ, నిర్మాత సాయి శభరీష్ బోయల్ల, కథ.. స్క్రీన్ ప్లే.. మాటలు.. దర్శకత్వం.. కిషోర్ శ్రీ కృష్ణ.

ఆంధ్రప్రదేశ్

ముగ్గురు నామినేటెడ్ పోస్టుల ఛైర్మన్లకు క్యాబినెట్ హోదా

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ రాష్ట్ర ప్రభుత్వం 3 నామినేటెడ్ పోస్టుల ఛైర్మన్లకు క్యాబినెట్ హోదా కల్పించింది: ▪️ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ – డా. రాయపాటి శైలజా ▪️ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కాస్ట్ కమిషన్ చైర్మన్ – కె.ఎస్. జవహర్ ▪️ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ – ఆళపాటి సురేష్.

విశాఖపట్నం

ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తించిన కండక్టర్

– ఫ్రీ భోజనం కోసం ఎక్కడ పడితే అక్కడే బస్సు నిలుపుదల – ప్రశ్నించిన ప్రయాణికుడిపై దుర్భాషలు – దొమ్మేరు రాజు గారి హోటల్ తో ఆర్టీసీ అధికారులు కుమ్మక్కు – మధురవాడ ఆర్టీసీ డిపో అధికారుల నిర్వాహకం అనకాపల్లి : నిత్యం ఎంతో మందిని గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేస్తూ… అందరి మన్ననలు పొందుతున్న ఆర్టీసీ వ్యవస్థ కొందరు కండక్టర్, డ్రైవర్ల నోటి దురుసుతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. మధురవాడ డిపోకు చెందిన AP09 4723 నెంబర్ గల సూపర్ లగ్జరీ బస్సు విశాఖపట్నం నుండి విజయవాడ వెళ్తుంది. ఇందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు భోజన సమయం కావడంతో కండెక్టర్ని భోజనం చేయడం కోసం బస్సు ఎక్కడైనా ఆపమని సుమారు మధ్యాహ్నం 2 గంటలకు అడగగా… బస్సు ఎక్కడపడితే అక్కడ ఆపడం కుదరదని మా డిపోకు సంబంధించి అనకాపల్లి దాటిన తరువాత జాతీయ రహదారి పై దొమ్మేరు రాజు గారి హోటల్ మన డిపో మేనేజర్ గారిది ఉందని, అక్కడ భోజనం చేయడం కోసం బస్సు ఆపడం జరుగుతుందన్నాడు. అక్కడ భోజనం చాలా అద్భుతంగా ఉంటుందని ఆ కండక్టర్, డ్రైవర్ సర్టిఫికేట్ ఇవ్వడం గమనార్హం. తీరా అక్కడ బస్సు ఆగాక అక్కడ వాతావరణం ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా ఉందని, ఇంకెక్కడైనా మంచి హోటల్ దగ్గర ఆపమని మహిళా ప్రయాణికులు డ్రైవర్ని అడిగితే ఇష్టం ఉంటే ఇక్కడ తినండి… లేకుంటే మానేయండి.. బస్సు ఇంకెక్కడా ఆపడం కుదరదని మీకు చేతనైంది చేసుకోమని ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లు దుర్భాషలాడాడని మహిళా ప్రయాణికులు వాపోయారు. కనీసం సౌచాలయాలు కూడా లేవని, అవి ఉన్న చోట ఆపమని అడిగితే ఆమాత్రం అగలేరా అని మహిళా ప్రయాణికులతో వ్యంగ్యంగా కండక్టర్ మాట్లాడటం చాలా బాధించిందన్నారు. ఒక ప్రక్క కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తుంటే ఆర్టీసీలో మాత్రం చులకనగా చూస్తున్నారని మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆ సమయంలో డ్యూటీలో ఉన్న బస్సు డ్రైవర్, కండక్టర్, డిపో మేనేజర్ పై అధికారులు విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇటువంటి చర్యలు పునరావృత్తం అయితే ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ లకు సరైన బుద్ధి మా మహిళలే చెబుతామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.