Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

యేకొల్లులో హోరెత్తిన సర్పంచ్ అభ్యర్థి బి. ఉదయ్ కుమార్ ప్రచారం ఇంటింటా తిరుగుతూ.. పెద్దల ఆశీర్వాదాలతో దూసుకుపోత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
యేకొల్లులో హోరెత్తిన సర్పంచ్ అభ్యర్థి బి. ఉదయ్ కుమార్ ప్రచారం ఇంటింటా తిరుగుతూ.. పెద్దల ఆశీర్వాదాలతో దూసుకుపోత

వార్త ముఖ్యాంశాలు

  • దొరవారిసత్రం మండలం, యేకొల్లు: యేకొల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి బందిల ఉదయ్ కుమార్ ప్రచారం రోజురోజుకూ జోరందుకుంటోంది.
  • గ్రామంలోని ప్రతి వీధి, ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి, ప్రతి ఓటరును పేరు పేరునా కలిసి, ఆశీర్వాదాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
  • గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు.

దొరవారిసత్రం మండలం, యేకొల్లు:

యేకొల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న
అభ్యర్థి బందిల ఉదయ్ కుమార్ ప్రచారం రోజురోజుకూ జోరందుకుంటోంది.

గ్రామంలోని ప్రతి వీధి, ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి, ప్రతి
ఓటరును పేరు పేరునా కలిసి, ఆశీర్వాదాలు తీసుకుంటూ ముందుకు
సాగుతున్నారు. గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు ఆయనకు ఘన
స్వాగతం పలుకుతున్నారు. పలు చోట్ల మహిళలు హారతులు ఇచ్చి,
శాలువాలతో సన్మానించి తమ మద్దతును తెలియజేశారు.

ఈ సందర్భంగా బి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ…

“అధికారం కోసం ఆరాటం కాదు.. ప్రజా సమస్యలకే పోరాటం.
ప్రజల ఆశీర్వాదమే నా బలం, గ్రామ అభివృద్ధే నా లక్ష్యం.

గ్రామంలో రహదారులు, పారిశుధ్యం, స్వచ్ఛమైన త్రాగునీరు,
వీధి దీపాలు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడమే నా మొదటి
ప్రాధాన్యత. యువతకు ఉపాధి, మహిళలకు భద్రత, రైతులకు అండగా
నిలబడతాను. యేకొల్లును అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తాను”

అని హామీ ఇచ్చారు.

అభివృద్ధి చేసే వ్యక్తినే గెలిపించాలని, మీ విలువైన ఓటును
మంచం గుర్తుకే వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

ప్రచార కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు,
కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Udayపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *