Thursday, 7 May 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రముఖ హోమియో డాక్టర్ గారికి అభినందనలు…

*ప్రముఖ హోమియో వైద్యులు సౌమ్యుడు, మృదు స్వభావి డాక్టర్ శ్రీనివాస్ గారు మినీ బైపాస్ రోడ్ లోని P T G పెట్రోల్ బంక్ ఎదురుగా నూతనంగా మెడికల్ షాప్ ను ప్రారంభించిన సందర్భంగా 14th division మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ గారు మరియు శ్రేయోభిలాషులు డాక్టర్ల గారికి అభినందనలు తెలపడం జరిగింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పుట్టినరోజు శుభాకాంక్షలు..

నెల్లూరు జిల్లా…కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అయినటువంటి మాన్య శ్రీ చేవూరి దేవకుమార్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మైనార్టీ కమిటీ వర్కింగ్ నాయకులు, కాంగ్రెస్ బీసీ కమ్యూనిటీ నాయకులు మరి కొందరి సభ్యుల మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు..

ఆంధ్రప్రదేశ్

GST new policy వల్ల ఎవరికి లాభం..

GST 2.0 ప్రభుత్వానికి భారం అవుతుందా? GST 2.0తో పన్ను విధానంలో కేంద్రం మార్పులు తీసుకొచ్చి సామాన్యులకు రిలీఫ్ ఇచ్చింది. ఇకపై కేవలం 5% and 18% రేట్స్ మాత్రమే ఉండనున్నాయి. ఈనెల 22 నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త రేట్ల వల్ల ఏయే ధరలు తగ్గుతాయి? ఏయే ధరలు పెరుగుతాయి? సామాన్యులకు బెనిఫిట్ ఏంటి? ప్రభుత్వానికి భారం అవుతుందా? ఇది ఇలా ఉండగా కొందరు ఇది కేవలం ఓట్ చోరీ పాలిటిక్స్ డైవర్షన్ కోసమని కొందరు వాపోతున్నారు..

తిరుపతి

గుత్తివారిపల్లిలో డయేరియా బాధితులను పరామర్శించిన నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు

శ్రీకాళహస్తి నియోజకవర్గం,రేణిగుంట మండలం,గుత్తివారిపల్లిలో కలుషిత నీరు తాగడం వల్ల అనారోగ్యానికి గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టేసాయి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాధితులతో స్వయంగా మాట్లాడి,వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.అలాగే, వైద్యులతో చర్చించి, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,స్థానిక ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు అధికారులతో చర్చించి,గ్రామంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికిస్థానిక ఎమ్మెల్యే తో మాట్లాడి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.

తిరుపతి

వైభవంగా గణనాధుని నిమర్జనోత్సవం

శ్రీకాళహస్తి లో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా వివిధ ప్రదేశాలలో మండపాలు ఏర్పాటు చేయడం జరిగింది.గణపయ్య నవరాత్రులు మండపాలలో భక్తుల పూజలు అందుకొని గంగమ్మ ఒడిలోకి కదిలాడు ఈ సందర్భంగా పట్టణంలోని బేరివారి మండపం వద్ద వినాయక నిమర్జన కార్యక్రమం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాటాల మధ్య కోలాహలంగా జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు పాల్గొని ప్రతి ఒక్కరు మట్టి వినాయకుని పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్

గురువే ప్రత్యక్ష దైవం : లయన్ డా. పైడి సింధూర

శ్రీకాకుళం: గురువుల స్థానం ప్రతి ఒక్కరి జీవితంలో చిరస్మరణీయమని, వారిని ప్రత్యక్ష దైవాలుగా భావించాలని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు లయన్ డా. పైడి సింధూర అన్నారు.స్థానిక డే అండ్ నైట్ కూడలిలోని ప్రైవేట్ హాల్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గురువులకు పాదాభివందనం చేసి, లయన్ ఇంటర్నేషనల్ ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు, దుస్తులువాలతో సత్కరించారు.డా. సింధూర మాట్లాడుతూ – “కనిపించే దైవాలు తల్లిదండ్రులు. కానీ విద్యా బోధన చేసి, క్రమశిక్షణతో విలువలతో కూడిన జీవితాన్ని కల్పించి, సమాజంలో సుస్థిర స్థానం కల్పించిన ఘనత గురువులదే. అందువల్ల గురువులను ప్రత్యక్ష దైవాలుగా భావించాలి” అని అన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మెంటార్ నటుకుల మోహన్, జిల్లా లయన్స్ ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ రవికుమార్, సీనియర్ సభ్యులు బాడాన దేవభూషణం, ప్రొఫెసర్ డాక్టర్ విష్ణుమూర్తి తదితరులు మాట్లాడి గురువుల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, వారిని గౌరవించడం ప్రతీ ఒక్కరి కర్తవ్యమని తెలిపారు.సత్కరించిన వారిలో పారశెల్లి తిరుపతిరావు, డా. బోగెల ఉమామహేశ్వరరావు, బెందాళం వరలక్ష్మి, కిల్లి అప్పారావు, డా. ఎంకే మిశ్రో, కె. జగదీశ్, ఎన్. రమ్య, డబ్బీరు సంధ్యరాణి తదితరులు ఉన్నారు.ఈ వేడుకలలో సెక్రటరీ టెక్కం రాంగోపాల్, కోశాధికారి బి. కృష్ణ చైతన్య, డా. ఎం. మురళీకృష్ణ, బి. శ్రావ్య, నారా ఈశ్వరరావు, జి. చిన్నారావు, బి. మాధురి, అనిల్ పొడుగు, చరణ్, రామం, వేణు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

మందు బాబులకి బ్యాడ్ న్యూస్

ఖమ్మం పున్నమి ప్రతి నిధి ఖమ్మం నగరం రేపు గణేష్ నిమజ్జన మహోత్సవం సంధర్బముగా రేపు ఉదయం 6నుండి ఎల్లుండి ఉదయం 6 వరకు మద్యం సరఫరా చేసే బార్లు, రెస్టారెంట్ లు, క్లబ్ లు ముసివేయాలి అని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కోరారు. ప్రశాంత వాతావారణం లో నిమజ్జన కార్యక్రమం జరిగేలా ప్రతి ఒక్కరు సహకరించాలీ అని అయన కోరారు.

ఖమ్మం

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గల్లా

పున్నమి ఖమ్మం ప్రతినిధి గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరహ: డాక్టర్ సర్వేపలి రాదా కృష్ణ జయంతి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్య నారాయణ గురువు లకి శుభాకాంక్షలు తెలిపారు.

Blog

కళారాధనలో పద్య పఠనం, ఆంగ్ల రైమ్స్ పోటీలు రాగ యుక్తంగా పద్యాలు ఆలపించిన బాలలు

కళారాధన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “మాతృభూమికి కళార్చన” పోటీలలో శుక్రవారం జూనియర్,సబ్ జూనియర్ విభాగాలలో పద్య పఠనం, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ బాలలకు ఆంగ్ల రైమ్స్ పోటీలు నిర్వహించారు పద్య పఠనం పోటీలలో 110 మంది బాలలు రాగయుక్తంగా పద్యాలాపన తో అలరించారు 40 మంది చిన్నారులు ఆకట్టుకునే హావభావాలతో ఆంగ్లరైమ్స్ చెప్పారు న్యాయ నిర్ణేతలుగా సుజాత చంద్ర హాస రెడ్డి, గోపాల కృష్ణ, కమలాకర్, నీలకంఠమాచారి, ప్రసాద్ లు వ్యవహరించారు పోటీలను నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, ఉపాధ్యక్షులు పోసిన సుబ్బారావు, కార్యాలయ కార్యదర్శి వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. శుక్రవారం చక్కటి చేతివ్రాత పోటీలు: శుక్రవారం టౌన్ హాల్ ప్రాంగణంలో తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో చక్కటి చేతి వ్రాత పోటీలు నిర్వహించడం జరుగుతుంది. శని ,ఆదివారాలలో నృత్య పోటీలు: శని వారం శాస్త్రీయ, జానపద నృత్య పోటీలు, ఆది వారం ఆధునిక, దేశ భక్తి నృత్యాల పోటీలు సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో సోలో, బృంద నృత్య క్యాటగిరిలలో నిర్వహిస్తారు.

Blog

దివ్యాంగులకు అండగా నిలుస్తాం: తెలుగుదేశం యువనేత ఎన్.ఎం.డి. ఫిరోజ్

తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.ఎం.డి. ఫిరోజ్ వార్డు పర్యటనలో, నంద్యాల 25 వ వార్డు లో నివసించే దివ్యాంగురాలు ప్రభావతి ,తనకు చక్రాల కుర్చీ ఇప్పించి,పెన్షన్ మంజూరు అయ్యేలా చూడమని కోరడం జరిగింది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలు విజయ్ గౌరీ జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ కు తెలియ చేశారు. గురువారం ఎన్ఎండి ఫిరోజ్ పుట్టినరోజు పురస్కరించుకుని నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఫిరోజ్ చేతుల మీదుగా దివ్యాంగురాలికి చక్రాల కుర్చీ అందజేశారు ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ ఆమెకు పెన్షన్ మంజూరూ అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, అధ్యక్షులు ఎం.పీ.వి. రమణయ్య, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎవిఆర్ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలు విజయ గౌరీ, నంద్యాల ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు వాకా శివశంకర్ యాదవ్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇమ్మడి రామకృష్ణుడు, రామయ్య తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.