నిమజ్జన కార్యక్రమం జాగ్రత్త గా నిర్వహించుకోవాలి :గల్లా
ఖమ్మం నగరం లో రేపు జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమం లో భక్తులు జాగ్రత్త గా పాల్గొనాలని బీజేపీ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ విజ్ఞప్తి చేశారు
ఖమ్మం నగరం లో రేపు జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమం లో భక్తులు జాగ్రత్త గా పాల్గొనాలని బీజేపీ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ విజ్ఞప్తి చేశారు
సెప్టెంబర్ 05 పున్నమి ప్రతినిధి @ సీఎం చంద్రబాబు భద్రత, సమయ పాలన దృష్ట్యా కొత్త ఎయిర్బస్ హెచ్-160 హెలికాప్టర్ను ఉపయోగిస్తున్నారు. పాత హెలికాప్టర్ ఎక్కువ దూరం ప్రయాణించలేకపోవడంతో గతంలో సమయం వృధా అయ్యేది. ఇప్పుడు నివాసం నుంచే జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు. కొత్త ఛాపర్ వల్ల సమయం ఆదా, ప్రయాణం మరింత సురక్షితంగా ఉంటుంది.
పున్నమి ప్రతినిధి భాగ్య నగర గణేష్ ఉత్సవాసమితి ఆధ్వర్యంలో రేపు నిర్వహించే నిమజ్జనం కార్యక్రమం కి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నారూ.
ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా 1977వ సంవత్సరంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ఏర్పేడు నందు పదవ తరగతి చదివిన అప్పటి విద్యార్థులు కలిసి వారి మా హెడ్మాస్టర్ అయిన శ్రీ MA.రంగనాథం MA(95)ని శ్రీకాళహస్తిలో వారి స్వగృహం నందు సన్మానించడం జరిగినది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న 1977 సంవత్సరపు 10వ తరగతి విద్యార్థులు శ్రీ J. వెంకటరమణ,T.C.బత్తిరెడ్డి,B.గోవిందస్వామి,S.చెంగయ్య,K.కేశవులు,A.చంద్రశేఖర్ రెడ్డి,C.చంద్రశేఖర్ రెడ్డి,T.నారాయణరెడ్డి,S.ఉదయ్ భాస్కర్ రెడ్డి,వై.ముని కృష్ణారెడ్డి,C.శంకర్,మరియూ A.మునిశ్రీ వెంకటేష్ కలసి అలనాటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
యావత్తు మానవాళికి శాంతి, ప్రేమ, ఐక్యత, సామరస్యాలను బోధించిన మహనీయులు మహ్మద్ ప్రవక్తగారని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు.మహ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకుని కాకినాడ నగరంలో ముస్లింలు శుక్రవారం ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకను శాంతి ర్యాలీ ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రమైన నగరంలో జే.రామారావుపేట నుంచి ఉదయం 7 గంటలకు నుంచి వేలాది మంది ముస్లింలు ఈద్ మిలాద్ నబీ ర్యాలీలతో కల్పనా సెంటర్ వద్దకు చేరుకున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని ముస్లిం సోదర సోదరీమణులకు మీలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడతూ యావత్తు మానవాళికి శాంతి, ప్రేమ, ఐక్యత, సామరస్యాలను బోధించిన మహనీయులు మహ్మద్ ప్రవక్త గారిని, ఇస్లాం శాంతిని బోధిస్తుందని, ముహ్మద్ ప్రవక్త అందించిన శాంతి సందేశం ప్రపంచ మానవాళికి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి వీరు, ముస్లిం నాయకులు ఖాన్, తాజద్దీన్,రహీమ్,ఆన్సర్, సయిద్, అశ్రీఫ్ అలీ, సయిద్ ఆలీ, అన్వర్, మొహిద్దీన్, మొహమ్మద్, కస్మూర్, పైసల్, జారు, కరీముల్లా, తదితరులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 05 పున్నమి ప్రతినిధి @ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆయుష్మాన్ భారత్- ఎన్టీఆర్ సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది. దీని కింద ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్స అందనుంది. దీంతో రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా అందనుంది. అలాగే, పీపీపీ విధానంలో రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కళాశాలు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని పలు సవరణలను ఆమోదించింది.
చేజర్ల సెప్టెంబరు (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండల చేజర్ల గ్రామపంచాయతీలోని ఎస్.సి. కాలనీలో నీ ఆంజనేయ స్వామి గుడి అభివృద్ధి సహకరించాలని టిడిపి పార్టీ మండల దళిత నాయకులు సోమవరపు హజరత్తయ్య రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డిని కోరడంతో ఆయన స్పందించి ఆలయ అభివృద్ధికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అభివృద్ధికి సహకరించిన పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డికి టిడిపి పార్టీ సీనియర్ నాయకులు తాళ్లూరు గిరినాయుడుకి కాలనీవాసులు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సుబ్బరాయుడు, తిరుపతయ్య, అర్జున్ కుమార్, కాకుమూరు జయరామయ్య, బర్రెల దొరబాబు, కాలనీ పెద్దలు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 05 పున్నమి ప్రతినిధి @ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్‌కార్డులు ఉన్నవారికి తీపికబురు చెప్పింది.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపుల ద్వారా ఉల్లిపాయల్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. రేషన్ కార్డు ఉన్నవారికి కిలో రూ.14కే ఉల్లిపాయలు ఇస్తారు.. ముందుగా కర్నూలు జిల్లాలో నేటి నుంచి ప్రారంభిస్తారు.. అలాగే అన్ని జిల్లాల్లో కూడా త్వరలో (వీలును బట్టి ఇవాళ.. లేని పక్షంలో ఒకటి రెండు రోజుల్లో) పంపిణీ చేస్తారు. రేషన్‌కార్డులు ఉన్నవారు ఎన్ని కేజీలైనా కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. మొదటగా కర్నూలు నగరంలో ఉన్న 170 రేషన్ షాపుల్లో ఉల్లిపాయలు అమ్మడం మొదలుపెడతారు. ఉల్లి రైతులకు న్యాయం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లి రైతులు, వినియోగదారుల కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. కర్నూలు మార్కెట్‌లో మద్దతు ధరకు కొన్న ఉల్లిపాయలను రైతు బజార్లకు పంపుతున్నారు. రేషన్ షాపులు, హాస్టల్స్, మధ్యాహ్న భోజన పథకం, అన్న క్యాంటీన్లకు తక్కువ ధరకే ఉల్లి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.మార్క్‌ఫెడ్ అధికారులు ఉల్లి కొంటుండటంతో వ్యాపారులు కూడా పోటీ పడుతున్నారు. దీనివల్ల ఉల్లి ధర తగ్గడం లేదు. అందుకే ప్రభుత్వం ఉల్లి రైతులకి, కొనేవాళ్ళకి కూడా ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటోంది.
చేజర్ల సెప్టెంబరు (పున్నమి ప్రతినిధి) ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం చేజర్ల మండల విద్యాశాఖ కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారులు శ్రీమతి ఇందిర మరియు డి సి మస్తానయ్య లు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్రపటానికి మాల ధారణ గావించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ సిబ్బంది మరియు సి ఆర్ మొబైల్ టీచర్స్ పాల్గొన్నారు.