రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలం నాగవరం గ్రామనివాసి కుసులూరు నాగేంద్ర గారి చిన్నాన్న “కుసులూరు శంకరయ్య” మృతి చెందగా ఈరోజు 04-09-2025వ తేదీ గురువారం నాడు వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు.ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలం నాగవరం గ్రామనివాసి కుసులూరు నాగేంద్ర గారి చిన్నాన్న “కుసులూరు శంకరయ్య” మృతి చెందగా ఈరోజు 04-09-2025వ తేదీ గురువారం నాడు వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు.ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరుమల నడకదారి భక్తుల రక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. అలిపిరి నడకమార్గంలో ఇరువైపులా ఇనుపకంచెలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. భక్తులు ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా, సురక్షితంగా దారిలో నడిచేలా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ చర్యలను ఈ ఏడాది నవంబర్‌లోగా పూర్తి చేయాలని గడువుని కూడా నిర్దేశించింది. భక్తుల రక్షణకు సంబంధించి నిపుణుల సూచనలతో చేసిన సిఫార్సులను అమలు చేయడానికి ప్రత్యేక జాయింట్ కమిటీని నియమిస్తూ, పనుల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది. తిరుమల చేరే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ ఆదేశాలు అమలులోకి వస్తే నడకమార్గం మరింత భద్రతతో కూడుకున్నదిగా మారనుంది.
అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో గురువారం, ఫింగర్ ప్రింట్ సబ్‌ఇన్స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కె.రవీంద్రారెడ్డి సీఐగా పదోన్నతి పొందిన సందర్భంగా, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా పుష్పగుచ్ఛంతో కలిశారు. ఎస్పీ సీఐ కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ – “పోలీసు సేవలో కృషి, నిజాయితీ, క్రమశిక్షణతో పనిచేస్తే పదోన్నతి సహజం. బాధ్యతలు పెరిగినకొద్దీ నిబద్ధత, సేవాభావం మరింత పెరగాలి. పదోన్నతి కేవలం గౌరవం కాదు, అది మరింత కర్తవ్యబాధ్యతను గుర్తు చేసే అంశం” అని తెలిపారు. ఫింగర్ ప్రింట్ విభాగంలో రవీంద్రారెడ్డి గతంలో అందించిన సేవలను కొనియాడిన ఎస్పీ, భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో మరిన్ని విశిష్టమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది కూడా రవీంద్రారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు.
సిదవటం మండలంలోని పెద్దపల్లి రెవిన్యూ గ్రామ లోని నాపొలం లో ట్రాన్స్ ఫార్మర్ ను అక్రమంగా ఏర్పాటు చేశారని తొలగించాలని వై ఎస్ ఆర్ సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి తెలిపారు. సిద్దవటం మండలం లోని బాకరాపేటలో బుధవారం ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ పెద్దపల్లి రెవిన్యూ గ్రామంలోని నరవకాటి పల్లె కణం బావివద్ద ఉన్న సర్వేనెంబర్ 1090-4లో ఏర్పాటు చేసుకోవాల్సిన ట్రాన్స్ ఫార్మర్, విద్యుత్ స్తంభాలను పెద్దపల్లి రెవిన్యూ గ్రామంలోని బాకరాపేట గ్రామం లోని సర్వే నెంబర్ 858-2, 858-3 లోని తమ పొలంలో ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేసి తన భూమిని కబ్జా చేసేందుకు ఒంటిమిట్ట లోని విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి గుర్రంపాటి మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సిద్ధవటం రెవిన్యూ అధికారులు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు ఇవ్వకపోయినా ఒంటిమిట్ట విద్యాశాఖ అధికారులు మోహన్ రెడ్డికి అనుమతులు ఎలా ఇచ్చారని ఆమె ధ్వజమెత్తారు. అతనిపై సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. శృతి స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు కోటపాటి సుబ్బమ్మ మాట్లాడుతూ ఏకుల రాజేశ్వర్ రెడ్డి భూమిలో అక్రమంగా భూమిని కబ్జా చేసేందుకు విద్యుత్ స్తంభాలను ట్రాన్స్ఫారం ఏర్పాటుచేసిన గుర్రంపాటి మోహన్ రెడ్డి పై చర్యలు చేపట్టి అతని ఉద్యోగం నుంచి తొలగించి కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి నాగలారపు అరుణ మాట్లాడుతూ రాజేశ్వర్ రెడ్డి కి జరిగింది అన్యాయమన్నారు. ఆమె భూమిలో ట్రాన్స్ఫార్మ్ ఏర్పాటు చేశారన్నారు. అలా చేయడం చట్టబద్ధంగా నేరమని ఆమె సిద్ధవటం ఎమ్మార్వో, జిల్లా కలెక్టర్ కు అర్జీ ఇచ్చారన్నారు. ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకుని న్యాయం చేయాలన్నారు. లేదంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అన్ని మహిళా సంఘాలతో కలిపి ధర్నా చేస్తామన్నారు. ఆమెకు న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామని ఆమె అన్నారూ. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు మీనాక్షి, ఆయేషా, సుబ్బరత్నమ్మ, కరిమున్, మౌనిక పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లా, రాయచోటి పట్టణం, అలీమాబాద్ వీధిలోని చౌక దుకాణం 10లో విజిలెన్స్ అధికారులు గురువారం ఉదయం ఆకస్మికంగా దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో రూ. 2.63 లక్షల విలువచేసే 5,362 బస్తాల రేషన్ బియ్యం, 341కేజిల పంచదారను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. ఈ రేషన్ డీలర్ అంజాద్ అలీకి చెందినవిగా అధికారులు తెలిపారు. డీలర్ కాకుండా అబ్రార్ ఉల్ హుక్ అనే వ్యక్తి అక్రమంగా విక్రయిస్తుండగా దాడులు జరిపామన్నారు. ఈ దాడుల్లో కడప విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ సీఐ నాయకుల నారాయణ, డిసిటిఓ బాబు మోసెస్, విజిలెన్స్ అధికారి టిప్పుసుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.
యూరియా పై సమాచారం తెలుసుకునేందుకు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని బుధవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. సమాచారం కొరకు 08561-293006 నెంబర్ ను ఉదయం 8:00 గంటల నుండి సాయంత్రం 8:00 గంటల వరకు సంప్రదించవచ్చనన్నీ అన్నారు.
అనారోగ్యంతో మృతి చెందిన టిడిపి సీనియర్ నేత జానపాటి వెంకట రామయ్యపార్టీవ దేహానికి టిడిపి నేత ఎమ్మెల్సీ రామచంద్రయ్య శ్రద్ధాంజలి ఘటించారు మండలంలోని మాధవరం-1 గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నేత శ్యామల వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని బుధవారం తన స్వగృహంలో శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామచంద్రయ్య మాట్లాడుతూ టిడిపి పార్టీ కోసం ఆయన చేసిన కృషి మరవలేని విషయమని ఆయనతో నాకున్న మిత్రబంద్రం మరవలేని విషయమని ఎంతో మందికి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేపించాలని ఎన్నోసార్లు నా దృష్టికి తీసుకు వచ్చారని అలాంటి మహోన్నతమైన వ్యక్తి మృతి చెందడం పార్టీకి తీరని లోటనివారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ఎమ్మెల్సీ రామచంద్రయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ వాణిజ్య అధికార ప్రతినిధి ఎన్నారై చంద్ర ఉపాధ్యక్షులు పుత్త రామచంద్రయ్య రాష్ట్ర వాణిజ్య విభాగపు అధికార ప్రతినిధి గంజి సుబ్బరాయుడు టిడిపి యువనేత దారపునేని రాజా నాయుడు, రాజశేఖర్, కూటమి నేతలు శ్రీకాంత్, బండి ఓబులేసు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు…
…..కోల్డ్ స్టోరేజ్ లు లేక ప్రతి ఏటా అవస్థలు …..ఈనెల 6న శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ వద్ద ఆందోళన ….గారి చంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి డిమాండు ఉల్లి పంట సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధర క్వింటాకు 3000 తో ప్రభుత్వమే కొనుగోలు చేసే ఆదుకోకపోతే ఉద్యమం తప్పదని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు. గురువారం ఎర్రగుంట్ల మండలం దండుపల్లె వెల్దుర్తి, వీయన్ పల్లి మండలం కొమ్మది, తొండూరు మండలం గంగనపల్లి, చెర్లోపల్లి, ఊడగండ్ల, గంగాదేవి పల్లె గ్రామాల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం వి సుబ్బారెడ్డి, వెంకట్ రాముడు, హరిహర నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో దాదాపు పదివేల ఎకరాలలో ఉల్లి పంట సాగు చేసినట్లు ప్రాథమిక అంచనా అన్నారు. ఎకరా పంట సాగుకు కనీసం అంటే విత్తనాలు ఎరువులు పురుగుమందులు కూలీల ఖర్చు వెరసి లక్ష రూపాయలు దాకా వస్తుందన్నారు. ఎకరాకు 60 నుంచి 80 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తే ప్రస్తుత మార్కెట్లో క్వింటాదర 800 నుండి వెయ్యి రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారని దీని ప్రకారం పెట్టిన పెట్టుబడులు కూడా రాక రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు క్వింటా ధర 1200 తో కొనుగోలు చేసిన రైతులకు ఎలాంటి లాభం రాదన్నారు.ఎమ్మెస్ స్వామినాథన్ చేసిన సిఫార్సుల ఆధారంగా కనీసం మద్దతు ధర నిర్ణయించాలన్నారు సేద్యం, విత్తనాలు, ఎరువులు ,పురుగు మందులు ,వ్యవసాయ కూలీలు ,కుటుంబ శ్రమ, వ్యవసాయ మూలధన వ్యయం అన్నింటినీ లెక్కించి వాటి ఆధారంగా 50 శాతం ఆదాయం వచ్చే విధంగా కనీసం మద్దతు ధర నిర్ణయించాలని ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా వారికి ఇష్టం వచ్చినట్లు రైతులకు నష్టం వస్తుందా అన్న అటువంటి ఆలోచన లేకుండా 1200 రూపాయలు కింటాకు కల్పించడం దుర్మార్గమని తక్షణమే ఈ ఆలోచన విరమించుకొని క్వింటాకు 3000 రూపాయలు మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. కొనుగోలు దారులు తరువు పేరుతో క్వింటాకు 15 కిలోల చొప్పున పరోక్ష దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. ప్రతి ఏటా ఉల్లి రైతులు నష్టపోతు వచ్చే సంవత్సరమైనా కోరుకుంటామన్న గంపడాశతో అప్పు సప్పుచేసి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధరలు లేక, నిలువ చేసుకునే వెసులుబాటులేక చేసిన అప్పులు తీర్చలేక అవమానభారంతో ఆత్మహత్యలే శరణ్యమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 6న శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ వద్ద ఆందోళన కు ఉల్లి రైతులు తరలి రావాలని పిలుపునిచ్చారు. రైతులు సురేష్, ఈశ్వరయ్య, శ్రీనివాసులు, వెంకటసుబ్బయ్య, విజయ్, మహేష్, వీరాంజనేయులు, నాగార్జున రెడ్డి, హనుమంతు, రవిశంకర్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివందనములతో., గాలి చంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి, కడప.
భారతీయుడిగా చాలా గర్వంగా ఉంది. మన జాతీయ గీతం యొక్క అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు స్పష్టంగా ఉచ్చరించండి. ప్రతినిత్యం న్యూస్ సెప్టెంబర్ 04 నంద్యాల జిల్లా:- పదం పదం లోని అర్థం జన = ప్రజలు గణ = సమూహం మన = మనసు అధినాయక = నాయకుడు జయహే = విజయం భారత = భారతదేశం భాగ్య = విధి విధాత = డిస్పోజర్ పంజాబ = పంజాబ్ సింధు = సింధు గుజరాత = గుజరాత్ మరాఠా = మరాఠీ (మహారాష్ట్ర) ద్రావిడ = దక్షిణ ఉత్కల = ఒరిస్సా వంగా = బెంగాల్ వింధ్య =వింధ్యాలుl హిమాచల =హిమాలయ్ యమునా = యమునా గంగా = గంగ ఉచ్ఛల = కదులుతున్న జలధి =మహాసముద్రము తరంగ = అలలు తవ= మీ శుభ=మంచిది నామే= పేరు జాగే = మేల్కొలపండి తవ = మీ శుభ = శుభప్రదమైనది ఆశిష = దీవెనలు మాగే = అడగండి గాహే = పాడండి తవ = మీ జయ= విజయం గాథ = పాట జన = ప్రజలు గణ = సమూహం మంగళ = అదృష్టము దాయక = ఇచ్చేవాడ జైయహే = విక్టరీ బీ భారత = భారతదేశం భాగ్య = విధి విధాత = పంచేవాడు జైయహే, జైయహే, జై యహే, జైయ జైయ జైయ జయహే = విజయం విజయం,విజయం, విజయం, ఎప్పటికీ.
పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం. రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.