Thursday, 7 May 2026

Blog

కాకినాడ

వచ్చే ఏడాది మార్చి వరకు సికింద్రాబాద్ కు ప్రత్యేక రైలు సర్వీసులు పొడిగింపు* ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వెల్లడి

కాకినాడ, సెప్టెంబర్ 4: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాకినాడ – సికింద్రాబాద్ ల మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు సర్వీసులను వచ్చే ఏడాది మర్చి వరకు పొడిగించడంతో పాటు అదనంగా మరో ప్రత్యేక రైలు సర్వీస్ ని కేటాయించినట్లు కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వెల్లడించారు. గురువారం కాకినాడలో ఆయన మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజల విజ్ఞప్తి మేరకు సికింద్రాబాద్ కు నడుస్తున్న ప్రత్యేక రైల్వే సర్వీస్ లను మరికొంత కాలం పొడిగించాలని కోరుతూ ఈ ఏడాది జూన్ 19 న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కు లేఖ రాయడం జరిగిందన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు ప్రస్తుతం వారానికి మూడు రోజులు కాకినాడ నుండి లింగంపల్లి వరకు నడుస్తున్న ప్రత్యేక రైలు తో పాటు అదనంగా ప్రతి శనివారం కాకినాడ నుండి చర్లపల్లికి ప్రత్యేక రైలు సర్వీస్ ను కేటాయించినట్టు తెలిపారు. ఈ రెండు ప్రత్యేక రైలు సర్వీసులు వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగుతాయన్నారు. దీనికి సంబంధించి రైల్వే శాఖ అధికారుల నుండి సమాచారం వచ్చిందని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కోరారు.

అన్నమయ్య

రాజంపేట సబ్ కలెక్టర్‌కు డీఆర్సీసీ సభ్యుడు తల్లెం భరత్ వినతి పత్రం

రాజంపేట, సెప్టెంబర్ 04: ఈ రోజు మధ్యాహ్నం రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సబ్ కలెక్టర్ భావన మేడమ్‌ను మర్యాద పూర్వకంగా కలిసి గుంటకల్లు రైల్వే డీఆర్సీసీ సభ్యులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓబులవారిపల్లె మండలం మంగంపేట సచివాలయం పరిధిలోని కాపుపల్లి, అగ్రహారం, హరిజనవాడ, అరుంధతివాడ గ్రామాలు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో అక్కడి ప్రజలు రేషన్ బియ్యం కోసం ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల ఆయా గ్రామాలలోనే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా మంగంపేట గ్రామం డేంజర్ జోన్ ఆర్ అండ్ ఆర్ ఫైవ్‌లో ఉండటంతో, అక్కడి ప్రజలకు రావలసిన కొత్త నష్టపరిహారాలు, పెండింగ్‌లో ఉన్న పరిహారాలను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గల్లా శ్రీనివాసులు, కౌలూరి రఘురాంరెడ్డి, కౌలూరి చిన్నికృష్ణారెడ్డి, మడగల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం

సెప్టెంబర్ 04 పున్నమి ప్రతినిధి @ ఆయుష్మాన్ భారత్- ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపిన కేబినెట్. ఏడాది ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానానికి కేబినెట్ ఆమోదం.

నాగర్‌కర్నూల్

అభివృద్ధి పనులపై సమీక్షించిన జిల్లా జడ్పీ సీఈవో గోపాల్ నాయక్

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 4 నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో గురువారం అభివృద్ధి పనులపై జిల్లా జడ్పీ సీఈవో గోపాల్ నాయక్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేసే బాధ్యత పంచాయతీ కార్యదర్శులదేనని మరియు ప్రతి గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను పోలింగ్ బూతులను పర్యవేక్షించి వాటిలో విద్యుత్తు సదుపాయం బాత్రూంలో సదుపాయం ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి చంద్రశేఖర్ కార్యాలయ సిబ్బంది వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

గ్రామ పంచాయతీల ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు..ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ లేఖ

సెప్టెంబర్ 04 పున్నమి ప్రతినిధి @ వచ్చే ఏడాది ఏప్రిల్ 2కు ముగుస్తున్న సర్పంచుల గడువు గ్రామ పంచాయతీ ఎన్నికల పదవీ కాలం వచ్చే ఏడాది ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు కార్యకలాపాలను నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ లేఖ రాసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 2వ తేదీ నాటికి గ్రామ పంచాయితీల పదవీ కాలం ముగియనుంది. అప్పటిలోపు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. అందుకోసం సర్పంచ్లు, వార్డు సభ్యుల రిజర్వేషన్లు, డీలిమిటేషన్, ఖరారు వంటి ముందస్తు ఎన్నికల కార్యకలాపాలను పూర్తి చేయాల్సి ఉంది. *ప్రీ ఎలక్షన్ షెడ్యూల్..* ▪️డీలిమిటేషన్, రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియను అక్టోబరు 15లోగా పూర్తి చేసుకోవాలి. ▪️అక్టోబరు 16 నుంచి నవంబరు 15లోపు వార్డుల వారీ ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలి. ▪️నవంబరు 1 నుంచి 15 దాకా రిటర్నింగ్ అధికారులను నియమించుకోవాలి. ▪️నవంబరు 16 నుంచి పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకుని తుది జాబితా సిద్ధం చేయాలి. ▪️నవంబరు 30 లోగా ఎన్నికల కసరత్తు పూర్తి చేయాలి. ▪️రిజర్వేషన్ల ప్రక్రియను డిసెంబరు 15 లోగా పూర్తి కావాలి. ▪️డిసెంబరు చివరి వారంలో రాజకీయ పార్టీలతోను, సీనియర్ అధికారులతోను సమావేశం నిర్వహించాలి. ▪️2026 జనవరి నుంచి గ్రామ పంచాయతీలకు, జూలై నుంచి ఎంపీటీసీ/జడ్పీటీసీలకు ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని నీలం సాహ్నీ తెలిపారు.

తిరుపతి

రేణిగుంట PACS చైర్మన్ మరియు సభ్యులకు శుభాకాంక్షలు :ఎమ్మెల్యే బొజ్జల

శ్రీకాళహస్తి నియోజక వర్గంలో రేణిగుంట PACS చైర్మన్ భాస్కర్ రెడ్డి మరియు సభ్యుల ప్రమాణస్వీకరానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి విచ్చేసారు.చైర్మన్ గా ఎన్నికైన భాస్కర్ రెడ్డి మరియు సభ్యులు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి కి ఘనంగా స్వాగతం పలికి ఈ పదవులు రావడానికి సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ రైతులకు సులభంగా రుణాలు అందించడం,రైతు క్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

దేశ ప్రజలకు GST ట్యాక్స్ తగ్గింపు.

సెప్టెంబర్ 04 పున్నమి ప్రతినిధి @ ప్రతిరోజు వాడే వస్తువులపై ఐటమ్ ఫ్రమ్ — టూ హెయిర్ ఆయిల్ 18%. 5% షాంపు 18%. 5% టూత్ పేస్ట్ 18%. 5% సోప్స్ 18%. 5% షేవింగ్ క్రీమ్. 18%. 5% బటర్ 12%. 5% నెయ్యి 12%. .5% చీజ్ 12%. 5% డెయిరీ స్ప్రెడ్స్. 12%. 5% ఓటెన్ సెల్స్ 12%. 5% ఫీడింగ్ బాటిల్స్. 12%. 5% ప్యాకింగ్ నాప్కిన్స్ ఫర్ 12%. . 5% బేబీస్, క్లినికల్ డైపర్స్. 12%. 5% టైలరింగ్ మిషన్స్ & పార్ట్ 12%. 5% హెల్త్ కేర్ ఐటమ్స్ లైఫ్ ఇన్సూరెన్స్, 18%. 0% హెల్త్ ఇన్సూరెన్స్. 18%. 0% ధర్మమిటర్. 18%. 5% మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్. 12%. 5% డయాగ్నాస్టిక్స్. ఐటమ్స్. 12%. 5% గ్లూకో మీటర్ టెస్ట్ స్ట్రిప్స్. 12%. 5% కరెక్టివ్ స్పెటికల్స్. 12%. 5% ఎడ్యుకేషన్ మ్యాప్స్ చార్ట్స్ గ్లోబ్స్. 12%. nil పెన్సిల్స్ క్యార్న్స్, షాపర్నస్. 12%. nil ఎక్స్ప్రెస్ బుక్స్, నోట్ బుక్స్12%. nil రబ్బరు. 5%. nil అగ్రికల్చర్, ఫార్మర్స్ ట్రాక్టర్ టైర్స్, పార్ట్స్. 18%. 5% ట్రాక్టర్. 12%. 5% బయో ఫెస్టిసైడ్స్ మైక్రో న్యూట్రియెంట్స్ 12%. 5% డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ స్పింక్లేర్స్. 12%. 5% హార్టికల్చర్, ఫారెస్ట్రీ మెషిన్స్ కల్టివేషన్ మెషిన్స్, హార్వెస్టింగ్ మెషిన్స్. 12%. 5% ఆటోమొబైల్ పెట్రోల్, పెట్రోల్ హైబ్రిడ్ LPG CNG cars, 1200cc & 4000mm. మించి ఉండకూడదు 28%. 18% డీజిల్, డీజిల్ హైబ్రిడ్ LPG CNG cars, 1200cc & 4000mm. మించి ఉండకూడదు 28%. 18% 3 వీల్ వెహికల్స్ 28%. 18% మోటార్ సైకిల్స్ 350 cc కింద 28%. 18% మోటార్ వెహికల్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్ 28%. 18% ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఎయిర్ కండిషన్స్ 28%. 18% టీవీ (above 32′) Including LED, LCD 28%. 18% మానిటర్లు & ప్రొజెక్టర్ 28%. 18% డిష్ వాషింగ్ మెషీన్లు 28%. 18%..

తిరుపతి

కందాటి విశ్వేశ్వర్ రెడ్డిని సన్మానించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.

ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇంటర్మీడియట్ నాన్ టీచింగ్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఇటీవల రెండవసారి కందటి విశ్వేశ్వర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కందాటి విశ్వేశ్వర్ రెడ్డి ని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాన్ టీచింగ్ అసోసియేషన్ సమస్యలను పరిష్కరించే విధంగా పనిచేయాలన్నారు.

ఆంధ్రప్రదేశ్

అనాథ పిల్లలకు శుభవార్త.. నెలకు రూ.4 వేలు!

సెప్టెంబర్ 04 పున్నమి ప్రతినిధి @ అనాథ పిల్లలకు శుభవార్త. తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోయినా, విడాకులు తీసుకున్నా అలాంటి నిస్సహాయ 1-18 ఏళ్ల పిల్లలకు ‘మిషన్ వాత్సల్య’ పథకం భరోసా కల్పిస్తోంది. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఈ పథకాన్ని పర్యవేక్షిస్తోంది. బాధిత పిల్లలకు నెలకు రూ.4 వేల ఆర్థిక సహాయం అందనుంది. ఈ పథకం లబ్ధి పొందాలంటే అంగన్వాడీ కేంద్రంలో అప్లై చేసుకోవాలి. పిల్లల జనన ధ్రువీకరణ పత్రం, తల్లి లేదా తండ్రి మరణిస్తే ఆ ధ్రువపత్రం సమర్పించాలి.

ఆంధ్రప్రదేశ్

పెట్రోలు బంక్ యజమానిపై, సిబ్బందిపై ఫిర్యాదు

సెప్టెంబర్ పున్నమి ప్రతినిధి @ పెట్రోల్ బంకుల్లో మంచి నీళ్లు లేకపోయినా వాహనాలకు గాలి సౌకర్యం లేకపోయినా టాయిలెట్ వాడుకోవడానికి అవకాశం లేకపోయినా, శుభ్రం లేకపోయినా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మందులు లేకపోయినా . పెట్రోలు, డీజిల్ కల్తీ జరిగినా . పెట్రోల్, డీజిల్ కొలతలు తేడా వచ్చిన పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బంది మన పట్ల దురుసుగా ప్రవర్తించిన. పెట్రోలు బంక్ యజమానిపై, సిబ్బందిపై ఫిర్యాదు చేయడానికి, పెట్రోలు సరఫరా చేసే సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు . ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు ఇండియన్ ఆయిల్-1800233355 భారత్ పెట్రోలియం-1800224344 హెచ్పిసిఎల్-18002333555 రిలయన్స్-18008919023.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.