Thursday, 7 May 2026

Blog

తెలంగాణ

ఇందిరమ్మ ఇండ్ల సమస్యలకు :టోల్ ఫ్రీ నెంబర్ ప్రారంభం కానుంది

నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర స్థాయిలో వచ్చే సోమవారం (సెప్టెంబర్ 8) నుండి టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 5991 యాక్టివేషన్ లోకి రానుందని జిల్లా గృహనిర్మాణశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ గురువారం (సెప్టెంబర్ 4) ఒక ప్రకటనలో తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తమ ఇళ్ల బిల్లుల పరిస్థితి, ఇతర వివరాలు తెలుసుకోవడానికి, ఇందిరమ్మ ఇండ్లకు ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ను డౌన్లోడ్ చేసుకొని తమ స్టేటస్ ను పరిశీలించుకోవచ్చు అని ఆయన వివరించారు. ఫోటో క్యాప్చర్ విషయంలో పంచాయతీ కార్యదర్శులు ఇబ్బందులు కలిగిస్తే, దశలవారీగా నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులు,స్వయంగా తమ ఇళ్ల నిర్మాణ ఫోటోలను అప్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.ఇందుకోసం లబ్ధిదారుల మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుందని ఆ నెంబర్ ని నమోదు చేస్తే ఫోటో అప్లోడ్ చేసే వీలు ఉంటుందని వివరించారు. ఆధార వివరాల్లో చిన్న తప్పులు ఉంటే సంబంధిత ఎంపీడీవోను సంప్రదించాలని, పూర్తిగా ఆధార నంబరే మార్చాల్సి వస్తే జిల్లా కలెక్టర్ అనుమతితోనే మార్పు సాధ్యమవుతుందని ప్రాజెక్టు డైరెక్టర్ రాజకుమార్ స్పష్టం చేశారు.

కాకినాడ

పిఠాపురంలో టీచర్స్ డే సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానుక..

కాకినాడ జిల్లా…… పిఠాపురం…… పిఠాపురంలో ఒకరోజు ముందుగానే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఎంఈఓ ఆఫీసుల ద్వారా ఉపాధ్యాయులకు ఉదయాన్నే వస్త్రాలు అందజేసిన సిబ్బంది… నియోజకవర్గం మెత్తంగా 2వేల మంది ఉపాధ్యాయులకు చీరలను ఫాంటు షర్ట్లును టీచర్స్ డే కానుకగా పంపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. హై స్కూల్, ఎలిమెంటరీ ఉపాధ్యాయులతో పాటు జూనియర్ కళాశాల ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కానుకను పంపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఇప్పుటికే రాఖీ పౌర్ణమి సందర్భంగా 2 వేల మంది ఒంటరి మహిళలకు, వరలక్ష్మీ వ్రతాలను పురస్కరించుకొని 14వేల మంది మహిళలకు పవన్ కళ్యాణ్ పంపిన చీరలు అందజేసిన జనసేన నాయకులు.. గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా టీచర్స్ కు ఎమ్మెల్యే కానుక ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు..

తెలంగాణ

మిర్యాలగూడలో అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ శంకుస్థాపన

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతాల్లో జంతువుల సంక్షేమం వీధి కుక్కల నియంత్రణ కోసం అవంతిపురంలో ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ (ABC) నిర్మాణ పనులకు గురువారం శాసన శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి శంకుస్థాపన చేశారు. సుమారు 60 లక్షల రూపాయల వ్యయంతో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రం నిర్మించబడనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని రకాల జంతువులకు ఇంజక్షన్లు,స్టెరిలైజేషన్ సంరక్షణ వంటి సేవలు అందించేలా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ముఖ్యంగా వీధి కుక్కల జనాభానియంత్రణకు ఇదిఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఇటీవల చిన్నారులపై కుక్కల దాడులు పెరిగిన నేపథ్యంలో,నల్గొండలోమాదిరిగా,మిర్యాలగూలో కూడా ఏ బి సి సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కుక్కలకు స్టెరిలైజేషన్ చేయకపోతే జనాభా అదుపులో ఉండదని పెంపుడు కుక్కలకు వ్యాక్సినేషన్ తప్పనిసరిఅనిసూచించారు.యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉందని ప్రజలు నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, పశుసంవర్ధన శాఖ అధికారి డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పవిత్ర సమర్పణ

శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలలో భాగంగా గురువారం గంటలకు యాగపుగ,యాగశాల గంధ పవిత్ర సమర్పణ,ఆలయ ప్రధాన అర్చకులు నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీ వినాయక,శ్రీ చెంగల్వారాయ,శ్రీ సూర్య,శ్రీ స్వామి అమ్మవార్ల పట్టు పవిత్ర సమర్పణ,వ్రతచరి ఉపచారములు,నైవేద్యదీపారాధనలు,మంత్రపుష్పాలను దేవస్థానం ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించడమైనది.

కాకినాడ

నగర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వ పాలన సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు

నగర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వ పాలన కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని, గత వైసిపి ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రోడ్లను నేడు కూటమి ప్రభుత్వం కొత్త రోడ్లను వేయడం జరుగుతుందని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు.దుమ్ముల పేట నుండి కుంభాభిషేకం వరకు నిర్మిస్తున్న రోడ్లను గురువారం శాసనసభ్యులు కొండబాబు నగరపాలక సంస్థ మరియు KSPL అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో కాకినాడ నగరంలో రోడ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయని, దుమ్ములపేట నుండి కుంభాభిషేకం మరియు కాకినాడ బీచ్ కు వెళ్లే ప్రధాని రహదారి పెద్ద పెద్ద గొంతులు ఏర్పడి రోడ్డు పాడై ప్రమాదాలు జరిగిన గత పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రమణయ్యపేట నుండి పాత పోర్టు పోలీస్ స్టేషన్ వరకు 100 అడుగుల రోడ్డు నిర్మిస్తే గత వైసిపి ప్రభుత్వం అర కిలోమీటర్ రోడ్డు వెయ్యలేకపోగా డంపింగ్ యార్డ్ చెత్తతో రోడ్డుపై అడ్డుగా వేసి ప్రజలు రాకపోకలు సాగించలేని విధంగా తయారు చేశారని, దుమ్ములపేట నుండి కుంభాభిషేకం రహదారి గుండా నిత్యం వేల వాహనాలు పోర్టుకు మరియు ఇతర ప్రాంతాలకు నిత్యం ప్రయాణం సాగిస్తుంటాయని, నేడు కూటమి ప్రభుత్వం ఈ ప్రధాన రహదారిపై గుంతలు పూడ్చి నూతన రోడ్డు నిర్మించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో KSPL ప్రతినిధులు జాకబ్, కోస్ట్ గార్డ్ అధికారులు మరియు స్థానిక నాయకులు తుమ్మల రమేష్, అల్లం రాజు, మూగు రాజు, ఎరుపిల్లి రాము, చొడుపిల్లి సతీష్, ఎలిపే శ్రీనివాస్, మోస పేతురు, అర్జల్ల దాసు, చీకట్ల ఆనంద్, మోస అబ్బాయి, రాజు, తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనది – చిట్వేల్ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

చిట్వేల్ పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులే ముందడుగు వేసి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి దీపప్రజ్వలన చేశారు. ప్రధానోపాధ్యాయులు బి.దుర్గరాజు మాట్లాడుతూ రాధాకృష్ణ గారు ఉపాధ్యాయుడిగానే కాక గొప్ప తత్వవేత్త, రాజకీయవేత్తగా నిలిచారని, ఆయన జయంతినే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని వివరించారు. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు రంగారెడ్డి, డి.శ్రీనివాసులు, లీలావతి దేవి పాల్గొని విద్యార్థులను ప్రేరేపించారు. విద్యార్థులు ఉపాధ్యాయుల కోసం క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ఈ పాఠశాల ఉపాధ్యాయులు పి.రాజశేఖర్, ఏ.శివన్నారాయణ, జి.శ్రీకాంతి జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడంపై ఉపాధ్యాయ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్

మాజీ సర్పంచ్ కప్పా శ్రీనివాసుల రాజు ఉత్తరక్రియల లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల..

ఉదయగిరి సెప్టెంబర్ 4 : పున్నమి న్యూస్ ప్రతినిధి :/// ఉదయగిరి మండలం గంగులవారి చెరువుపల్లి మాజీ సర్పంచ్ కప్పా శ్రీనివాసుల రాజు దశదిన కర్మ కార్యక్రమంలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొని వారి చిత్రపటమునకు పుష్పాంజలి ఘటించి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈవీఎంల గోదాం తనిఖి

నల్గొండ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) జిల్లా కేంద్రంలో ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఈవీఎం ల భద్రత ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈరోజు (సెప్టెంబర్ 4) పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదామును అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్,ఎన్నికల విభాగం అధికారులు కలెక్టర్ తో కలిసి గోదాంలో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ మొహరించిన సిబ్బందిని ప్రశ్నించి భద్రతా చర్యలపై సమగ్ర సమాచారం తెలుసుకున్నారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను తనిఖీ చేసి గోదాంకు సీల్ వేయించారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏవో మోతిలాల్, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసిల్దార్ విజయ్ కృష్ణమూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన చింతు వాసుదేవరావు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం గుండివిల్లిపేట మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో పనిచేస్తున్న కరవంజ గ్రామానికి చెందిన చింతు వాసుదేవరావు గారు 2025 సంవత్సరానికి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందుతున్నారు.ఈ సత్కార కార్యక్రమం రేపు జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఘనంగా జరగనుంది. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని వాసుదేవరావు గారిని సన్మానించనున్నారు.విద్యా రంగంలో విశేష కృషి, విద్యార్థులలో పఠన పట్ల ఆసక్తి పెంపొందించడం, సృజనాత్మకతను వెలికితీయడం, ఆధునిక బోధనా విధానాలను అమలు చేయడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. పాఠశాలలో పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ వాసుదేవరావు గారు ప్రత్యేక కృషి చేశారు.ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ – “విద్యార్థుల విజయం నా విజయమని ఎల్లప్పుడూ నమ్ముతాను. ఈ అవార్డు నా కృషికి మాత్రమే కాకుండా, మా పాఠశాలకు, నరసన్నపేట మండలానికి వచ్చిన గౌరవం” అని అన్నారు.గ్రామ ప్రజలు, సహచర ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆయనను అభినందిస్తూ, విద్యా రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

మట్ల లక్ష్మయ్యను పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల..

ఉదయగిరి : పున్నమి న్యూస్ ప్రతినిధి :సెప్టెంబర్ 04 ://// ఇటీవల టిడిపి నాయకుడైన మట్ల లక్ష్మయ్య ప్రమాదానికి గురై చెయ్యి విరగగా వారిని ఉదయగిరి మండల కేంద్రం లోని గొల్లపాలెం నందు గల వారి స్వగృహమునకు గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు వెళ్లి పరామర్శించి, ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదాలకు గురైన కూటమి కార్యకర్తలకు,కూటమి నాయకులకు ఎల్లవేళలా అండగా ఉంటానని కాకర్ల సురేష్ గారు తెలియజేశారు..ఈ కార్యక్రమంలో ఉదయగిరి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.