Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

తిరుమల భక్తుల భద్రతపై హైకోర్టు తీర్పు – నవంబర్‌లోపు ఇనుపకంచె తప్పనిసరి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తిరుమల భక్తుల భద్రతపై హైకోర్టు తీర్పు – నవంబర్‌లోపు ఇనుపకంచె తప్పనిసరి

వార్త ముఖ్యాంశాలు

  • ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరుమల నడకదారి భక్తుల రక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది.
  • అలిపిరి నడకమార్గంలో ఇరువైపులా ఇనుపకంచెలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.
  • భక్తులు ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా, సురక్షితంగా దారిలో నడిచేలా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరుమల నడకదారి భక్తుల రక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. అలిపిరి నడకమార్గంలో ఇరువైపులా ఇనుపకంచెలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. భక్తులు ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా, సురక్షితంగా దారిలో నడిచేలా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ చర్యలను ఈ ఏడాది నవంబర్‌లోగా పూర్తి చేయాలని గడువుని కూడా నిర్దేశించింది. భక్తుల రక్షణకు సంబంధించి నిపుణుల సూచనలతో చేసిన సిఫార్సులను అమలు చేయడానికి ప్రత్యేక జాయింట్ కమిటీని నియమిస్తూ, పనుల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది. తిరుమల చేరే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ ఆదేశాలు అమలులోకి వస్తే నడకమార్గం మరింత భద్రతతో కూడుకున్నదిగా మారనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *