మానుబోలు, జూలై 31:ఏపీఎస్పీడీసీఎల్ మానుబోలు సెక్షన్‌కు చెందిన కటకం శేషయ్య 1990 సంవత్సరంలో విలేజ్ హెల్పర్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, అనంతరం హెల్పర్, జూనియర్ లైన్‌మన్, లైన్‌మన్, లైన్ ఇన్‌స్పెక్టర్ తదితర పదవుల్లో సుమారు 36 సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించి, 2026 జూలై 31న పదవీ విరమణ పొందారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పదవీ విరమణ సన్మాన సభకు అసిస్టెంట్ ఇంజనీర్ పనబాక అనిల్ కుమార్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు కటకం శేషయ్య అందించిన సేవలను కొనియాడుతూ, ఆయన నిజాయితీ, క్రమశిక్షణ, సేవాభావం విద్యుత్ శాఖకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జే. రాంబాబు, పెంచల ప్రసాద్ (సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు), బొజ్జ సుమన్ (కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి), రాజశేఖర్ (లైన్ ఇన్‌స్పెక్టర్, మానుబోలు), కె. శేషయ్య (లైన్ ఇన్‌స్పెక్టర్) తదితరులు పాల్గొని పదవీ విరమణ పొందిన కటకం శేషయ్యను ఘనంగా సన్మానించి, శాలువా కప్పి జ్ఞాపిక అందజేశారు. అనంతర జీవితం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.ఇట్లు,పున్నమి రిపోర్టర్ కటకం. విజయ కుమార్



