Thursday, 7 May 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అప్పనపల్లి ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు..!

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సెప్టెంబర్ 05 పున్నమి ప్రతినిధి@ మనం తినే ఆహారం ఎంత రుచిగా ఉండాలని కోరుకుంటామో… మా విద్యార్థులు మంచి చదువు నేర్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకునే మా అప్పనపల్లి ఎంపీపీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు నైనాల రఘు రామయ్య, బాలెం పెద్దిరాజు, బాలెం రామకృష్ణ ,షబ్బీర్ హుస్సేన్ లకు శిష్యుల ఎదుగుదలే గురుదక్షిణగా భావించే పూజ్యులైన గురువులకు మా హృదయపూర్వకంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు..!

E-పేపర్

రూ. 2.63 లక్షల విలువైన రేషన్ పట్టివేత

రాయచోటి పట్టణం అలీమాబాద్ వీధిలోని చౌక ధరల దుకాణంలో గురువారం విజిలెన్స్ అధికారులు తనిఖీ నిర్వహించారు.అక్రమంగా నిల్వ ఉంచిన 5362 బస్తాల రేషన్ బియ్యం,341 కిలోల పంచదారను గుర్తించిన విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు.అధికార డీలర్ కాకుండా ఇతర బినామీలు సరుకులు విక్రయిస్తుండగా దాడులు నిర్వహించారు.పట్టుబడిన సరుకుల విలువ రూ. 2.63 లక్షలు ఉంటుందన్నారు.

E-పేపర్

7న అటవీ శాఖలో ఉద్యోగాలకు పరీక్ష

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలను ఈనెల 7న నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు.ఫారెస్ట్ బీట్ ఆఫీసర్,అసిస్టెంట్ బిట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు సెక్షన్ ఆఫీసరుకు సంబంధించి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్ష ఉంటుందని వివరించారు.ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు.

E-పేపర్

ప్రొద్దుటూరు మున్సిపల్ హైస్కూల్‌లో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు

ప్రొద్దుటూరు మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఈనెల 7న ఆదివారం అండర్ 18, 20 స్త్రీ, పురుషుల కోసం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరుగనున్నాయి అని బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ కార్యదర్శి అహ్మర్ బాషా గురువారం వెల్లడించారు. 100, 200, 400, 1000 మీటర్లు పరుగు, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో వంటి విభాగాల పోటీలు ఉంటాయి. ప్రతిభ చూపిన అథ్లెట్లు రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ కోసం ఎంపిక అవుతారని, యువతకు క్రీడా రంగంలో ప్రోత్సాహం కల్పించే అవకాశం అని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్

గురువు ఎందుకో వెనకబడ్డాడు

విద్యార్థులకు రాయడం,చదవడం నేర్పినప్పుడు మేము రాయము అని వాళ్లు తల్లిదండ్రులకు చెప్పినప్పుడు గురువు ఎందుకో వెనకబడ్డాడు విద్యార్థుల్ని దండించినప్పుడు తల్లిదండ్రుల ఫిర్యాదులకు క్షమాపణ చెప్పినప్పుడు గురువు ఎందుకో వెనకబడ్డాడు విద్యార్థులకు అర్థం కాని సమయంలో వివరించి చెప్పినప్పుడు వచ్చే విమర్శను ఎదుర్కొన్నప్పుడు గురువు ఎందుకో వెనకబడ్డాడు పరీక్ష జరిగే సమయంలో పదిసార్లు వివరించినప్పుడు అయిన మాకు అర్థం కాలేదు అని విద్యార్థులు చెప్పినప్పుడు గురువు ఎందుకో వెనకబడ్డాడు క్రమశిక్షణ నేర్పినప్పుడు విద్యార్థులకు భయభక్తులు లేకపోవడం చూసినప్పుడు గురువు ఎందుకో వెనకబడ్డాడు విద్యార్థులకు, పాఠశాలలకు మధ్యవర్తిగా ఉన్నప్పుడు ఒక వారధిగా పాఠాలను బోధించినప్పుడు గురువు ఎందుకో వెనకబడ్డాడు బెత్తంతో లేదా చెంప దెబ్బ గట్టిగా లేక సన్నగా కొట్టినప్పుడు, విద్యార్థులు ఓర్చుకోలేనప్పుడు గురువు ఎందుకో వెనకబడ్డాడు బోధనను ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్పినప్పుడు విరామం, అలసట లేక, విద్యార్థులకు ఇంకా నేర్పలేదే అనే తపన తనలో కలిగినప్పుడు గురువు ఎందుకో వెనకబడ్డాడు మారుతున్న సమాజానికి మార్చుకొని బోధించినప్పుడు విద్యార్థులు అర్థం చేసుకోనప్పుడు గురువు ఎందుకో వెనకబడ్డాడు విద్యార్థుల నడవడికను, ఆలోచనలను మార్చుకోమని చెప్పినప్పుడు మాట ద్వారానో, చేతి ద్వారానో దండించినప్పుడు గురువు ఎందుకో వెనకబడ్డాడు నన్నం.లోకేష్

E-పేపర్

రూ.70 వేలు పలికిన వినాయక లడ్డూ వేలం

సిద్ధవటం దిగుపేటలోని ప్రధాన రహదారి వద్ద వినాయక చవితి పండగ సందర్భంగా గణపతి వద్ద ఉంచిన లడ్డూ వేలాన్ని గురువారం నిర్వహించారు.ఈ లడ్డూను అదే గ్రామానికి చెందిన గిద్దలూరు కుటుంబీకులు రూ.70 వేలకు దక్కించుకున్నారు.వేలంపాటలో వినాయకుడి లడ్డూను దక్కించుకోవడం ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అన్నమయ్య

“వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో వినాయక నిమజ్జనం వైభవంగా

చిట్వేల్ మండలంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణం వద్ద వినాయక స్వామి నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగింది. డీజే, బ్యాండ్ మేళాలతో ఊరంతా సందడిగా మారి, గణపయ్య నినాదాలతో వాతావరణం మార్మోగింది. చిన్నా పెద్దా అందరూ పాల్గొని గణనాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమం ఆలియా కమిటీ కార్యకర్త కట్ట రామ్మోహన్ నాయుడు, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత శ్రద్ధగా నిర్వహించబడింది. భక్తులు పెద్ద ఎత్తున హాజరై గణపయ్య సేవలో భాగమయ్యారు. గ్రామ యువత గుంపులు గుంపులుగా చేరి డీజే బాణీలు, భక్తి గీతాలకు నాట్యం చేస్తూ ఉత్సవాన్ని మరింత ఉత్సాహవంతం చేశారు. ఈ సందర్భంలో నిర్వహించిన లడ్డు యాలం పోటీలో చిట్వేలు మండలం గాంధీనగర్ వాస్తవ్యులు ఆవులకుంట ప్రసాద్ గారు రూ.23,000 చెల్లించి లడ్డు యాలం సొంతం చేసుకున్నారు. ఈ ఘట్టం గ్రామంలో విశేష ఆకర్షణగా నిలిచింది. ప్రజలు మాట్లాడుతూ— “వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్ద గణపయ్య నిమజ్జనం జరగడం చాలా ప్రత్యేకం. అందరి సహకారంతో జరిగిన ఈ వేడుక ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా నిలుస్తుంది” అని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ

నల్గొండలో శిశు మరణాలు, సిజేరియన్లను తగ్గించాలని ఆదేశించిన :జిల్లా కలెక్టర్

నకిరేకల్ :సెప్టెంబర్ ( పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లాలో శిశు మరణాలు, సిజేరియన్ శస్త్రచికిత్సల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉందని జిల్లాకలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు.గురువారం ఉదయాదిత్య భవనంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆమె, గర్భిణీ స్త్రీలకు పిహెచ్ సి స్థాయిలో 3 ఎ ఎన్ సి పరీక్షలు ఖచ్చితంగా నిర్వహించాలని సూచించారు. అవసరమైతే వెంటనే గైనకాలజిస్ట్ కి రిఫర్ చేయాలని, తక్కువ బరువుతో పిల్లలు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రసవం తర్వాత శిశువుకి తల్లిపాలు ఇవ్వడం,సంవత్సరం వరకు పాటించాల్సిన జాగ్రత్తలపై అంగన్వాడీ,ఆశా కార్యకర్తలు గ్రామాల్లో అవగాహన కల్పించాలని ఆమె ఆదేశించారు. కుటుంబ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో సిజేరియన్ల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డి సి హెచ్ఎస్ డాక్టర్ మాతృనాయక్, ఇతర అధికారులు హాజరయ్యారు.

కాకినాడ

రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలోఘనంగా గణపతి హోమం

కాకినాడ: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం కొప్పవరం గ్రామంలోని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారి కార్యాలయంలో జరుగుతున్న వినాయక చవితి వేడుకల్లో భాగంగా గురువారం ఉదయం గణపతి హోమంను ఘనంగా నిర్వహించారు. కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయక పందిరిలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు అరిగెల శ్రీనివాసరావు బున్నీ, కోటిపల్లి సతీష్, సంగాడి వీరబాబు పాల్గొన్నారు. పురోహితులు చావలి సాంబశివ తేజ శర్మ ఆధ్వర్యంలో వేదపండితులు శాస్త్రోక్తంగా గణపతి హోమాన్ని నిర్వహించారు. కార్యాలయం ఇన్‌చార్జ్ మేకా లక్ష్మణమూర్తి పర్యవేక్షణలో గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ, “రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారి కార్యాలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంలో స్వామివారికి గణపతి హోమం వైభవంగా నిర్వహించాం. హోమానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిన్నూరి బాబ్జి, జెడ్.ఆర్.యు.సి.సి సభ్యులు సిముత్యాల అనిల్, టిడిపి సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, సంగాడి బంగారు రాజు బ్రదర్స్, బర్ల శ్రీనివాసు,అంకమ్మ రెడ్డి రామానాయుడు, ఐ.టిడిపి సతీష్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ప్రధానమంత్రి జన సురక్ష పతాకంపై అవగాహన

శ్రీకాళహస్తి మండలం వాంపల్లిలో ప్రధానమంత్రి జన సురక్షా పథకం పై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు పల్లం వారు పాల్గొని మహిళలకు,రైతులకు ప్రధానమంత్రి జన సురక్ష పథకం,ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా పథకం,అటల్ పెన్షన్ యోజన,ఈకేవైసి పై అవగాహన కల్పించారు.ముద్ర,సూర్య ఘర్,ఎస్ హెచ్ జి రుణాల గురించి ప్రజలకు వివరించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.