Thursday, 7 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

పెట్రోలు బంక్ యజమానిపై, సిబ్బందిపై ఫిర్యాదు

సెప్టెంబర్ పున్నమి ప్రతినిధి @ పెట్రోల్ బంకుల్లో మంచి నీళ్లు లేకపోయినా వాహనాలకు గాలి సౌకర్యం లేకపోయినా టాయిలెట్ వాడుకోవడానికి అవకాశం లేకపోయినా, శుభ్రం లేకపోయినా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మందులు లేకపోయినా . పెట్రోలు, డీజిల్ కల్తీ జరిగినా . పెట్రోల్, డీజిల్ కొలతలు తేడా వచ్చిన పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బంది మన పట్ల దురుసుగా ప్రవర్తించిన. పెట్రోలు బంక్ యజమానిపై, సిబ్బందిపై ఫిర్యాదు చేయడానికి, పెట్రోలు సరఫరా చేసే సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు . ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు ఇండియన్ ఆయిల్-1800233355 భారత్ పెట్రోలియం-1800224344 హెచ్పిసిఎల్-18002333555 రిలయన్స్-18008919023.

ఆంధ్రప్రదేశ్

టీటీడీకి ఏపీ హైకోర్టు ఆదేశాలు

సెప్టెంబర్ 04 పున్నమి ప్రతినిధి @ తిరుమల నడకదారి భక్తుల రక్షణకు చర్యలు చేపట్టాలి అలిపిరి నడకమార్గంలో ఇరువైపులా ఇనుపకంచె ఏర్పాటు చేయాలని ఆదేశం ఈ ఏడాది నవంబర్‌లోగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశం సిఫార్సుల అమలు బాధ్యత జాయింట్ కమిటీకి అప్పగింత

జాతీయ అంతర్జాతీయ

దేశ వ్యాప్తంగా పార్టీల నుంచి సస్పెండ్ అయిన కుటుంబ సభ్యులు.

సెప్టెంబర్ 04 పున్నమి ప్రతినిధి @ 1.కాంగ్రెస్ పార్టీలో మేనకాగాంధీ 2.ఉమ్మడి ఏపీలో టీడీపీ నుంచి హరికృష్ణ,దగ్గుబాటి వెంకటేశ్వరరావు 3.తమిళనాడులో డీఎంకే నుంచి అళగిరి 4.అన్నాడీఎంకే నుంచి శశికళ 5.యూపీలో సమాజ్ వాదీ పార్టీ నుంచి శివపాల్ యాదవ్ 6.యూపీలో అప్నాదళ్ పార్టీ నుంచి అనుప్రియా పటేల్ 7.బీహార్ లో ఆర్జేడీ నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ 8.కర్ణాటకలో జెడిఎస్ నుంచి రేవన్న 9.హర్యానాలో ఐ.ఎన్.ఎల్.డి నుంచి దుష్యంత్ చౌతాలా 10.మహారాష్ట్రలో శివసేన నుంచి రాజ్ థాకరే 11.మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్ 12.ఏపీలో తన సోదరుడు వైఎస్ జగన్ తో విభేదించి పార్టీని స్థాపించి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల 13.తాజాగా తెలంగాణలో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బిఆర్ఎస్..

జాతీయ అంతర్జాతీయ

ట్రాఫిక్ చలాన్లు కాదు.. ముందు మీరు టాక్స్ కట్టండి.. ఓ యువకుడి వింత నిరసన!

సెప్టెంబర్ 04 పున్నమి ప్రతినిధి @ బైక్‌పై వెళ్తే నిబంధనల పేరుతో ఫైన్ వేస్తున్నారు. అన్ని రకాల టాక్సులు వసూలు చేస్తున్నారు. కానీ.. రోడ్డు మరమ్మతులు చేయడం లేదంటూ ఓ యువకుడు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఏకంగా నడిరోడ్డుపై గుంతలో కూర్చొని నిరసన తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్‌లోని రేకుర్తి చౌరస్తాలో గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు అధ్వాన్నంగా మారిపోయింది. కరీంనగర్ నుండి నిజామాబాద్ నేషనల్ హైవే అయినప్పటికీ అధికారులు గాని, పొలిటికల్ లీడర్స్ గాని ఎవరూ పట్టించుకోవడం లేదని కరీంనగర్‌కు చెందిన కోట శ్యామ్ కుమార్ నిరసన కార్యక్రమం చేపట్టారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు బాగా లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని శ్యామ్ కుమార్ వాపోయారు. రోడ్డుపై వాహనం నడపాలంటేనే భయం వేస్తుందన్నారు. మరోవైపు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదని పోలీసులు ఫైన్‌ల రూపంలో జరిమానాలు కట్టిస్తున్నారన్నారు. GST లు, రోడ్డు టాక్స్ కడుతున్నాను కానీ, అసలు రోడ్లే

చిత్తూరు

*ఎమ్మెల్యేను సన్మానించిన స్టేట్ డైరెక్టర్లు*

పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డిని స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లుగా నియమితులైన వి.కోటకు చెందిన రంగనాధ్, గజేంద్రలు గురువారం కలసి సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గా వీ.కోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎ. ఎం. రంగనాధ్ ను, అదే మండలానికి చెందిన గజేంద్రను ఏపీ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నియమితులైన విషయం తెలిసిందే. పార్టీ కోసం పనిచేసిన తమ సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయి పదవులకు ఎంపిక చేసిన స్థానిక శాసన సభ్యులను ఈ సందర్బంగా పలమనేరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలసి ఆయన్ను సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంబాబు, మురుగేష్,చంద్ర శేఖర్ రెడ్డి, హరి, ఆనంద,వెంకటేష్, హేమకుమార్ తదితరులున్నారు.

చిత్తూరు

బాల్య వివాహాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలి : ఆర్డీవో*

బాల్య వివాహాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని పలమనేరు ఆర్డీవో భవానీ అన్నారు. గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో డివిజన్‌ స్థాయి అధికారులకు నిర్వహించిన ఒక రోజు శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల చట్టాలపై అవగాహన, బాల్య వివాహాల నిర్మూలన చేపట్టడమే శిక్షణ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. బాలలకు సంబంధించిన చట్టాలు, శిక్షలు బాల్యవివాహాలు నిరోధక చట్టం 2006, బాలలపై లైంగిక నిరోధక చట్టం, ఉచిత నిర్బంధ విద్య, లింగ నిర్ధారణ పరీక్ష చట్టం యొక్క తీవ్రత గురించి క్షుణ్ణంగా వివరించారు. గ్రామస్థాయిా సీఎం వీవోల ఫోన్‌ నెంబర్లను ప్రతి స్కూల్‌ నందు నోటీస్‌ బోర్డులో ఉంచాలని వారు విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి అధికారి తమ వంతు బాధ్యతగా కృషి చేయవలసిన ఆవశ్యకత ఉందన్నారు. సమాజంలో బాలలపై జరుగుతున్న అకృత్యాలను ఆపడంతో పాటు మూఢ నమ్మకాల వల్ల జరిగే అనర్ధాలపై సమాజానికి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి వార్డు, గ్రామ సచివాలయ పరిధిలో దీనిపై ఒక రిజిష్టరు నిర్వహణలో ఉంచాలన్నారు. డిస్టిక్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ దాసరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బాల్య వివాహాల చట్టం, లైంగిక నేరాల చట్టాలపై శిక్షణ అందించారు. లీగల్‌ ప్రొఫెషన్‌ ఆఫీసర్‌ ఎంఎస్‌ వెంకటేశులు జోనల్‌ జస్టిస్‌ ఆక్ట్‌ 2015 గురించి వివరించారు. ప్రొటెక్షన్‌ ఆఫీస్‌ నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ కేర్‌ సి.శివశంకర్‌ అడాప్షన్‌ ప్రాసెస్, స్పాన్సర్షిప్‌ గురించి వివరించారు. ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ కేర్‌ రాధా రాణి మాట్లాడుతూ చైల్డ్‌ కేర్‌ ఇన్‌స్టిట్యూషన్‌ సేవల గురించి వివరించారు. చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ డిస్టిక్‌ కోఆర్డినేటర్‌ నాగమణి 1098 సర్వీస్‌ గురించి, ఉమెన్‌ హెల్ప్‌ లైన్‌ అండ్‌ సర్వీసెస్‌ 181 వివరించారు. డిఈఎమ్‌వో అండ్‌ డిఎం అండ్‌ హెచ్‌వో జయరాముడు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమన్న అంశాన్ని వివరించారు. ఈ కార్యక్రమానికి ఎంఈవోలు, ఎంపీడీవోలు, మెడికల్‌ ఆఫీసర్లు, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, వార్డ్‌ అండ్‌ విలేజ్‌ సెక్రెటరీలు,డిస్ట్రిక్ట్‌ూ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌ సిబ్బంది, చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ సర్వీసెస్‌ సిబ్బంది, ఉమెన్స్‌ హెల్ప్‌ లైన్‌ సర్వీసెస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

డిప్యూటీ నర్సింగ్ గ్రేడ్ 2 అధికారులకు ఘన సన్మానం..

నాగర్ కర్నూల్ జిల్లా పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 4 రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కల్పించిన పదోన్నతిలో భాగంగా నర్సింగ్ గ్రేడ్ 2 ఆఫీసర్లుగా నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి పదోన్నతి పై వచ్చిన డిప్యూటీ నర్సింగ్ సూపర్డెంట్ గ్రేడ్ 2 మంజుల, పార్శి సుమన్ లకు గురువారం నాడు ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో పూలమాలలు, బొకేలు,శాలువాలతో జిల్లా నర్సింగ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు జానక దేవి కార్యదర్శి జోనల్ అధ్యక్షులు మన్మోహన్ రెడ్డి లోఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పి. రాజు మాట్లాడుతూ నర్సింగ్ వృత్తి కేవలంవృత్తి దృష్టి మాత్రమే కాకుండా మానవత్వం సేవా భావం అంకితభావంతో రోగులకు సేవ చేసిన నాడే నిజమైనగుర్తింపు వస్తుందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నర్సింగ్ అధికారుల సేవలందించి పదోన్నతిపై ఇక్కడికి రావడం అభినందనీయమని అన్నారు.వీరి సేవలు, అనుభవంతో కూడిన ఆరోగ్య సూచనలు ఈ ప్రాంత ప్రజలకు వినియోగించాలనీకోరారు.ఈ కార్యక్రమంలో నర్సింగ్ అధికారులు ఎం ఆనంద్ కుమార్, మహేష్,సురేష్, కృష్ణవేణి, జ్ఞానేశ్వరి, శ్వేత, పుష్పలత,సువేద, కవిత లు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

రేషన్‌కార్డు లబ్ధిదారులకు గుడ్ న్యూస్.

సెప్టెంబర్ 04 పున్నమి ప్రతినిధి @ రేషన్‌కార్డు లబ్ధిదారులకు గుడ్ న్యూస్. ఇకపై రేషన్ దుకాణాలు నెలంతా తెరిచే విధంగా పౌరసరఫరాల శాఖ త్వరలో ఆదేశాలు. ఈ మేరకు వివరాలు వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్.

జాతీయ అంతర్జాతీయ

నెల 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లు అమలు.

సెప్టెంబర్ 04పున్నమి ప్రతినిధి @ దిల్లీ: జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లను అమలు చేయాలని నిర్ణయించారు. ఇకపై జీఎస్టీలో రెండు స్లాబ్లు (5, 18 శాతం) మాత్రమే కొనసాగించనున్నారు. జీఎస్టీలో ప్రస్తుతం కొనసాగుతోన్న 12, 28 శాతం స్లాబ్స్ తొలగించాలని నిర్ణయించారు. విలాస వస్తువులపై 40శాతం పన్ను విధించాలని నిర్ణయించారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థికమం నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని తెలిపారు. జీఎస్టీలో రెండు స్లాబ్లు మాత్రమే కొనసాగించాలని నిర్ణయించామన్నారు. ముఖ్యంగా రైతులు, సామాన్య ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. వ్యవసాయం. వైద్య రంగానికి ఊరట కలిగించే నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. జీఎస్టీ ఫైలింగ్ను కూడా సరళతరం చేస్తున్నామన్నారు. కొత్త స్లాబ్లతో పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఊరట కలుగుతుందన్న ఆమె చాలా ఆహార పదార్థాలపై సున్నా శాతం జీఎస్టీ ఉంటుందన్నారు. పేదలు, సామాన్యులు అధికంగా వాడే వస్తువులపై 5శాతం జీఎస్టీ ఉంటుందన్నారు. అన్ని టీవీలపై 18శాతం జీఎస్టీ ఉంటుందని చెప్పారు. అన్ని రకాల వ్యక్తిగత, జీవిత బీమా ఇన్సూరెన్స్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు. వ్యక్తిగత లైఫ్, హెల్త్, టర్మ్ బీమా పాలసీలపై జీఎస్టీ తొలగింపు వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ 12 నుంచి 5శాతానికి తగ్గింపు చేనేత, మార్బుల్, గ్రానైట్పై 5శాతం జీఎస్టీ సిమెంట్పై జీఎస్టీ 28శాతం నుంచి 18 శాతానికి తగ్గింపు 33 ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని 12శాతం నుంచి 0కి తగ్గింపు 350 సీసీ కంటే తక్కువ వాహనాలపై జీఎస్టీ 28శాతం నుంచి 18శాతానికి తగ్గింపు ఫెర్టిలైజర్స్, ఎరువులపై జీఎస్టీ 18శాతం నుంచి 5శాతానికి తగ్గింపు పాన్ మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై 40శాతం జీఎస్టీ ఫ్రూట్ జ్యూస్ కాకుండా నాన్ ఆల్కాహాలిక్ బ్రేవరేజెస్పై 40 శాతం పన్ను

జాతీయ అంతర్జాతీయ

మాజీ స్టార్ క్రికెటర్‌కు ఈడీ నోటీసులు

సెప్టెంబర్ 04 పున్నమి ప్రతినిధి @ భారత మాజీ స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. అక్రమ బెట్టింగ్ యాప్‌తో మనీలాండరింగ్ జరిగిందని నేడు ఈడీ ధావన్‌ను ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆయనకు ఇవాళ నోటీసులు జారీ చేసింది. ఎక్స్ బెట్ అనే అక్రమ బెట్టింగ్ యాప్‌తో సంబంధం కలిగి ఉన్నారంటూ మనీలాండరింగ్ కేసులో శిఖర్ ధవన్‌ను ప్రశ్నించనున్నారు. అయితే, 1 ఎక్స్ బెట్ సంస్థతో అతడు ఎండార్స్‌మెంట్లు చేసుకున్నాడని ఈడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే విచారణలో భాగంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద శిఖర్ ధవన్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. అయితే, గత నెలలో భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనాను కూడా ఈడీ ఇదే కేసులో ప్రశ్నించింది. అనేక మంది పెట్టుబడిదారులను మోసం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 1 ఎక్స్ బెట్ యాప్ సంస్థపై ఈడీ విస్తృతంగా విచారణ చేపడుతోంది. కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం రియల్ మనీ ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధించే చట్టాన్ని తీసుకొచ్చింది. యువత వ్యసనాలు, ఆర్థిక మోసాలను నిరోధించేందుకు కేంద్రం ఆలైన్ బెట్టింగ్ యాప్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.