Monday, 15 June 2026
  • Home  
  • భమిడిపాటి గౌరీశంకర్‌కు విశ్వ సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్ష పదవి
- ఆంధ్రప్రదేశ్ - శ్రీకాకుళం 

భమిడిపాటి గౌరీశంకర్‌కు విశ్వ సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్ష పదవి

విశ్వ సాహితీ కళావేదిక సాహిత్య, సంస్కృతి, సేవా సంస్థ తమ కార్యక్రమాలను విస్తరించే క్రమంలో, జిల్లాస్థాయి అధ్యక్షుడిగా కథా రచయిత, గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్ కళాశాల తెలుగు విభాగాధిపతి భమిడిపాటి గౌరీశంకర్ నియమితులయ్యారు. సంస్థ చైర్‌పర్సన్ శ్రీమతి కొల్లి రమావతి నియామక పత్రాన్ని పంపించారు. ఈ సందర్భంగా ఒక ప్రత్యేక బృందాన్ని కూడా నియమించారని సంస్థ వర్గాలు వెల్లడించాయి.భమిడిపాటి గౌరీశంకర్ గత మూడు దశాబ్దాలుగా రచనలతో సాహిత్య రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అనేక కథలకు పురస్కారాలు, బహుమతులు అందుకున్న ఆయన ఇప్పటివరకు ఇరవై గ్రంథాలను ప్రచురించారు. ‘మహతి పురస్కారం’ వంటి ప్రతిష్ఠాత్మక గౌరవాలను కూడా అందుకున్నారు.ఈ నియామక సందర్భంగా విద్యాసంస్థల అధినేత జి.వి. స్వామినాయుడు, కళాశాల ప్రిన్సిపాల్ కె.వి.వి. సత్యనారాయణ, అధ్యాపక బృందం మరియు సాహిత్యాభిమానులు అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.