Thursday, 7 May 2026

Blog

తిరుపతి

డయేరియా బాధితులను పరామర్శించిన కాంగ్రెస్ నేతలు*

రేణిగుంట మండలం గుత్తి వారి పల్లి గ్రామం నందు త్రాగునీరు కలుషితం కావడంతో సుమారు 40 మంది డయేరియాతో బాలాజీ మెడికల్ కాలేజీ నందు చికిత్స పొందుతున్నటువంటి డయేరియా బాధితులను తిరుపతి జిల్లా డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు,శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి హాస్పిటల్ ను సందర్శించి వారిని పరామర్శించడం జరిగినది.అనంతరం హాస్పిటల్ వైద్యులతో మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ తో డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.అదేవిధంగా బాధితులతో మాట్లాడి వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయని వారికి భరోసా కల్పించడం జరిగినది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*టేకు చెట్లు… ఆమె పొలంలో లేవు.

*టేకు చెట్లు… ఆమె పొలంలో లేవు…* *పొలం యజమాని రామ్మూర్తి* పొదలకూరు మండలంలోని మరుపూరు గ్రామ సమీపంలో బింగిమళ్ళ. రామ మూర్తి, వినోద్ సింగ్, టీడీపీ యువ నాయకుడు డేగా. యస్వంత్ రెడ్డి, తెలుగు యువత ఉపాధ్యక్షుడు ఆదాల. మురళి రెడ్డి టేకు చెట్ల పొలం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 2009 నుండి ఈ పొలం మా అధీనంలో వుంది ఇటీవల టేకు చెట్లు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేశారు. దాని మీద పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాము. వాళ్లు విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. రాజేశ్వరమ్మ అనే ఆమె మా పొలంలో టేకు చెట్లు టీడీపీ నేతలు నరికి వేశారంటూ మాట్లాడడం హాస్యస్పదమన్నారు. ఆమె పొలంలో టేకు చెట్లు లేవు. ఒకవేళ ఉంటే ఆధారాలు చూపించాలన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి. చంద్రమోహన్ రెడ్డి కి, త్వరలో మంత్రి పదవి వస్తుందని ఆయన మీద లేని పోనీ ఆరోపణలు చేసి వదంతులు సృష్టిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదుఅని పద్ధతి మార్చుకోవాలన్నారు.

అన్నమయ్య

చిట్వేల్‌లో లడ్డు యాలం పాట – 23 వేల విరాళం సమర్పించిన ఆవులకుంట ప్రసాద్

చిట్వేలి సెప్టెంబరు (పున్నమి ప్రతినిధి) చిట్వేల్ మండలంలోని గాంధీనగర్ వాసి ఆవులకుంట ప్రసాద్ గారు గురువారం భక్తి శ్రద్ధలతో లడ్డు యాలం పాట పాడుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా పాల్గొని భక్తి గీతాలతో భక్తులను ఆకట్టుకున్నారు. ఆవులకుంట ప్రసాద్ గారు భక్తి భావంతో రూ.23,000 విరాళంగా సమర్పించడం విశేషం.ప్రతి ఏడాది జరిగే లడ్డు యాలం పాటలో ఆయన ప్రత్యేకంగా పాల్గొంటూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉద్ధరించారని భక్తులు తెలిపారు. ప్రసాద్ గారి సేవా మనసు, దైవభక్తి అందరికీ ఆదర్శప్రాయమని స్థానిక పెద్దలు అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కీర్తనలు, భక్తి గీతాలతో పాల్గొని వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా మార్చారు.

E-పేపర్

శ్రీ త్రికోటేశ్వరలో ముందస్తు మిలాద్ – ఉన్ – నబీ వేడుకలు

చేజర్ల సెప్టెంబరు (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలం ఆదురుపల్లిలోని శ్రీత్రికోటేశ్వర విద్యాలయంలో ఇస్లాం మత స్థాపకుడైన మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. తదుపరి నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మీ నరసారెడ్డి, డైరెక్టర్ సుధాకర్ రెడ్డి మరియు ప్రధానోపాధ్యాయులు కృష్ణ చైతన్య మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త యొక్క జీవిత చరిత్ర, ఖురాన్ బోధనలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థుల్లో మతసామరస్యానికి ప్రతీకగా శ్రీ త్రికోటేశ్వర విద్యాలయంలో ప్రతి పండుగను ఘనంగా జరుపుతామని చెప్పారు. కార్యక్రమంలో స్కూలు ఉపాధ్యాయులు, బాల బాలికలు పాల్గొన్నారు.

ఎలూరు

ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం

ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి మండలంలోని పలు గ్రామాల్లో వినాయకుని నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. వడ్లమానులో విఘ్నేశ్వరుడికు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో 2వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించి నిమజ్జనం చేశారు. ఆగిరిపల్లి, నూగుండపల్లి లో వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి నిమజ్జనానికి తరలించారు. ఈ కార్యక్రమంలో వడ్లమాను ఎంపీటీసీ సభ్యులు రాణి మేకల సత్యనారాయణ, వైయస్సార్ సిపి నాయకులు కుప్పాల నాగరాజు, సర్పంచ్ జలసూత్రం వంశీ కృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

చెట్లు నరికితే లక్ష జరిమానా….

*చెట్లు నరికితే.. ఒక్కో వృక్షానికి రూ. లక్ష జరిమానా* .. *సుప్రీంకోర్టు సంచలన తీర్పు* *చెట్లను నరకడం పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. దీనివల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని.. వర్షాలు సరిగ్గా పడవు*. వాయు కాలుష్యం పెరుగుతుంది. ప్రజలు అనారోగ్యం పాలవుతారు. అందుకే చెట్లను నరకడం నేరం. ప్రతి ఒక్కరికీ పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. చెట్లను నాటి.. వాటిని సంరక్షించాలి. పర్యావరణాన్ని కాపాడితే మన భవిష్యత్తును మనం కాపాడుకున్నట్లేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. *చెట్లు నరకడం మనిషిని చంపడం కంటే దారుణమని, పర్యావరణానికి నష్టం కలిగించే వారిపై దయ చూపరాదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది*. *అక్రమంగా చెట్లు నరికితే ఒక్కోదానికి రూ. 1 లక్ష జరిమానా విధించాలని స్పష్టం చేసింది*

ఆంధ్రప్రదేశ్

ప్రజాస్వామ్య రక్షణ కోసం పోస్ట్ కార్డ్ ఉద్యమం

*ప్రజాస్వామ్య రక్షణ కోసం పోస్ట్ కార్డ్ ఉద్యమం* ★ పీలేరులో రాహుల్ గాంధీకి మద్దతుగా పోస్ట్ కార్డు ఉద్యమం. ★ డిజిటల్ ఓటరు జాబితాను వెంటనే ప్రచురించాలి. ★ నకిలీ ఓటర్ల ద్వారా జరుగుతున్న ఓటు చోరిని అరికట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. ★ NSUI రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల.అమృత్ తేజ డిమాండ్ పీలేరు,అన్నమయ్య జిల్లా: లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న “ఓట్-చోరీ” ఉద్యమానికి మద్దతుగా దేశ ప్రజాస్వామ్య రక్షణ కోసం ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల అమృత్ తేజ ఆధ్వర్యంలో రాష్ట్రపతి గారికి పీలేరు పట్టణంలోని ప్రధాన తపాల కార్యాలయం దగ్గర ఉన్న పోస్ట్ బాక్స్ ద్వారా పోస్ట్ కార్డులు పంపించారు. ఈ సందర్భంగా అమృత్ తేజ మాట్లాడుతూ “ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత పవిత్రమైనది. కానీ నకిలీ ఓటర్ల ద్వారా జరుగుతున్న ఓటు చోరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోంది అని అన్నారు. ఓట్-చోర్ ని అరికట్టడానికి రాష్ట్రపతి గారు వెంటనే జోక్యం చేసుకుని డిజిటల్ ఓటరు జాబితాను ప్రచురించడమే కాకుండా, ఓటు చోరిని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ కోసం మరియు రాజ్యాంగం ద్వారా ప్రజలు పొందిన ఓటు హక్కును కాపాడడానికి ఒక యోధుడిలా ఉద్యమానికి సిద్ధమయ్యారని తెలిపారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్-చోర్ ఉద్యమానికి రోజురోజుకు ప్రజల మద్దతు పెరుగుతోందని తెలిపారు. రాహుల్ గాంధీ ఇంతకుముందు మీడియా సమావేశంలో ఓట్-చోర్ అంశం పై చూపించిన వాస్తవాలు ఆటంబాంబు లాంటివని మరికొద్ది రోజుల్లో హైడ్రోజన్ బాంబు లాంటి మరిన్ని ఆధారాలు ప్రజల ముందు పెట్టబోతునట్టు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.యూ.ఐ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాయి సంపత్ , లోకేష్, యశ్వంత్, మహేంద్ర, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

రైల్వేకోడూరు డిగ్రీ కళాశాల విద్యార్థులకు జిల్లా స్థాయి 5కె మారథాన్‌లో విజయాలు

అన్నమయ్య జిల్లా రాయచోటిలో జిల్లా మెడికల్ & ఆరోగ్యశాఖ, ఎయిడ్స్ నివారణ సంస్థ ఆధ్వర్యంలో యువత కోసం ఈరోజు ఉదయం 6 గంటలకు నిర్వహించిన జిల్లా స్థాయి 5కె రెడ్ రన్ మారథాన్లో రైల్వేకోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.బి.కాం (సి.ఏ) విద్యార్థి శ్రీ వై. నాని ప్రథమ బహుమతిని సాధించి ₹10,000 నగదు పురస్కారం అందుకున్నారు. అలాగే బి.ఏ తృతీయ సంవత్సరం విద్యార్థి పి. జగదీశ్ నాలుగో బహుమతిని సాధించారు.విద్యార్థుల విజయంపై కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై. భాస్కర్ రెడ్డి అభినందనలు తెలుపుతూ, “జిల్లా స్థాయిలో విజయం సాధించడం కళాశాల గర్వకారణం. రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు పూర్తి సహకారం అందిస్తాము” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రమేష్, ఆర్.ఆర్.సి కోఆర్డినేటర్ డాక్టర్ ఈ. ప్రేమలత, యన్.ఎస్.ఎస్ కోఆర్డినేటర్ శ్రీ దాసరి మోషే, ఫిజికల్ డైరెక్టర్ కుమారి ఏ. శ్రావణి పాల్గొన్నారు.

కాకినాడ

నర్సింగ్ విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యతపై అవగాహనా సదస్సు

కాకినాడ రూరల్, శశికాంత్నగర్లో గల ఆదిత్య నర్సింగ్ కాలేజ్ నందు గురువారం ఉదయం నర్సింగ్ విద్యార్థులకు ఉద్యోగనైపుణ్యతపై అవగహనా సదస్సును ఆదిత్య విద్యా సంస్థల ఛైర్మన్ డా. ఎన్. శేషారెడ్డి గారు మరియు డైరెక్టర్ డా. ఎన్. సుగుణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సదస్సులో హైదరాబాద్ డాల్ఫిన్టిక్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ నర్సింగ్ ట్రైనింగ్ సెంటర్ నుండి ట్రైనింగ్ డైరెక్టర్ లక్ష్మీరావు హాజరై నర్సింగ్ విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యతపై చక్కని అవగహన కల్పిస్తూ మన దేశంలో కార్పొరేట్ హాస్పిటల్లో మరియు జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యు.కె., మిడిలీస్ట్ దేశాల హాస్పిటల్స్లో ఉద్యోగాలు సాధించడానికి కావలసిన శిక్షణను తమ సంస్థ ద్వారా అందిస్తామని దానికి సంబంధించిన విధి విధానాలను వివరించారు. ప్రతి విద్యార్థిని యొక్క ఆలోచనలను వ్యక్తిగతంగా అడిగి తెలుసుకుని వారి భవిష్యత్తుకు మంచి తర్ఫీదునిచ్చి తోడ్పడతామని తెలియజేసారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ట్రైనింగ్ డైరెక్టర్ లక్ష్మీరావు మరియు ట్రీనిటీ డైరెక్టర్ రిక్కీ గూటమ్, రిటైర్డ్ కర్నల్ డా. ఎస్.బి.రావు, కాకినాడ జి.జి. హెచ్ నర్సింగ్ కాలేజ్ రిటైర్డు ప్రిన్సిపాల్ సుగుణ, ఆదిత్య కాలేజ్ ఆఫ్ సర్సింగ్ ప్రిన్సిపల్ ఎన్. సంధ్యారాణి మరియు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. చివరిగా కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి లక్ష్మీరావు కృతజ్ఞతలు తెలియజేసారు.

కాకినాడ

వచ్చే ఏడాది మార్చి వరకు సికింద్రాబాద్ కు ప్రత్యేక రైలు సర్వీసులు పొడిగింపు* ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వెల్లడి

కాకినాడ, సెప్టెంబర్ 4: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాకినాడ – సికింద్రాబాద్ ల మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు సర్వీసులను వచ్చే ఏడాది మర్చి వరకు పొడిగించడంతో పాటు అదనంగా మరో ప్రత్యేక రైలు సర్వీస్ ని కేటాయించినట్లు కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వెల్లడించారు. గురువారం కాకినాడలో ఆయన మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజల విజ్ఞప్తి మేరకు సికింద్రాబాద్ కు నడుస్తున్న ప్రత్యేక రైల్వే సర్వీస్ లను మరికొంత కాలం పొడిగించాలని కోరుతూ ఈ ఏడాది జూన్ 19 న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కు లేఖ రాయడం జరిగిందన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు ప్రస్తుతం వారానికి మూడు రోజులు కాకినాడ నుండి లింగంపల్లి వరకు నడుస్తున్న ప్రత్యేక రైలు తో పాటు అదనంగా ప్రతి శనివారం కాకినాడ నుండి చర్లపల్లికి ప్రత్యేక రైలు సర్వీస్ ను కేటాయించినట్టు తెలిపారు. ఈ రెండు ప్రత్యేక రైలు సర్వీసులు వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగుతాయన్నారు. దీనికి సంబంధించి రైల్వే శాఖ అధికారుల నుండి సమాచారం వచ్చిందని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.