Thursday, 7 May 2026

Blog

క్రైమ్

ఆంద్రప్రదేశ్ పోలీసు చరిత్రలో సరికొత్త శిక్షణ ఇచ్చాం

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ డ్రగ్స్ ను కూడా గుర్తించేలా జాగిలాలకు శిక్షణ ఇచ్చాం. గంజాయి, డ్రగ్స్ పూర్తిగా నిరోధించేలా కార్యక్రమాలు చేపట్టాం. నిరంతరం నిఘా పెట్టి తనిఖీలు ముమ్మరం చేశాం. సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో నేరాల సంఖ్య తగ్గించాం. 22వ బ్యాచ్‍కి సరికొత్త విధానంలో అనేక అంశాల్లో శిక్షణ ఇచ్చాం. సమాజ శ్రేయస్సులో మీరంతా భాగస్వామ్యం కావాలి. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

ఆంధ్రప్రదేశ్

ఉల్లి రైతుకు చంద్రన్న అండ! కిలోగ్రాముకి ₹1200తో భరోసా చెల్లింపులు

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ ఉల్లిపాయల ధర పతనం నేపథ్యంలో… కౌలు రైతులకు నష్ట పరిహారం 82 క్వింటాళ్ళ కొనుగోలు చేసిన ప్రయివేట్ వ్యాపారులు ప్రభుత్వం ద్వారా మొత్తం 1612 క్వింటాళ్ల కొనుగోలు కర్నూలు మార్కెట్ లో పెద్ద ఎత్తున ఉల్లి కొనుగోళ్లకు శ్రీకారం రైతు నేస్తం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పంటల సురక్షకు గ్యారంటీ… రైతుకు ఆదాయం ఆశాభారితం!

ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ డిమాండ్ కంటే అదనంగానే నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని… డిమాండ్ కంటే అదనంగానే నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యత, మార్కెటింగ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఇ-క్రాప్ ద్వారా రాష్ట్రంలో ఎంత మేర ఏ పంటలు సాగు అవుతున్నాయి… ఎరువుల వినియోగం ఎంత జరుగుతుందన్న లెక్కలు తీయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిరంతర పర్యవేక్షణ ద్వారా సమస్య రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈసారి 2.02 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా అయ్యిందని.. వాస్తవ డిమాండ్ కంటే అదనంగా నిల్వలు ఉన్నాయని అధికారులు వివరించారు. గతంతో పోలిస్తే ఈసారి 91 వేల మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా వచ్చినట్టు తెలిపారు. ఇక డీఏపీ 51,700 మెట్రిక్ టన్నుల మేర వచ్చిందని… గత ఏడాదితో పోలిస్తే 16 వేల మెట్రిక్ టన్నులు ఇది అదనమని అధికారులు సీఎంకు తెలిపారు. కాంప్లెక్స్ ఎరువులు కూడా ప్రస్తుత ఏడాదిలో 2.72 లక్షల మెట్రిక్ టన్నుల మేర వచ్చాయని వివరించారు. గతంతో పోలిస్తే 1.20 లక్షల మెట్రిక్ టన్నులు ఇది అదనమని తెలియచేశారు. దీనిపై స్పందించిన సీఎం రాష్ట్రంలో ఎరువుల లభ్యత ఇంతగా ఉన్నా.. కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా యూరియా వినియోగం కూడా లెక్కించాలని అన్నారు.

ఆంధ్రప్రదేశ్

తడి చెత్త, పొడి చెత్త తో పాటు ఇంట్లో ఉన్న పాత సామాన్లను గ్రామపంచాయతీ సిబ్బందికి ఇస్తే వాటికి ధర కట్టి వాళ్లకు కావలసిన కూరగాయలు

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏపీ అభివృద్ధి పైన దృష్టి సారిస్తూనే, మరోవైపు స్వచ్ఛతకు కూడా పెద్దపీట వేస్తూ పలు కార్యక్రమాలను చేపడుతుంది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛభారత్ మిషన్ అమలులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ గా మార్చాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. ప్రధాని మోదీ లక్ష్యాన్ని సాకారం చేసేలా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం దీనికోసం ఇప్పటికే తడి చెత్త, పొడి చెత్త తో పాటు ఇంట్లో ఉన్న పాత సామాన్లను గ్రామపంచాయతీ సిబ్బందికి ఇస్తే వాటికి ధర కట్టి వాళ్లకు కావలసిన కూరగాయలు, నిత్య అవసరాలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. ప్రతి ఒక్కరిలోనూ స్వచ్ఛతపై అవగాహన కలిగించడానికి ఈ తరహా ప్రయత్నాన్ని చేయాలనుకుంటున్న ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. స్వచ్చాంధ్ర అవార్డుల ప్రధానం రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, గ్రామాలను పరిశుభ్రంగా మార్చే పనిలో ఉన్న ప్రభుత్వం స్వచ్చాంధ్ర అవార్డులను ప్రధానం చేయాలని సంకల్పించింది. ఈ స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యం పైన వివిధ శాఖల వారీగా సేకరించిన రిపోర్టుల ఆధారంగా అవార్డులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోను విశేషంగా కృషి చేసిన వారిని గుర్తించి వారికి ప్రభుత్వం అవార్డులను ఇవ్వాలని నిర్ణయించింది. 13 కేటగిరీలలో అవార్డులు ఈ నిర్ణయంతో క్షేత్రస్థాయిలో పరిశుభ్రతను ప్రోత్సహించి అందులో చురుకుగా పాల్గొన్న వారిని గుర్తించనుంది. తద్వారా వారిని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 13 కేటగిరీలలో ఇచ్చే ఈ అవార్డులలో ఎన్జీవోలు, స్వచ్ఛ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. మహాత్మా గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీన ఈ అవార్డులను ప్రదానం చేయాలని భావిస్తున్నది ఏపీ ప్రభుత్వం. రాష్ట్ర స్థాయిలో 52 అవార్డులు, జిల్లా స్థాయిలో 1421 అవార్డులు ఈ క్రమంలో జిల్లా కలెక్టర్లు నామినేషన్లు తీసుకుని ఎంపిక ప్రక్రియ చేయాలని సూచించింది. ఇలా ఎంపికైన వారిని రాష్ట్ర, జిల్లాల స్థాయిలో ప్రత్యేకంగా సత్కరించనున్నారు. రాష్ట్ర స్థాయిలో 52 అవార్డులు, జిల్లా స్థాయిలో 1421 అవార్డులు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం దీని ద్వారా ప్రజలలో పరిశుభ్రత పైన చైతన్యం పెంపొందించనుంది. ఇక ఈ అవార్డుల మరియు ప్రధాన ప్రక్రియను నోడల్ ఏజెన్సీగా స్వచ్చాంధ్ర కార్పొరేషన్ పర్యవేక్షించనుంది

తెలంగాణ

వినాయక నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించిన : జిల్లా కలెక్టర్

నకిరేకల్ : సెప్టెంబర్ ( పున్నమి ప్రతినిధి ) వినాయక నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం(సెప్టెంబర్ 2) ఆమె నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని వల్లభరావు చెరువులో నిమజ్జనం జరిగే ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి పరిశీలించారు. ఈనెల ఐదున గణేష్ నిమజ్జనం జరగనున్న సందర్బంగా హలియా సమీపంలోని 14వ మైలురాయి వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి క్రేన్ల ఏర్పాటు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, అవసరమైనంత వెలుతురు ఉండేలా లైటింగ్, తాగునీరు. బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్,జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, డి.ఎస్.పి శివరాం రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు ఉన్నారు.

తెలంగాణ

వీధి కుక్కల పై అవగాహన కల్పించాలన్న,:జిల్లా కలెక్టర్

నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల దృశ్య దేవరకొండ డివిజన్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణను చేయాలని,అన్ని పోలింగ్ కేంద్రాలలో మాలిక వసతులను కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. వీధి కుక్కలపై అవగాహనను కొనసాగించాలని, ప్రజలు వీధి కుక్కల బారిన పడకుండా మున్సిపల్, గ్రామీణ ప్రాంతాలలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ముఖ్యంగా మున్సిపల్ గ్రామీణ ప్రాంతాలలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని, పాఠశాల విద్యార్థులకు కూడా అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్లపై సమీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆర్డిఓ కార్యాలయం ఆవరణలో వీధి కుక్కలపై అవగాహనకై ఏర్పాటు చేసిన బ్యానర్ ను పరిశీలించారు.

ఆంధ్రప్రదేశ్

లోకేష్‌కు అంగన్వాడీల వినతి – మంత్రి హామీ

సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @కడపజిల్లా అంగన్వాడీలకు జీతాలు పెంచాలని కోరుతూ … మంత్రి లోకేష్‌కు ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.లక్ష్మీదేవి వినతిపత్రం సమర్పించారు. మంగళవారం సీకే దీన్నే మండలంలో ఐటి, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసిన అంగన్వాడీ నాయకురాలు లక్ష్మీదేవి అంగన్వాడి కేంద్రాలలో పనిచేస్తున్న కార్యకర్తలకు, ఆయాలకు జీతాలు పెంచాలని కోరి వినతిపత్రాన్నిచ్చారు. అనంతరం లక్ష్మీదేవి మాట్లాడుతూ …. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామని, కనీస వేతనం అమలు చేయాలని కోరారు. అంగన్వాడీ సెంటర్లకు సన్న బియ్యం సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన మంత్రి లోకేష్‌ … ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన వెంటనే అంగన్వాడీల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ రూరల్‌ ప్రాజెక్టు అధ్యక్ష, ప్రధాన కారదర్శులు నాగలక్ష్మి, అరుణ, మండల నాయకులు శాంతమ్మ, ప్యారి జాన్‌ పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

నల్లా పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రమణ

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నల్లా చారిటబుల్ ట్రస్ట్ అధినేత నల్లా పవన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా అయినవిల్లి మండల బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ మంగళవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిసి ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కేకు కట్ చేయించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ ఆయన రానున్న రోజుల్లో ఇంకా అత్యున్నత పదవులు సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

విద్య విజ్ఞానం

ఉపాధి / ఉద్యోగ అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఔత్సాహితులకు సిసిఆర్ చేయూత.

సెప్టెంబర్ 09 పున్నమి ప్రతినిధి @ మీరు సమర్పించే వివరాలకు అనుగుణంగా ఉపాధి అవకాశం కల్పించడం కోసం చిరు ప్రయత్నం… ఆసక్తి వున్న ఔత్సాహితులు అందరూ కూడా ఈ క్రింది గూగుల్ ఫామ్ ను ఫిల్ చేసి, సబ్మిట్ చేయగలరు: ఉపాధి అవకాశం కోసం ఎదురు చూస్తున్న మీ తోటి స్నేహితులు /బంధువులు / పరిచయస్తులకు ఈ లింక్ ను షేర్ చేయగలరు అని మనవి.. Google Form: https://docs.google.com/forms/d/1rKNFK5BmtqHnrKZVGfUI7rjB0Ij873V_OgA6zlxDu6I/

హైదరాబాద్

భాగ్యనగర గణేష్ నిమజ్జనం కార్యక్రమం కి అమిత్ షా రాక

పున్నమి ప్రతినిధి హైదరాబాద్ లో జరిగే వినాయక నిమజ్జన కార్యక్రమం కి కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా రానున్నారు. ఈ మేరకు భాగ్య నగర గణేష్ ఉత్సవ సమితి అయన కి ఆహ్వానం పంపినది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.