Sunday, 28 June 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినోత్సవ ర్యాలీ ఘనం
- తిరుపతి

శ్రీకాళహస్తిలో శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినోత్సవ ర్యాలీ ఘనం

శ్రీ కాళహస్తి, జూన్ 27, (పున్నమి న్యూస్) : ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం, హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం శ్రీకాళహస్తి పట్టణంలో భారీ ర్యాలీ ఉత్సాహభరితంగా నిర్వహించారు. స్థానిక శివాజీ జంక్షన్ వద్ద శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం ర్యాలీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశ రక్షణ, హిందూ ధర్మ పరిరక్షణలో ఛత్రపతి శివాజీ మహారాజ్ చూపిన శౌర్యం, ధైర్యసాహసాలు నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. శివాజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని దేశభక్తి, సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జై శివాజీ.. జై భవానీ నినాదాలతో పట్టణ వీధులు మారుమోగగా, కార్యక్రమంలో విద్యార్థులు, యువత, భారతీయ జనతా పార్టీ నాయకులు, హిందూ సంఘాల ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.