Thursday, 7 May 2026

Blog

సినిమా

ఫుల్‌ జోష్‌లో చిరు.. ‘మన శంకర వరప్రసాద్‌గారు’ అప్‌డేట్‌ షేర్‌ చేసిన టీమ్‌

సెప్టెంబర్ 05 పున్నమి ప్రతినిధి @ సినిమా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో అగ్రకథానాయకుడు చిరంజీవి నటిస్తోన్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. చిరుతో పాటు ఈ సినిమా టీమ్‌ మొత్తం ఫుల్‌ జోష్‌తో ఉంది. తాజా అప్‌డేట్‌ను చిత్రబృందం షేర్‌ చేసింది.

E-పేపర్

శ్రీ త్రికోటేశ్వర విద్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు

చేజర్ల సెప్టెంబరు (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలం ఆదురుపల్లిలోని శ్రీ త్రికోటేశ్వర విద్యాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని కేక్ కట్ చేసి ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మీ నరసారెడ్డి డైరెక్టర్ సుధాకర్ రెడ్డి మరియు ప్రధానోపాధ్యాయులు కృష్ణ చైతన్య మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న గురువులందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయునలుగా ఎంపికైన హిందీ ఉపాధ్యాయులు సుభాష్ మరియు ఆంగ్ల ఉపాధ్యాయులు చిన్ని లను ఘనంగా సన్మానించారు. విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాల బాలికలు ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

చిత్తూరు

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన ఉపాధ్యాయిని రమ

రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికై నేడు చిత్తూరు జిల్లా కేంద్రం జడ్పీ సమావేశ మందిరంలో గురుపూజోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మి, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ నాయుడు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్, జెడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, మేయర్ అముద, ఇతర జిల్లా అధికారుల సమక్షంలో జరిగిన ఉపాద్యాయ దినోత్సవం కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా (ఆర్.రమ, గణిత ఉపాధ్యాయిని, గంగవరం మండలం) సన్మానం ప్రశంసా పత్రం జ్ఞాపిక అందుకొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత ఆర్. రమ కు ఎంఈఓలు, సహచర ఉపాద్యాయులు ప్రత్యేక శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు.

E-పేపర్

అత్యంత ఘనంగా మిలాద్ ఉన్ నబి పండుగ

నందలూరు మండలంలో ఇస్లాం మత స్థాపకుడైన మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నందలూరు మండలంలో సయ్యద్ మగ్దుమ్షా ఖాదర్ వలీ దర్గా పీఠాధిపతులు కాజా సయ్యద్ షా మొహమ్మద్ మోయుద్దిన్ హుసేని ఖాద్రి. ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా నందలూరు దర్గా నుండి అరవపల్లి దర్గా వరకు భారీగా అల్లాహు అక్బర్ అనే నినాదాలతో ఇస్లామిక్ జెండాలు పట్టుకొని భారీ ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రానికి ముఖ్య అతిథులుగా రాజంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బీవీ రమణ మరియు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ, నందలూరు సర్పంచ్ రాము పాల్గొన్నారు,దర్గా కమిటీ వారిని శాలువాతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు, అరవపల్లి హజరత్ ఖాదర్ షావలి దర్గా దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేసి దర్గా ఆవరణంలో ఏర్పాటుచేసిన అన్నదాన విత్తరణ కార్యక్రమంలో భక్తులకు అతిధులు స్వయంగా వడ్డించారు, ఈ కార్యక్రమంలో సయ్యద్ అమీర్, కమల్ భాష,పఠాన్ కరీముల్లా ఖాన్,షేక్ మౌలా,పఠాన్ మెహర్ ఖాన్,సయ్యద్ అఫ్జల్,ఆకుల చలపతి,సయ్యద్ ఇబ్దాల్,తాటి సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు,

విశాఖపట్నం

విశాఖ కొత్త ఆకర్షణ: ఆకాశంలో అడుగులు, అబ్బురపరిచే గాజు వంతెన

పున్నమి స్టాప్ రిపోర్టర్ : యామల రామమూర్తి ​విశాఖపట్నం ఇప్పుడు మరో కొత్త ఆకర్షణతో పర్యాటకులను ఆహ్వానిస్తోంది. ఎప్పటినుంచో ప్రకృతి అందాలకు పెట్టింది పేరు అయిన ఈ నగరం, ఇప్పుడు సాహస ప్రియుల కోసం గాజు వంతెనను అందుబాటులోకి తీసుకువచ్చింది. కైలాసగిరిపై, మహా విశాఖ ప్రాంత నగరాభివృద్ధి సంస్థ (VUDA) ఆధ్వర్యంలో నిర్మించిన ఈ వంతెన, దేశంలోనే అతి పొడవైనది కావడం విశేషం. ​ఆకాశంలో తేలియాడే అనుభూతి ​సుమారు 55 మీటర్ల పొడవుతో నిర్మించిన ఈ వంతెన పూర్తిగా గాజుతో తయారైంది. దీనిపై అడుగు పెడితే, చుట్టూ ఉన్న ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. పాదాల కింద ఉన్న లోతైన లోయలు, దట్టమైన అడవులు, దూరంగా కనుచూపు మేర విస్తరించిన అపారమైన సముద్రం… ఇవన్నీ కళ్ళ ముందు కదులుతుంటే, మనకి తెలియకుండానే ఒళ్ళు పులకిస్తుంది. నిజానికి, ఇది కేవలం ఒక వంతెన కాదు, గాలిలో తేలియాడుతూ ఒక కొత్త ప్రపంచంలోకి ప్రయాణించే అనుభూతి. ​ప్రకృతి అందాలు, భయం, సాహసం ​ఈ వంతెనపై నుంచి చూసే దృశ్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒకవైపు పచ్చని కొండల పరంపర, మరోవైపు నీలిరంగు సముద్రం, వాటి మధ్య పక్షులు ఎగురుతున్నట్టుగా మనం కూడా గాలిలో ఉన్నామన్న భావన కలుగుతుంది. మొదటిసారి ఈ వంతెనపై నడుస్తున్న వారికి కాస్త భయం అనిపించినా, కొన్ని అడుగులు వేశాక ఆ భయం కాస్త సాహసంగా మారిపోతుంది. పర్యాటకులు ఈ అనుభవాన్ని ఎంతగానో ఇష్టపడతారని, ఇది విశాఖపట్నం పర్యాటకానికి ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ​ఈ గాజు వంతెన త్వరలోనే పర్యాటకుల సందర్శన కోసం అందుబాటులోకి రానుంది. విశాఖను సందర్శించేవారు ఇకపై ఇక్కడ ఒక సరికొత్త థ్రిల్‌ను అనుభవించవచ్చు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

స్త్రీ శక్తి విజయోత్సవ సభను జయప్రదం చేయండి

సీతారామపురం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) సూపర్ సిక్స్ పథకాల అమలలో భాగంగా ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం విజయవంతమైన సందర్భంగా శనివారం ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యుడు కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో వింజమూరులోని ఆర్టీసీ బస్టాండ్ కూడలి నుండి ఎస్వి కన్వెన్షన్ హాల్ వరకు నిర్వహించే మహిళల ర్యాలీ అనంతరం నిర్వహించే భారీ బహిరంగ సభకు సీతారామపురం మండలంలోని కూటమి మహిళా నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీతారామపురం మండల తెలుగు యువత నాయకుడు పసుపులేటి వికాస్ బాబు (విక్కీ) తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలలో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలన్నిటిని కూటమి ప్రభుత్వం అమలు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.

తెలంగాణ

నల్గొండ లో వినాయక నిమజ్జన శోభయాత్ర

నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ పట్టణం లో వినాయక నవరాత్రుల ముగింపు సందర్బంగా ప్రశాంత వాతావరణం లో శోభయాత్ర ప్రారంభమైనది. రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రాఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హనుమాన్ పురం లోని వినాయక విగ్రహానికి పూజాదిక్యాలు నిర్వహించి యాత్రను ప్రారంభిచారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా జిల్లా ప్రజలు మత సామరస్యంతో ఉత్సవాలను నిర్వహిస్తున్నారని, ఈసారి కూడా శాంతియుత వాతావరణం లో జరగాలని సూచించారు. జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణం మొదలుపెట్టమని, ఘాట్ రోడ్డు పనులు జరుగుతున్నాయని వివరించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ భక్తులు క్రమ శిక్షణతో నిమజ్జనంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ 2000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గణేష్ ఉత్సవ కమీటీలు ప్రజలు సహకరించడంతో నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతుంది.

తిరుపతి

మహిళలు ఆర్థికంగా పరిపుష్టి సాధించాలి.కోలా వెంకటేశ్వర రావు

సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు టీచర్స్ డే సందర్భంగా స్థానిక సంస్థ కార్యాలయం నందు సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా వెంకటేశ్వరరావు సర్టిఫికెట్లు ప్రధానం చేశారు.ఈ సందర్భంగా కోలా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని స్వయం ఉపాధితో ఆర్థిక పరిపుష్టి సాధించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు mg బాలాజీ మరియు సంస్థ సభ్యులు అనిల్ కుమార్ కోలా సంగీతారావు,విజయలక్ష్మి, వరలక్ష్మి,ప్రసాద్,మునిరత్నం నాయుడు చెంచయ్య,రమణరెడ్డి,వంశి యాదవ్, హమీద్,జానకి తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

దేవకుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ మైనార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు అల్లావుద్దీన్..

కాంగ్రెస్ మైనార్టీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లావుద్దీన్ గారు, దేవకుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవకుమార్ రెడ్డి గారు సామాజిక సేవలోనూ, ప్రజా సమస్యల పరిష్కారంలోనూ విశేషంగా కృషి చేస్తున్నారని, ప్రజల మన్ననలు పొందుతున్నారని పేర్కొన్నారు. అల్లావుద్దీన్ గారు దేవకుమార్ రెడ్డి గారు దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆయన మరింత శక్తివంతంగా ప్రజాసేవలో ముందుకు సాగి, యువతకు ప్రేరణగా నిలుస్తారని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అల్లావుద్దీన్ గారు ఇంకా మాట్లాడుతూ, నాయకులు సమాజ అభివృద్ధి కోసం పనిచేస్తే ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం సులభమవుతుందని, దేవకుమార్ రెడ్డి గారు అలాంటి నాయకుడని అన్నారు. ఆయన ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, వాటి పరిష్కారం కోసం కృషి చేయడం ద్వారా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి కలిగిస్తున్నారని ప్రశంసించారు. చివరగా, దేవకుమార్ రెడ్డి గారి జన్మదినం ప్రజాసేవకు కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ, రాబోయే కాలంలో ఆయన మరింత శ్రద్ధతో ప్రజలకు అండగా నిలవాలని కోరారు.

ఖమ్మం

అన్న దాన కార్యక్రమం లో పాల్గొన్న గల్లా

పున్నమి ప్రతి నిధి ఖమ్మం నగరం లోని 21 వ డివిజన్ పరిధిలో పార్సిబంధం లో బీజేపీ జిల్లా నాయకులు పిల్లల మర్రి వెంకట్ నారాయణ ఆధ్వర్యంలో లో ఏర్పాటు చేసిన వినాయక మండపం దగ్గర శుక్రవారం మహా అన్న దాన కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ముఖ్య అతిధి గా బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్య నారాయణ హాజరై అన్న దానం ని ప్రారంభం చేసారూ. వీరితో పాటు కార్యక్రమం లో దేవకీ వాసుదేవారావు. అనంతు ఉపేందర్ గౌడ్, డీకొండ శ్యాం, గజ్జల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.