ప్రజల గడపకు పాలన.. సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం!
నందిగామలో ప్రత్యేక స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక.. అధికార యంత్రాంగంతో కలిసి ప్రజల సమస్యలను విన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు..
నందిగామ: ప్రజలకు పాలనను మరింత చేరువ చేసి, వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు స్పష్టం చేశారు. నందిగామ పట్టణంలోని మధిర ఆర్చి రోడ్డులో ఉన్న ఆర్ఎస్ గార్డెన్స్‌లో నిర్వహించిన ప్రత్యేక స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (Special People Friendly Public Grievance Redressal System–PGRS) కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలేఖ్య గారు, జిల్లా అధికార యంత్రాంగం, కూటమి నేతలతో కలిసి ప్రజల నుంచి సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి అధికారులతో చర్చించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రజా వేదికలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ఎమ్మెల్యే సౌమ్య గారు పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి ఉండేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత *“ప్రజల వద్దకే పాలన.. ప్రజల సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం”* అనే విధానంతో ముందుకు సాగుతోందని ఆమె తెలిపారు. నందిగామ నియోజకవర్గంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు అధికార యంత్రాంగంతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నామని వెల్లడించారు.
ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే సౌమ్య గారు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు అందేలా చూడాలని అధికారులను కోరారు.
కూటమి ప్రభుత్వంలో ప్రజల సమస్యలకు ప్రాధాన్యత.. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు పెద్దపీట వేస్తూ నందిగామ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని తంగిరాల సౌమ్య గారు తెలిపారు.


