Tuesday, 22 September 2026
  • Home  
  • మిర్యాలగూడలో అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ శంకుస్థాపన
- తెలంగాణ

మిర్యాలగూడలో అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ శంకుస్థాపన

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతాల్లో జంతువుల సంక్షేమం వీధి కుక్కల నియంత్రణ కోసం అవంతిపురంలో ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ (ABC) నిర్మాణ పనులకు గురువారం శాసన శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి శంకుస్థాపన చేశారు. సుమారు 60 లక్షల రూపాయల వ్యయంతో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రం నిర్మించబడనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని రకాల జంతువులకు ఇంజక్షన్లు,స్టెరిలైజేషన్ సంరక్షణ వంటి సేవలు అందించేలా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ముఖ్యంగా వీధి కుక్కల జనాభానియంత్రణకు ఇదిఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఇటీవల చిన్నారులపై కుక్కల దాడులు పెరిగిన నేపథ్యంలో,నల్గొండలోమాదిరిగా,మిర్యాలగూలో కూడా ఏ బి సి సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కుక్కలకు స్టెరిలైజేషన్ చేయకపోతే జనాభా అదుపులో ఉండదని పెంపుడు కుక్కలకు వ్యాక్సినేషన్ తప్పనిసరిఅనిసూచించారు.యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉందని ప్రజలు నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, పశుసంవర్ధన శాఖ అధికారి డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతాల్లో జంతువుల సంక్షేమం వీధి కుక్కల నియంత్రణ కోసం అవంతిపురంలో ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ (ABC) నిర్మాణ పనులకు గురువారం శాసన శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి శంకుస్థాపన చేశారు. సుమారు 60 లక్షల రూపాయల వ్యయంతో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రం నిర్మించబడనుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని రకాల జంతువులకు ఇంజక్షన్లు,స్టెరిలైజేషన్ సంరక్షణ వంటి సేవలు అందించేలా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ముఖ్యంగా వీధి కుక్కల జనాభానియంత్రణకు ఇదిఉపయోగపడుతుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఇటీవల చిన్నారులపై కుక్కల దాడులు పెరిగిన నేపథ్యంలో,నల్గొండలోమాదిరిగా,మిర్యాలగూలో కూడా ఏ బి సి సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కుక్కలకు స్టెరిలైజేషన్ చేయకపోతే జనాభా అదుపులో ఉండదని పెంపుడు కుక్కలకు వ్యాక్సినేషన్ తప్పనిసరిఅనిసూచించారు.యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉందని ప్రజలు నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, పశుసంవర్ధన శాఖ అధికారి డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.