Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Annamayya

“వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో వినాయక నిమజ్జనం వైభవంగా

Punnami Newsroom Published:
“వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో వినాయక నిమజ్జనం వైభవంగా

Story highlights

  • చిట్వేల్ మండలంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణం వద్ద వినాయక స్వామి నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగింది.
  • డీజే, బ్యాండ్ మేళాలతో ఊరంతా సందడిగా మారి, గణపయ్య నినాదాలతో వాతావరణం మార్మోగింది.
  • చిన్నా పెద్దా అందరూ పాల్గొని గణనాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికారు.

చిట్వేల్ మండలంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణం వద్ద వినాయక స్వామి నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగింది. డీజే, బ్యాండ్ మేళాలతో ఊరంతా సందడిగా మారి, గణపయ్య నినాదాలతో వాతావరణం మార్మోగింది. చిన్నా పెద్దా అందరూ పాల్గొని గణనాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమం ఆలియా కమిటీ కార్యకర్త కట్ట రామ్మోహన్ నాయుడు, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత శ్రద్ధగా నిర్వహించబడింది. భక్తులు పెద్ద ఎత్తున హాజరై గణపయ్య సేవలో భాగమయ్యారు. గ్రామ యువత గుంపులు గుంపులుగా చేరి డీజే బాణీలు, భక్తి గీతాలకు నాట్యం చేస్తూ ఉత్సవాన్ని మరింత ఉత్సాహవంతం చేశారు. ఈ సందర్భంలో నిర్వహించిన లడ్డు యాలం పోటీలో చిట్వేలు మండలం గాంధీనగర్ వాస్తవ్యులు ఆవులకుంట ప్రసాద్ గారు రూ.23,000 చెల్లించి లడ్డు యాలం సొంతం చేసుకున్నారు. ఈ ఘట్టం గ్రామంలో విశేష ఆకర్షణగా నిలిచింది. ప్రజలు మాట్లాడుతూ— “వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్ద గణపయ్య నిమజ్జనం జరగడం చాలా ప్రత్యేకం. అందరి సహకారంతో జరిగిన ఈ వేడుక ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా నిలుస్తుంది” అని అభిప్రాయపడ్డారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *