Thursday, 7 May 2026

Blog

E-పేపర్

మన జాతీయ గీతం “జన గణ మన… “ని యునెస్కో ప్రపంచంలోని ఉత్తమ గీతంగా ప్రకటించింది.

భారతీయుడిగా చాలా గర్వంగా ఉంది. మన జాతీయ గీతం యొక్క అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు స్పష్టంగా ఉచ్చరించండి. ప్రతినిత్యం న్యూస్ సెప్టెంబర్ 04 నంద్యాల జిల్లా:- పదం పదం లోని అర్థం జన            = ప్రజలు గణ            = సమూహం మన           = మనసు అధినాయక = నాయకుడు జయహే       = విజయం భారత      = భారతదేశం భాగ్య       = విధి విధాత      = డిస్పోజర్ పంజాబ     = పంజాబ్ సింధు       = సింధు గుజరాత   = గుజరాత్ మరాఠా    = మరాఠీ (మహారాష్ట్ర) ద్రావిడ    = దక్షిణ ఉత్కల        = ఒరిస్సా వంగా       = బెంగాల్ వింధ్య     =వింధ్యాలుl హిమాచల   =హిమాలయ్ యమునా     = యమునా గంగా         = గంగ ఉచ్ఛల = కదులుతున్న జలధి =మహాసముద్రము తరంగ = అలలు తవ= మీ శుభ=మంచిది నామే= పేరు జాగే     = మేల్కొలపండి తవ   = మీ శుభ      = శుభప్రదమైనది ఆశిష = దీవెనలు మాగే     = అడగండి గాహే      = పాడండి తవ       = మీ జయ= విజయం గాథ      = పాట జన       = ప్రజలు గణ      = సమూహం మంగళ = అదృష్టము దాయక   = ఇచ్చేవాడ జైయహే    = విక్టరీ బీ భారత = భారతదేశం భాగ్య = విధి విధాత = పంచేవాడు జైయహే, జైయహే, జై యహే, జైయ జైయ జైయ జయహే = విజయం విజయం,విజయం, విజయం, ఎప్పటికీ.

గూడూరు

ఎస్.కే.ఆర్. డిగ్రీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని విద్యార్థినీ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. శివప్రసాద్ మాట్లాడుతూ విద్య సమాజానికి పునాది అని మరియు ఉపాధ్యాయులు దాని రూపశిల్పులు అని ఆనాడు స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు విశ్వసించాడని, ఆయన తన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని కోరిన మహనీయుడని, ఆ స్ఫూర్తితో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదని మరియు గ్రహించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని తెలియజేశారు. అదేవిధంగా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, అధ్యాపకులు శ్రీధర్ శర్మ, డాక్టర్ గోవింద్ సురేంద్ర, డాక్టర్ ఝాన్సీ వాణి, డాక్టర్ బి. పీర్ కుమార్, రవిరాజు, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి. నారాయణ రాజు, మాట్లాడుతూ ఉపాధ్యాయ సేవలు ప్రతి విద్యార్థి సక్రమంగా వినియోగించుకోవాలని విద్యార్థిని విద్యార్థులను ఆశీర్వదించారు. అనంతరం ప్రిన్సిపాల్తో సహా అధ్యాపక బృందానికి విద్యార్థిని విద్యార్థులు బహుమతులు అందించి ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో ఐక్యుఏసి కోఆర్డినేటర్ డాక్టర్ కోటేశ్వరరావు, ఎన్.సి.సి. కోఆర్డినేటర్ శ్రీమతి మైమూన్, డాక్టర్ శైలజ, కిరణ్మయి, కృపా కరుణ వాణి, తదితర అధ్యాపక సిబ్బంది, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక అవసరాల పిల్లల బాధ్యత నేను తీసుకుంటా- ఎమ్మెల్యే కాకర్ల…/////

ఉదయగిరి:పున్నమి న్యూస్: సెప్టెంబర్ 4 ://// చిన్న వయసులో అంగవైకల్యం కలిగి ఉన్న విద్యార్థుల ప్రత్యేక అవసరాలు తాను బాధ్యతగా తీసుకొని వారి అవసరాలు తీరుస్తానని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. వింజమూరు మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ నందు సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగము ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత ఉపకరణ నిర్ధారణ శిబిర కార్యక్రమం గురువారం విద్యాశాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉదయగిరి శాసనసభ్యుడు కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో ప్రత్యేక అవసరాలు అవసరమైన విద్యార్థుల భవితకు తాను తోడుంటానని వారిని విద్యావంతులను చేసే బాధ్యతను తీసుకుంటానని ఇందుకు ప్రభుత్వం తరఫున అందాల్సిన సహాయ సహకారాలు అందే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో 352 మందికి పైగా ప్రత్యేక అవసరాలు అవసరమైన విద్యార్థులు ఉన్నట్లు వారందరినీ ఈ వేదిక వద్దకు తీసుకురావడం వారికి నిర్ధారణ పరీక్షలు చేయించిన విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ మువ్వా రామలింగం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్రతి మండల కేంద్రంలో విద్యా వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే భవిత కేంద్రానికి వచ్చే విద్యార్థులకు వారి అటెండర్ లకు ప్రభుత్వం ప్రతి ఏడాది ఆర్థిక సాయం పలు రకాలుగా అందించడం జరుగుతుందన్నారు. ప్రత్యేక అవసరాల విద్యార్థుల తల్లిదండ్రులు వారి విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి వారిని విద్యావంతులను చేస్తే వారు వారి జీవనాన్ని కొనసాగించేందుకు చదువు ఎంతగానో ఉపయోగపడుతుందని పిల్లలు తల్లిదండ్రులకు భారం కాకుండా ఉంటారని కాబట్టి ప్రతి ప్రత్యేక అవసరమైన విద్యార్థి తల్లిదండ్రులు శ్రద్ధగా ప్రభుత్వం అందించే సౌకర్యాలతో వారిని విద్యావంతులు చేయాలని కోరారు. వీరికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా ఇస్తున్నాను అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ఇచ్చిన భరోసాతో వారి తల్లిదండ్రులు విద్యార్థులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా, మండల శాఖ అధికారులతో పాటుగా స్థానిక ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు విద్యార్థులు తల్లిదండ్రులు ప్రత్యేక అవసరాల విద్యార్థులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమము

శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయంలో భాగంగా శ్రీకాళహస్తిలో ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నందు పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 59 వ వారం శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమమును పవన్ కళ్యాణ్ ఆశయాల కృషి కోసం పనిచేసే జనసేన నాయకులు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు పేట చంద్రశేఖర్,పేట చిరంజీవి తొట్టంబేడు మండలం ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్, గంధం శ్రీను,మనీ,నవీన్,కల్లిపూడి వెంకటేష్ చంద్ర,చందు,సాయి,యాసీన్ భాష,ముని కుమార్,వీర మహిళలు బత్తెమ్మ, పద్మ, తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

జిల్లా స్థాయి 5కె రెడ్ రన్‌లో రైల్వే కోడూరు విద్యార్థుల ప్రతిభ

రైల్వే కోడూరు, సెప్టెంబర్ 04: అన్నమయ్య జిల్లా రాయచోటిలో జిల్లా మెడికల్ మరియు ఆరోగ్యశాఖ, ఎయిడ్స్ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం నిర్వహించిన జిల్లా స్థాయి 5కె రెడ్ రన్ మారథాన్ పోటీలలో రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. బి.కాం (సి.ఏ) విద్యార్థి శ్రీ యం.నాని ప్రథమ బహుమతిని గెలుచుకొని రూ.10,000 నగదు పురస్కారం అందుకున్నారు. అలాగే బి.ఏ తృతీయ సంవత్సరం విద్యార్థి పి.జగదీష్ నాల్గవ బహుమతిని సాధించారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ డా.యం.భాస్కర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందిస్తూ, “జిల్లా స్థాయిలో విద్యార్థులు సాధించిన విజయం మా కళాశాల గర్వకారణం. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడానికి పూర్తి సహకారం అందిస్తాము” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా.జి.రమేష్, ఆర్.ఆర్.సి. కో ఆర్డినేటర్ డా.ఈ.ప్రేమలత, యన్.ఎస్.ఎస్. కో ఆర్డినేటర్ శ్రీ దాసరి మోషే, ఫిజికల్ డైరెక్టర్ కుమారి ఏ.శ్రావణి పాల్గొన్నారు.

తిరుపతి

గుత్తివారి పల్లి భాదితులను పరామర్శించిన కోలా ఆనంద్

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలంలోని గుత్తివారి పల్లి గ్రామస్థులు కలుషిత నీరు త్రాగడం వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడం జరిగింది.వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించడం జరిగింది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

సాయి రామ్ విద్యానికేతన్ హై స్కూల్లో గురుపూజోత్సవం వేడుకలు ఘనంగా

ఐ.పోలవరం మండలం,గుత్తెనదీవి ,సాయిరామ్ విద్యానికేతన్ హై స్కూల్ లో 2025 గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గురువులను సన్మానించారు. ఈ సందర్భంగా సాయిరామ్ విద్యానికేతన్ హై స్కూల్ ప్రిన్సిపాల్ మాగాపు సీతారత్నం మాట్లాడుతూ జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ,భవిష్యత్తు తరాలను ఉన్నతంగా తీర్చిదిద్దే అరుదైన గౌరవం గురువులకే దక్కుతుందని ఆమె అన్నారు. స్కూల్ కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు ఉపాధ్యాయులను, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థుల మధ్యనే గడిపిన మహోన్నత వ్యక్తి సర్వేపల్లి. ఎదుటివారికి బోధించడం వల్ల తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని బాగా నమ్మిన వ్యక్తి ఆయన .గురు బ్రహ్మ గురుర్విష్ణు గురు దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఈ ప్రపంచంలో గురువే సమస్తం .విద్యాబుద్ధులు నేర్పి మన ఎదుగుదలకు తోడ్పడే గురువులకు మనం ఎంత ఇచ్చిన రుణం తీర్చుకోలేం. మనం ప్రయోజకులమై ఉన్నత స్థానాలు అధిరోహించడమే అసలైన గురుదక్షిణ. పురాణేతిహాసాలు సైతం పిల్లల భవితవ్యాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువు దేనని తెలిపాయి .గురువుకు దైవత్వాన్ని ఆపాదించాయి. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్నారు. ఆ గౌరవం నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది .దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే పురుడు పోసుకుంటుంది అన్నారు పెద్దలు . ఈ సందర్భంగా బొమిడి నాగేంద్ర వర్మ మాట్లాడుతూ నేటి ఉపాధ్యాయులు సర్వేపల్లి ని ఆదర్శంగా తీసుకుని బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాగాపు సీతారత్నం, కరస్పాండెంట్ శ్రీనివాసరావు ,నాటి ధనరాజు, బొమిడి నాగేంద్ర వర్మ ,గెల్లా భూలక్ష్మి, నల్లా దేవకి, కొంకి నాగజ్యోతి , దేవరపల్లి దుర్గా, పోతుల లతా మంగేష్కర్, దుగ్గుదుర్తి వీరలక్ష్మి, గంజా లోవలక్ష్మి, ఏ. ప్రత్యూష , ఏ.శిరీష, వోలేటి అమ్మాజీ, కట్టుంగి నాగ దివ్య, నల్లా విజయ దుర్గ,జగతా రత్నమాలతి, డి .శ్రీ పూర్ణ తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వైభవంగా పెదమడిలో ఏకాహ మహోత్సవం

ఐ పోలవరం మండలం ఐ పోలవరం పంచాయతీ పెదమడి గ్రామంలో కళ్యాణ రామ శెట్టిబలిజ యువజన సంఘం ఆధ్వర్యంలో 27వ వార్షికోత్సవం సందర్భంగా గణపతి మండపం వద్ద శ్రీనివాస భక్త బృందం యనమదల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏకాహ మహోత్సవం లో భజన కళాకారులు నానామృతముతో భక్తి పాటలు ఆలపించి భక్తులను తన్మై పరసినారు సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ కనకారావు మాట్లాడుతూ గణపతిని పూజించడం వలన జ్ఞానము సిద్దంపజేసి విఘ్నాలు లేకుండా చేస్తాడు అన్నారు అలాగే ఈ గణపతి మండపాలు ఏర్పాటు వలన సమాజంలో ప్రజల మధ్య సఖ్యత స్నేహభావం పెరుగుతుంది హిందువులంతా మన ధర్మం యొక్క విశిష్టతను తెలుసుకొని ధర్మాన్ని కాపాడుకొనే బాధ్యత అందరం తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సాన బోయిన రాంబాబు పాటి వీరన్నబాబు గుత్తుల వెంకటేశ్వరరావు గుబ్బల శ్రీనివాసరావు మేడిశెట్టి గంగిశెట్టి గుబ్బల నాగబాబు మేడిశెట్టి బుజ్జి కముజు శ్రీనివాసరావు చప్పిడి దానేశ్వరరావు పాటి కాశి ఈశ్వరరావు పాటి వెంకన్న, భీముడు కొండేపూడి రాజు గుత్తుల యోగేశ్వరరావు, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి

ఎమ్మెల్యే అంజిబాబును కలిసిన భీమవరం శ్రీదాసాంజనేయ స్వామి దేవస్థానం పాలక వర్గం

భీమవరం : భీమవరం శ్రీదాసాంజనేయ స్వామి దేవస్థానం నూతన పాలకవర్గ సభ్యులు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆలయ అధ్యక్షులుగా దారపురెడ్డి త్రివిక్రమ్, సభ్యులు వేలూరి సుబ్రహ్మణ్యం, మెంటే మనోజ్ కుమార్, యర్రంశెట్టి గౌతమ్, యియ్యపు మాధవి, వేపాడ లక్ష్మి, ములుగుర్తి శ్రీనివాసరావు, గంధం రాధ నియమితులయ్యారు. ఇచ్చిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాలయంలో ఏర్పాట్లు చూడాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి

భీమవరం నియోజవర్గంలో జనసేనని

భీమవరం నియోజవర్గంలో జనసేనని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా జనసేన నాయకులు ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్న రాష్ట్ర పీఏసీ చైర్మన్ మరియు భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు, వారి తనయులు పులపర్తి ప్రశాంత్ గారు మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు…

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.