Thursday, 7 May 2026

Blog

అన్నమయ్య

బొప్పాయి రైతుల సమ్మె – గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన పంటదారులు

రైల్వేకోడూరు సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల్లో రైతులు వేసిన సుమారు 15 వేల ఎకరాల బొప్పాయి పంట ఇప్పుడు తీవ్ర సమస్యల్లో చిక్కుకుంది. గత ఒకటిన్నర నెలుగా గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.ప్రారంభంలో క్వింటాల్‌కు రూ.16 ఇచ్చిన దళారులు, సిండికేట్‌గా వ్యవహరించి ధరను క్రమంగా రూ.7కు తగ్గించడంతో రైతులు ఆందోళనకు దిగారు. కలెక్టర్ జోక్యం చేసుకొని, ఆగస్టు 1 నుంచి 5 వరకు రూ.9, ఆపై రూ.10గా కొనుగోలు చేయాలని ఆదేశించారు. అయితే, నిర్ణయం కేవలం వారం రోజుల పాటు మాత్రమే అమలై, మళ్లీ ధరను రూ.7కి తగ్గించారు.రైతుల ఆందోళనలపై సబ్ కలెక్టర్ మరోసారి జోక్యం చేసుకొని కనీసం రూ.9కి కొనాలని హెచ్చరించగా, వారం రోజులు ఆ ధర కొనసాగింది. అయితే ఆగస్టు 26న రైతుల అంచనాలను తారుమారు చేస్తూ ధరను కేవలం రూ.5కి తగ్గించారు.రైతులు కనీసం రూ.15 గిట్టుబాటు ధర లేకపోతే అప్పుల కూరుకుపోయే పరిస్థితి తప్పదని చెబుతున్నారు. కలెక్టర్ నిర్ణయించిన రూ.10ను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 2న రాజంపేట సబ్ కలెక్టర్ రైతు సంఘ ప్రతినిధులను కలెక్టర్ వద్దకు తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. దాంతో ఈరోజు రైతులు సమ్మెకు దిగారు. కోడూరులో బొప్పాయి బండ్లు మార్కెట్‌కు రాకుండా నిరసన చేస్తున్నారు.ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకొని మార్క్‌ఫెడ్ ద్వారా నేరుగా కొనుగోలు చేయాలని, దళారుల వ్యవస్థను రద్దు చేసి లైసెన్స్ విధానం అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సీఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ ప్రకటన విడుదల చేశారు.

హైదరాబాద్

మండపాలకి ఉచిత విద్యుత్ .!

దేశంలో ఎక్కడా లేని విధంగా గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్ “శ్రీ విశ్వశాంతి మహాశక్తిగణపతి”ని దర్శించుకుని ఆయన పూజలు చేశారు. 71 ఏళ్ల క్రితం ఒక్క అడుగుతో ఖైరతాబాద్ గణేశుడి ప్రతిష్ఠాపన ప్రారంభమైందన్నారు. ఉత్సవ సమితి నిర్వాహకులు 71 ఏళ్లుగా ఘనంగా పండుగ నిర్వహిస్తున్నారని అభినందించారు. నగరంలో నిమజ్జనానికి ప్రజలు సహకరించాలని సీఎం కోరారు.

Blog

భారతదేశంలో మొదటి టెస్లా కారు కొన్నది ఎవరు.?

ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా (Tesla) తన తొలి వాహనాన్ని అధికారికంగా భారతదేశంలో అందజేసింది. Tesla Model Y కారును మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభ సభ్యులు మరియు మంత్రివర్యులు ప్రతాప్ సర్నాయిక్ గారు స్వీకరించడం జరిగింది. ఇదివరకు కొందరు వ్యాపారవేత్తలు, ప్రముఖులు టెస్లా కార్లను విదేశాల నుండి వ్యక్తిగతంగా దిగుమతి చేసుకున్నప్పటికీ, టెస్లా సంస్థ తరఫున భారత్‌లో డెలివరీ అయిన మొదటి వాహనం ఇదే. ఈ సందర్భంగా ప్రతాప్ సర్నాయిక్ గారు మాట్లాడుతూ, ఎలక్ట్రిక్ వాహనాలు భవిష్యత్‌ రవాణాకు మార్గదర్శకాలు అవుతాయని, పర్యావరణహిత సాంకేతికతను ప్రోత్సహించడం అవసరమని పేర్కొన్నారు.

తెలంగాణ

నిమజ్జనం.. hyd మెట్రో టైమింగ్స్ పొడిగింపు

రేపు HYDలోని ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం నేపథ్యంలో మెట్రో రైలు సమయాన్ని పొడిగించింది. తొలి ట్రైన్ రేపు ఉదయం 6 గంటలకు, చివరి ట్రైన్ అర్ధరాత్రి ఒంటి గంటకు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి బయలుదేరుతాయని తెలిపింది. ప్రయాణికులు, భక్తులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరింది. ఎలాంటి ఇబ్బందులు పడకుండా వేడుకలు చేసుకోవాలని సూచించింది.

ఆంధ్రప్రదేశ్

లిపిడ్ ప్రొఫైల్

ప్రస్తుతం జనాభాలో ఎక్కువ మంది వ్యక్తులు హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. వాటికి ప్రధాన కారణాలలో ఒకటి లిపిడ్ పొరపాయలు (Dyslipidemia). రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) మరియు ట్రైగ్లిసరైడ్లు అధికం కావడం, మంచి కొలెస్ట్రాల్ (HDL) తగ్గిపోవడం వల్ల రక్తనాళాలు దెబ్బతిని హృదయపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు పెరుగుతాయి. అధిక కొవ్వు, వేయించిన పదార్థాలు, వ్యాయామం లోపం, మధుమేహం, అధిక బరువు, పొగతాగడం వంటి అలవాట్లు లిపిడ్ పొరపాయలకు కారణమవుతాయి. ఈ వ్యాధి మొదట్లో స్పష్టమైన లక్షణాలు చూపకపోవడంతో రక్త పరీక్షలు (Lipid Profile) ద్వారా మాత్రమే గుర్తించగలరు. నియమిత వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, బరువు నియంత్రణ, పొగతాగడం మరియు మద్యపానం మానుకోవడం ద్వారా లిపిడ్ స్థాయులను కాపాడుకోవచ్చు. డాక్టర్ల సలహా మేరకు పరీక్షలు చేయించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

త్వరలోనే నుడా ఆధ్వర్యంలో నెల్లూరుకి రింగ్ రోడ్డు : చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డీ

నెల్లూరుకు త్వరలోనే రింగ్రోడ్డు తీసుకొస్తామని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. గతంలో తాను కూడా చైర్మన్ గా పని చేసిన సమయంలో DPR సైతం సిద్ధం చేశామని.. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ దాన్ని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నుడా కార్యాలయంలో సికాన్ ప్రవేట్ లిమిటెడ్ సభ్యులు మరియు నుడా అధికారులతో కోటంరెడ్డి శ్రీనివాసులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు రూపొందించిన DPR ప్రజెంటేషన్ కోటంరెడ్డి పరిశీలించారు. రెండు, మూడు మార్గాలను కోటంరెడ్డి కి వారు సూచించారు. దీనిపై మంత్రి నారాయణతో సమగ్రంగా చర్చిస్తామని కోటంరెడ్డి తెలిపారు.మంత్రి పొంగూరు నారాయణ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహకారంతో నెల్లూరుకు రింగ్రోడ్డు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహానగరాలల్లో ఉన్న రింగ్ రోడ్డును నెల్లూరుకి తీసుకొచ్చి.. మంత్రుల చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తామని.. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే పూర్తి చేయిస్తామని ఆయన వెల్లడించారు.

ఖమ్మం

ప్రధాని నరేంద్ర మోదీ చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ శ్రేణులు

ఖమ్మం పున్నమి ప్రతినిధి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేద ప్రజల అందరికీ ఉపయోగపడే విధంగా జీఎస్టీ ని 28 శాతం ఉన్న పన్నును 18 శాతానికి మరియు 18 శాతం ఉన్న పనులను ఐదు శాతానికి తగ్గించి దేశ సామాన్యం మరియు మధ్యతరగతి ప్రజలందరికీ దసరా దీపావళి పండుగ కానుక రూపంలో ఉపయోగపడే విధంగా చేసినందుకు పెనుబల్లి మండలం సెంటర్లో మండల అధ్యక్షులు బొర్రా నరసింహారావు ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయటం మరియు టపాస కాల్చటం జరిగింది, ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈవి రమేష్ మరియు జిల్లా కార్యదర్శి సుదర్శన్ మిశ్రా మరియు జిల్లా అధికార ప్రతినిధి పడగల మధుసూదన్ మరియు మండల ప్రధాన కార్యదర్శి గాయం నాగరాజు గారు మండల కార్యదర్శి కోటా సుధాకర్ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు చెక్కిలాల మంగేశ్వరరావు మండల ఉపాధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు పేర్ల మహేష్ కిరణ్ నాగబండ వెంకటేశ్వరరావు నాయుడు గోవర్ధన్ సతీష్ ఆసంటి వినయ్ మదన్ మోహన్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఓనం శుభాకాంక్షలు.. రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు ఓణం పండుగ సందర్భంగా కేరళ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తన సందేశంలో ఆయన ఇలా పేర్కొన్నారు: “ఓణం పండుగ కేరళ రాష్ట్రానికి మాత్రమే కాకుండా భారతదేశం మొత్తం గర్వించదగ్గ పండుగ. ఇది ఆనందం, ఐక్యత, స్నేహం, సౌభ్రాతృత్వానికి ప్రతీక. మహాబలి చక్రవర్తి కాలం నాటి సుసంపన్నత, సమానత్వం, న్యాయం అనే విలువలను ఈ పండుగ మనకు గుర్తుచేస్తుంది. ఈ సందర్భంగా కేరళ ప్రజలు తమ కుటుంబాలతో కలసి పూలతోరణాలు (పూకళం), ఓణసద్య విందులు, పడవ పందేలలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగను జరుపుకోవడం కేరళ సంస్కృతికి ఉన్న వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. మనందరం ఈ పండుగను జరుపుకుంటూ సమాజంలో సమానత్వం, న్యాయం, సత్యం అనే విలువలను కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరి సుఖసంతోషాలు, అభివృద్ధి, శాంతి మన కర్తవ్యంగా భావించాలి. కేరళ ప్రజలంతా ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈ పండుగ కొత్త ఆశలు, విజయాలు, శాంతి మీ జీవితాల్లో నింపాలని ఆకాంక్షిస్తున్నాను.”

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు..

నెల్లూరు సిటీ MSM హై స్కూల్ ఉపాధ్యాయుడు సిహెచ్ మోహన్ రెడ్డి గారు గురుపూజోత్సవ సందర్భంగా నెల్లూరు మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నెల్లూరు నగర తూర్పు ప్రాంతాలలోని MSM హై స్కూల్ ఉపాధ్యాయుడికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం సంతోషదాయకం. పై కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్కూల్ కరస్పాండెంట్ విద్యార్థులు విద్యార్థి తండ్రులు ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేయడమైనది…

నాగర్‌కర్నూల్

మొట్ట మొదటి తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 5 భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు దేశం లోని బడుగు,బలహీన, అణగారిన, నిరుపేద ప్రజలకు అక్షరాలు నేర్పించి విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత యావత్ భారతదేశం లోనే మొట్ట మొదటి తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు మరియు మహాత్మా జ్యోతిరావు పూలే అప్పల మాసయ్య యాదవ్ బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు తెలిపారు. నేడు సెప్టెంబర్ 5వ తేది ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆది గురువులు అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారిని మరియు సావిత్రిబాయి పూలే గారిని స్మరించుకుంటూ ఆ మహనీయులకు మనస్పూర్తిగా పాదాభివందనం చేస్తూ యావత్ భారతదేశం లోని సబ్బండ ప్రజలు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.