Thursday, 7 May 2026

Blog

తిరుపతి

అక్కుర్తి సర్పంచ్ ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి

శ్రీకాళహస్తి మండలంలోని అక్కుర్తి గ్రామపంచాయతీ సర్పంచ్,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, వైఎస్సార్సీపీ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు మల్లం కృష్ణయ్యను శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్ రెడ్డి పరామర్శించారు.అక్కుర్తి సర్పంచ్ కృష్ణయ్యకు గత కొద్దిరోజుల క్రితం ఆరోగ్యం సరి లేనందున చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చారు.ఈ విషయం తెలుసుకున్న బియ్యపు మధుసూదన్ రెడ్డి శుక్రవారం అక్కుర్తి గ్రామం లోని కృష్ణయ్య ఇంటికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్

గణేష్ నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణం జగన్నాధపురం వీధిలో గణేష్ నవరాత్రుల సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గారు విఘ్నేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదం స్వీకరించి, భక్తులకు అన్నప్రసాదం వడ్డించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ –”గణేష్ నవరాత్రులు సామాజిక ఐక్యత, సాత్వికతకు ప్రతీక. అన్నదానం అనేది అత్యున్నత దానం. ఈ విధమైన కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, సేవా భావాలను పెంపొందిస్తాయి. ఉత్సవాలను శాంతియుతంగా, సాంప్రదాయబద్ధంగా జరపడం ప్రతి ఒక్కరి బాధ్యత”, అని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుపతి

బిజెపి కార్యాలయంలో ఉపాధ్యాయులకు సన్మానం

శ్రీకాళహస్తి పట్టణం నందు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరిగింది.ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఆయన సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులను పూజించడం మన కర్తవ్యంగా భావించాలన్నారు.విద్యార్థులకు విద్యతో పాటు మంచి నడవడిక ను ఉపాధ్యాయులు నేర్పుతారని,దేశ భక్తిని పెంపొందిస్తారని కొనియాడారు.

తిరుపతి

ఉపాధ్యాయులకు సన్మానం

శ్రీకాళహస్తి పట్టణంలోని సుజుకి షోరూం యాజమాన్యం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరిగింది.సన్మానం పొందిన వారిలో నలుగురి చంద్రశేఖర్, గుడ్ల శ్రీనివాసులు, యానాది సుబ్రహ్మణ్యం కి ఘనంగా సన్మానం చేయడం జరిగింది.సన్మానం చేసిన వారిలో పాడేటి రవి, జనమాల గురవయ్య, రొడ్డ గోపి, పాడేటి శివ, ధనంజయలు, కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ

యూరియా కోసం మహిళల కొట్లాట..!

మహబూబాబాద్ జిల్లాలోని ఓ ఎరువుల దుకాణం వద్ద ఇద్దరు మహిళలు ఘోరంగా కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. మహబూబాబాద్(D)లోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్దకు ఇద్దరు మహిళలు యూరియా కోసం వచ్చారు. అక్కడ ఆధార్ కార్డు నమోదు విషయంలో ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో ఆ మహిళలు చెప్పులతో కొట్టుకుంటూ నడిరోడ్డుపై జుట్లు పట్టుకుని దాడి చేసుకున్నారు. పక్కనే ఉన్నవారు వారిద్దరినీ విడదీయడంతో శాంతించారు.

E-పేపర్

ముంబై గణేశ్ నిమజ్జనానికి బాంబు బెదిరింపు..!

ముంబై పోలీసులు హై అలర్ట్లో ఉన్నారు. రేపు గణేశ్ నిమజ్జనంలో విధ్వంసం సృష్టిస్తామని వారికి బాంబు బెదిరింపులు అందాయి. లష్కర్ ఏ జిహాదీ పేరిట.. ’14 మంది పాక్ టెర్రరిస్టులు భారత్లోకి చొరబడ్డారు. 34 వాహనాల్లో మానవ బాంబులను సిద్ధం చేశాం. 400 కిలోల ఆర్డీఎక్స్ పేలుళ్లు ప్లాన్ చేశాం. కోటిమంది చనిపోగలరు’ అని వాట్సాప్ మెసేజ్ పంపారు. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి తనిఖీలు చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్

శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వింజమూరులో “స్త్రీ శక్తి” సంబరాలు..

వింజమూరు : పున్నమి న్యూస్ ప్రతినిధి :/// ప్రభుత్వం చేపట్టిన ” స్త్రీ శక్తి “( ఫ్రీ బస్) పథకానికి ఊహించని ఆదరణ వస్తుందని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. ఇందులో భాగంగా వింజమూరులో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విజయోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెల్లడించారు. కావున కూటమి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు, భారీ సంఖ్యలో హాజరై ఈ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వినాయకుడు నిమర్జనం లో అపశృతి ..!

కోవూరు సత్రం వీధికి చెందిన వినాయకుని నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. టపాసులు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న ఎలక్ట్రిక్ బైకుకు నిప్పు అంటుకుంది. అది ఒక్కసారి పేలడంతో ఆ ధాటికి పక్కనే ఉన్న సాయిబాబా మెడికల్ షాప్ యజమాని బ్రహ్మయ్య, ఆయన భార్య లక్ష్మి(45), మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ఎస్సై రంగనాథ్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

అన్నమయ్య

శ్రీ మహాలక్ష్మీ దేవాలయ 5వ వార్షికోత్సవం వైభవంగా

ఓబులవారిపల్లి సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లె మండలం, శేషక్కగారిపల్లె గ్రామంలో శ్రీ మహాలక్ష్మీ దేవాలయ 5వ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.గ్రామస్థుల ఆహ్వానం మేరకు విచ్చేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన గ్రామ ప్రజలతో కలసి ఉత్సవాల్లో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

ఆంధ్రప్రదేశ్

వెంకటగిరి పోలేరమ్మ జాతర: ఎప్పుడో తెలుసా.!

వెంకటగిరి పోలేరమ్మ జాతర ఈనెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అంగరంగ వైభవంగ జరగనుంది. 7వ తేదీ ఆదివారం ఘటోత్సవం, 10వ తేదీ అమ్మవారి ఉత్సవం, 11వ తేదీ ఉదయం అమ్మవారి నిలుపు, సాయంత్రం ఊరేగింపు ఉంటుంది. ఈక్రమంలో జాతరకు అందరూ రావాలంటే దేవాదాయ శాఖ ఆహ్వానం పలికారు…

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.