Thursday, 7 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

Big boost for everyone

“Big boost for everyone!   The new #GST slabs—just 5% for essentials & 18% for most others—mean daily goods are cheaper, life easier for small businesses, & the system is simpler for all. A step towards #Growth, #Transparency & #EaseOfLiving! Ready for a prosperous Diwali 2025!  #GSTReforms“ #CGSolutions

ఆంధ్రప్రదేశ్

ఎమ్మిగనూరు టీడీపీ మండల కన్వీనర్:- కే టీ వెంకటేష్

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేలా ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు ఎమ్మిగనూరు మండల ప్రధాన కమిటీని నియమించారు. టీడీపీ మండల ప్రధాన కమిటీ అధ్యక్షుడిగా తిమ్మాపురానికి చెందిన వెంకటేష్ మరియు ఉపాధ్యక్షుడిగా కందనాతికి చెందిన కేశన్నను నియమించారు. వీరితో పాటు ప్రధాన కార్యదర్శిగా పర్లపల్లికి చెందిన రాజేశ్‌ను, మండల ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా చెన్నారెడ్డి, అయ్యలప్ప, విజయ్ గౌడ్ మరియు మండల కార్యదర్శులుగా సయ్యద్ తాజుద్దీన్, డీలర్ ఈరన్న, తెలుగు సోమశేఖర్‌తో పాటు మండల కోశాధికారిగా బోయ పార్వతిని నియమించారు.

భక్తి

శ్రీనివాస చూడవయ్యా

ఆది శేషుని వడిలో పాద కమలములను జత చేసి ఇరువురి భామలను తమ కరములలో బంధించేసి ఏడు పడగల నడుమ చిరుమందహాసంబు చేస్తూ సేద తీరుతూ మము గావవయ్య శ్రీ శ్రీనివాస [ ఆది శేషుడు ఏడు పడగలతో ఉన్నప్పుడు కాలు మీద కాలు వేసుకుని ఇద్దరు అమ్మల భుజాలపై చేతులు వేసి పక్కన కూర్చో పెట్టుకుని నవ్వుతూ విశ్రాంతి తీసుకుంటూ మమ్మల్ని చూడవయ్యా అని దీని అర్థం ]

ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం 

భమిడిపాటి గౌరీశంకర్‌కు విశ్వ సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్ష పదవి

విశ్వ సాహితీ కళావేదిక సాహిత్య, సంస్కృతి, సేవా సంస్థ తమ కార్యక్రమాలను విస్తరించే క్రమంలో, జిల్లాస్థాయి అధ్యక్షుడిగా కథా రచయిత, గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్ కళాశాల తెలుగు విభాగాధిపతి భమిడిపాటి గౌరీశంకర్ నియమితులయ్యారు. సంస్థ చైర్‌పర్సన్ శ్రీమతి కొల్లి రమావతి నియామక పత్రాన్ని పంపించారు. ఈ సందర్భంగా ఒక ప్రత్యేక బృందాన్ని కూడా నియమించారని సంస్థ వర్గాలు వెల్లడించాయి.భమిడిపాటి గౌరీశంకర్ గత మూడు దశాబ్దాలుగా రచనలతో సాహిత్య రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అనేక కథలకు పురస్కారాలు, బహుమతులు అందుకున్న ఆయన ఇప్పటివరకు ఇరవై గ్రంథాలను ప్రచురించారు. ‘మహతి పురస్కారం’ వంటి ప్రతిష్ఠాత్మక గౌరవాలను కూడా అందుకున్నారు.ఈ నియామక సందర్భంగా విద్యాసంస్థల అధినేత జి.వి. స్వామినాయుడు, కళాశాల ప్రిన్సిపాల్ కె.వి.వి. సత్యనారాయణ, అధ్యాపక బృందం మరియు సాహిత్యాభిమానులు అభినందనలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

ఘనంగా ముగిసిన వినాయక ఉత్సవాలు – లక్కీ డ్రా విజేతలకు బహుమతుల ప్రదానం

శ్రీకాకుళం రూరల్‌ మండలంలోని కరజాడ గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు ఆధ్యాత్మిక వైభవంతో ముగిశాయి. ఉత్సవాల చివరి రోజు నిర్వహించిన వినాయక నిమజ్జన ఊరేగింపులో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఉత్సవ కమిటీ సభ్యులు మరియు గ్రామ దేవాలయ నిర్వాహకులు ప్రశంసలు అందుకున్నారు. భక్తుల్లో ఉత్సాహం నింపడానికి భాగంగా లక్కీ డ్రాను నిర్వహించారు. విజేతలకు గురువారం నిర్వహించిన కార్యక్రమంలో బహుమతులు అందజేశారు. ఈ లక్కీ డ్రా కార్యక్రమం కరజాడ మెయిన్ రోడ్ పెద్దలు మరియు యూత్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ➡️ గ్రామస్తులు మాట్లాడుతూ, ప్రతీ ఏటా ఇలాగే ఉత్సవాలను ఆనందోత్సాహాలతో కొనసాగించాలని సంకల్పం వ్యక్తం చేశారు.

Blog

మాతృభూమికి స్వరార్చన మాతృభూమికి కళార్చన మూడవరోజు పాటల పోటీల నిర్వహణ అలరించిన చిన్నారుల గానాలాపాన

కళారాధన నంద్యాల ఆధ్వర్యంలో,నంద్యాల ఐఎంఏ,లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో జరుగుతున్న మాతృభూమికి కళార్చన పోటీలలో భాగంగా రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో మంగళవారం సబ్ జూనియర్, జూనియర్ పాఠశాల విద్యార్థులకు, బుధవారం సీనియర్ విభాగంలో శాస్త్రీయ,జానపద, సాధారణ,దేశభక్తి విభాగాలలో సోలో,మరియు బృంద గాన పాటల పోటీలు నిర్వహించారు. చిన్నారులు తమ గాన కళతో మాతృభూమికి స్వరార్చన చేశారు. పాల్గొన్న బాలలందరూ తమ గానంతో ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఉత్తేజపూరితమైన దేశభక్తి పాటలు, చక్కటి గానాలాపనలతో శాస్త్రీయ గీతాలు, పల్లె జీవితాలకు అద్దం పట్టే జానపద పాటలు విశేషంగా అలరించాయి. వాద్య సంగీత పోటీలో విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. ఈ పోటీలలో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా సీతమ్మ ,లక్ష్మీ కల్యాణి, వ్యవహరించారు. కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి కృష్ణ, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సోమేసుల నాగరాజు , కార్యనిర్వాహక కార్యదర్శి రవి ప్రకాష్, ఉపాధ్యక్షులు శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు నీలకంఠమాచారి, కార్యాలయ కార్యదర్శి వెంకటేశ్వర్లు పోటీలను పర్యవేక్షించారు. *గురు వారం నిర్వహించే పోటీలు:* గురువారం 4 వ తేదీ న నర్సరీ, ఎల్కేజీ ,యూకేజీ బాలలకు ఆంగ్ల రైమ్స్ పోటీలు రామకృష్ణ డిగ్రీ కళాశాల మినీ ఆడిటోరియంలో, సబ్ జూనియర్, జూనియర్ విభాగాలలో తెలుగు పద్య పఠనం పోటీలు ఎన్టీఆర్ పురపాలక సెంటినరీ టౌన్ హాల్ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తారు. *తెలుగేతర పదాలు వాడకుండా పూర్తి తెలుగు ఉపన్యాస పోటీ విజేతలు:* అప్పటికప్పుడు ఇచ్చిన అంశమైన స్నేహబంధం పై తెలుగేతర పదాలు వాడకుండా పూర్తి తెలుగు లో మాట్లాడే పోటీలో ఆల్ సుమయ, సాయి వర్షిని, దీక్షా రెడ్డి వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించగా, పి.సరయు స్పెషల్ జూరి బహుమతి సాధించింది. ఈ పోటీలకు తెలుగు అధ్యాపకులు డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు,నరేంద్ర న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

Blog

ఆళ్ళగడ్డ వ్యవసాయ శాఖ కార్యాలయంలో రండి… టీ తాగుతూ మాట్లాడుకుందాం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కె నాగేంద్రప్ప

ఆళ్ళగడ్డ వ్యవసాయ శాఖ కార్యాలయంలో రండి… టీ తాగుతూ మాట్లాడుకుందాం కార్యక్రమం నాగేంద్రప్ప ఆధ్వర్యంలో నిర్వహించారు, శుక్రవారం నిర్వహించిన రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్. సూర్యనారాయణ నూతనంగా రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమం గత నెల 5వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైనదని, ఈ సందర్భంగా నాగేంద్రప్ప మాట్లాడుతూ గత పాలకులు ఉద్యోగుల బకాయిలు పరిష్కరించాలని సమస్యల తోరణం తో ధర్నాలకు వెళితే ఉద్యోగులను దేశ ద్రోహుల భావించి మన రాష్ట్ర అధ్యక్షులు కె ఆర్ సూర్యనారాయణ ని అరెస్టు చేసే ప్రయత్నం చేశారన్నారు. అయితే ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయని ప్రభుత్వాలు మనకెందుకని మనం నూతనంగా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పైబడిన ఇంకా ఉద్యోగుల సమస్యలపై స్పందించకపోవడం ఆవేదన కలిగిస్తున్నది అన్నారు. ఇప్పటికే ఉద్యోగులకు సుమారు 35 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి ఉందని ఈ మొత్తాన్ని ఎలా చెల్లిస్తారో అర్థం కావడం లేదన్నారు. అందుకని జిల్లా కేంద్రాలు, పరిసర మండలాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఇళ్ల స్థలాల రూపంలో ఉద్యోగులకు ఇచ్చి ఇవ్వాల్సిన బకాయిలను జమ చేసుకోవడం వలన ఇటు ఇల్లు నిర్మించుకోవాలన్న ఉద్యోగుల కల అటు ప్రభుత్వ బకాయిలు రెండు నెరవేరుతుందని రాష్ట్ర అధ్యక్షులు అభిప్రాయమని నాగేంద్రప్ప పేర్కొన్నారు. దీంతోపాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక సంఘం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘమే అన్నారు. రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం కార్యక్రమంలో కూడా ఏదైనా ఉద్యోగ సమస్యలు ఉంటే తమ సంఘం దృష్టికి తీసుకువస్తే సత్వరం జిల్లా అధికారులతో మాట్లాడి పరిష్కారం కి కృషి చేస్తానని జిల్లా అధ్యక్షులు హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై వ్యతిరేకంతో తాము ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఉద్దేశంతోనే సానుకూలంగా రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే కార్యక్రమం ద్వారా ఉద్యోగుల సమస్యలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నామని ఆయన అన్నారు. గడచిన ఐదు సంవత్సరాల కాలంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదని వారు వారి పిల్లలకు వివాహాధి కార్యక్రమాలు చేసుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయాలను ప్రభుత్వం గుర్తించి సత్వరం ఉద్యోగుల బకాయిల చెల్లింపుకు మార్గాన్ని ఆలోచించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర కార్యదర్శి సుధాకర్, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, ఆళ్ళగడ్డ విజయశేఖర్, తాలూకా కార్యదర్శి హాజరయ్య, ఉపాధ్యక్షులు విజయలక్ష్మి, నాగరాజు, వెంకట పోలయ్య, సునీల్ కుమార్ వివిధ శాఖలలో పని చేస్తున్న ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

బరిస్టా కాఫీకి శాస్త్రీయ శిక్షణ!

సెప్టెంబర్ 04 పున్నమి ప్రతినిధి @ బరిస్టా కాఫీకి శాస్త్రీయ శిక్షణ! యువతకు ఉద్యోగావకాశాలకు పునాది వేసే కీలక శిబిరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పంతో ఆంధ్రప్రదేశ్‌లో యువతకు శిక్షణతోపాటు ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యం. సెప్టెంబర్ 23 నుండి 27 వరకు ప్రత్యేక శిక్షణ శిబిరం అరకు వైటీసీ కేంద్రంలో 🔸 కాఫీ తాయారీలో నైపుణ్యాల పెంపు 🔸 కాఫీ వ్యాపారానికి శాస్త్రీయ మార్గదర్శనం 🔸 యువతలో ఉపాధి అవకాశాలు – స్వయం ఉపాధికి మార్గం యువత ప్రగతికి కొత్త దిశ – నైపుణ్యాన్ని సాధన చేసేదే భవిష్యత్ సాధన!

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ జనవరిలో ఎన్నికలు…!

సెప్టెంబర్ 04 పున్నమి ప్రతినిధి @ ఆంధ్రప్రదేశ్ లో జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు. షెడ్యూల్ విడుదల చేసిన EC. ముందస్తు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు.

విద్య విజ్ఞానం

ఉపాధ్యాయులకు తగ్గనున్న పనిభారం

సెప్టెంబర్ 04 పున్నమి ప్రతినిధి @ ఇప్పటి వరకు పాఠశాలకు సంబంధించిన ఆన్ లైన్ పనులు ఉపాధ్యాయులే చేయాల్సి వచ్చేది. ప్రభుత్వం ప్రతి పాఠశాలల సము దాయానికి ఒక కంప్యూటర్, సీఆ ర్పీలకు శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేసింది. సీఆర్పీలే ఆన్లై న్లో నమోదు చేస్తారు. పాఠశాలలకు సంబం ధించిన వివరాలు నేరుగా సీఆర్పీలే ఆన్లై న్లో నమోదు చేస్తారు. విద్యార్థుల హాజరు, పరీక్షలు, మార్కుల నమోదు తదితర అన్ని పనులు వీరి ద్వారానే చేయిస్తారు. పాఠశాల లకు సంబంధించిన వివరాలు సముదాయం లోనే పూర్తవుతాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.