Saturday, 12 July 2025

*మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి రాజ్యసభ పదవి ఇవ్వాలని నియోజకవర్గం ప్రజల విజ్ఞప్తి మర్రిపాడు :పీబ్రవరి 17(పున్నమి విలేకరి ) వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైసీపీని స్థాపించినప్పుడు ఆయన వెంట నడిచిన ఏకైక రాజకీయ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి . ఆయన అప్పటికే కాంగ్రెస్ ఎంపీగా గెలిచి ఉన్నారు. జగన్ పార్టీ పెట్టిన సందర్భంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ తో ఎవరు వెళ్లకుండా కట్టడిచేసేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. అయితే రాజమోహన్ రెడ్డి ధైర్యంగా అటు ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానాన్ని ఇటు రాష్ట్రంలోని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని దిక్కరించి జగన్ మోహన్ రెడ్డి తో నేను సైతం అని ముందడుగు వేశారు. తాను కోట్లాది రూపాయలు పెట్టి చేసిన కాంట్రాక్ట్ బిల్లులు వస్తాయా రావా అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి జగన్ వెంట నడిచారు. జగన్మోహన్ రెడ్డి కోరిందే తడవుగా ఎంపీ పదవికి రాజీనామా చేసి నెల్లూరు ఎంపీగా వైసిపిఅభ్యర్థిగా బరిలో నిలిచి మరోసారి నెల్లూరు ఎంపీగాగెలిచారు .రాజమోహన్ రెడ్డిని ఆ ఉప ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అత్యంత సంపన్నుడైన మాజీ కేంద్రమంత్రి టి.సుబ్బిరామి రెడ్డిని మేకపాటి పై పోటీకి దించింది. తెలుగుదేశం పార్టీ మరో ప్రముఖ వ్యాపారవేత్త ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి ని పోటీ చేయించింది. కాంగ్రెస్, టిడిపి అభ్యర్థుల జన ప్రవాహాన్ని తట్టుకొని మేకపాటి ఎంపీ గా నెల్లూరు నుండి ఘన విజయం సాధించారు. అనంతరం 2014లో మరోసారి నెల్లూరు ఎంపీ అప్పటి టిడిపి అభ్యర్థి ఆదాల పై పోటీ చేసి మేకపాటి నెల్లూరు నుండి వరుసగా మూడు సార్లు ఎంపీగా గెలిచి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు . జగన్మోహన్ రెడ్డికి ఎవరు లేనిసమయాలలో పార్టీకి పెద్దదిక్కుగా రాష్ట్రంలో పార్టీ ప్రతిష్టకు ఎంతో కృషి చేశారు.మేకపాటి వర్గం జగన్మోహన్ రెడ్డి ని నమ్ముకుని ఆయన వెంటనడిచిన సీనియర్ రాజకీయ నేతకు 2019 లో జగన్ మోహన్ రెడ్డి ఎంపీ టికెట్ ఇవ్వలేదు ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత టీడీపీ నుంచి వైసీపీ లోకి వచ్చిన ఆదాలకు ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు ఎంపీ టికెట్ ఇచ్చినారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోయినా మేకపాటి ఈరోజు కూడా ఎక్కడా తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయలేదు వైఎస్ఆర్ కుటుంబానికి వైసీపీకి విధేయుడు అని ప్రకటించారు.రాజమోహన్ రెడ్డి తమ్ముడు చంద్ర శేఖర్రెడ్డికి ఉదయగిరి ఎమ్మెల్యే టికెట్ తనయుడు అప్పటి ఆత్మకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే గౌతమ్ రెడ్డి కి టికెట్ ఇచ్చిన వైసిపి ఒకే ఇంట్లో మూడు టికెట్లు అని అందుకే మేకపాటి ని పక్కన పెట్టారని ప్రచారం జరిగింది. ఎన్నికల అనంతరం మేకపాటికి రాజ్యసభ సీటు ఇస్తారని రాజకీయ వర్గాలు భావించాయి వచ్చే జూన్ లో నాలుగు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి నాలుగు సీ ట్లలో వైసిపి ఏ విజయం సాధిస్తుందో,అయితే సీనియర్ రాజకీయవేత్తగా ఆయన మేకపాటి రాజ్యసభకు తీసుకువస్తే తన ప్రాధాన్యత తగ్గుతుందని ప్రస్తుత రాజ్యసభ విజయసాయిరెడ్డి మేకపాటికి సీటు రాకుండా చేసేందుకు బీదా మస్తాన్ రావు అనే టిడిపి నాయకుడిని వైసీపీలో చేర్పించారు.వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు ఆయన వెంట నడిచిన ఏకైక రాజకీయ నాయకుడు మేకపాటి రజమోహన్ రెడ్డి కుటుంబం ఆప్పటికే కాంగ్రెస్ ఎంపీగా గెలిచి ఉన్నారు. జగన్ పార్టీ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం జగన్తో ఎవరిని వెళ్లకుండా కట్టడిచేసింది. అయితే రాజమోహన్ రెడ్డి ధైర్యంగా అటు ఢిల్లీలోని కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ధిక్కరించి జగన్ మోహన్ రెడ్డి తోచేరారు. తాను కోట్లాది రూపాయలు పెట్టి చేసిన కాంట్రాస్ట్ బిల్లులు కూడా పక్కన పెట్టి జగన్ వెంట నడిచారు. జగన్మోహన్ రెడ్డి కోరిందే బీద కు రాజ్యసభ సీటు హామీ ఇచ్చి పార్టీ మార్చినట్లు ఒప్పందం కుదిరిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరుజిల్లా నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. రాజమోహన్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తే రెండు సీట్లు రెడ్డిసామాజిక వర్గానికి ఇచ్చారని నానుడి ఉంటుందని అందువల్ల బీసీలు అయిన భీదకు అవకాశం ఇవ్వాలని విజయసాయిరెడ్డి జగన్మోహనెడ్డిని ఒప్పించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నంత మాత్రానరాజమోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదని ఎక్కడైనా ఉన్నదా అనే నిన్న మొన్న పార్టీలో చేరిన టిడిపి నాయకుడికి రాజమోహన్ రెడ్డికి అంటి పెట్టడం ఏమిటని జిల్లాలో వైసీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మేకపాటి తనయుడికి మంత్రి పదవి ఇచ్చి ఉన్నదని వారి తమ్ముడు ఉదయగిరి ఎమ్మెల్యే గా ఉన్నారని రాజమోహన్ రెడ్డికి పదవి ఎందుకని కొందరు చేస్తున్న వాదానిలోఎంత మాత్రం సమంజసం అని పార్టీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.రాజమోహన్ రెడ్డి 1985లో ని ఉదయగిరి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో ఒంగోలు ఎంపీ గాగెలిచారు 2004లోనరసరావుపేట ఎంపీ గా గెలిచారు. ఇంతటి సుదీర్ఘ రాజకీయ నేపధ్యం పాలన అనుభవం కలిగిన రాజమోహన్ రెడ్డి మర్రిపాడుమండలం ఆయన స్వగ్రామం మండలంలోని బ్రాహ్మణపల్లి మేకపాటి వెంకీ రెడ్డి ప్రధమ సంతానమైన రాజమోహరెడ్డి దేశంలోనే ప్రతిష్టాత్మకమైన వరంగల్ ఆర్ ఈ సి లో ఎంటెక్ చేశారు. కాంట్రాక్టు రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ పిలుపుమేరకురాజకీయాలలోప్రవేశించి 1985లో ఉదయగిరి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. సౌమ్యుడు వివాద రహితుడు. తానుఅభిమానించే వారి పట్లవిధేయత చూపే మంచి లక్షణాలు కలిగి ఉన్న మేకపాటికి రాజ్యసభ సీటు ఇచ్చి ఆయన సేవలను వైసీపీ వినియోగించుకోవాలని జిల్లాలోని ఆ పార్టీ కార్యకర్తలు,ఆత్మకూరు నియోజక వర్గ ప్రజలు సొంతమండల మర్రిపాడు ప్రజలు జగన్మోహన్ రెడ్డిఅభిమానులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు.

*మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి రాజ్యసభ పదవి ఇవ్వాలని నియోజకవర్గం ప్రజల విజ్ఞప్తి

మర్రిపాడు :పీబ్రవరి 17(పున్నమి విలేకరి )

వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైసీపీని స్థాపించినప్పుడు ఆయన వెంట నడిచిన ఏకైక రాజకీయ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి . ఆయన అప్పటికే కాంగ్రెస్ ఎంపీగా గెలిచి ఉన్నారు. జగన్ పార్టీ పెట్టిన సందర్భంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ తో ఎవరు వెళ్లకుండా కట్టడిచేసేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. అయితే రాజమోహన్ రెడ్డి ధైర్యంగా అటు ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానాన్ని ఇటు రాష్ట్రంలోని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని దిక్కరించి జగన్ మోహన్ రెడ్డి తో నేను సైతం అని ముందడుగు వేశారు. తాను కోట్లాది రూపాయలు పెట్టి చేసిన కాంట్రాక్ట్ బిల్లులు వస్తాయా రావా అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి జగన్ వెంట నడిచారు.
జగన్మోహన్ రెడ్డి కోరిందే తడవుగా ఎంపీ పదవికి రాజీనామా చేసి నెల్లూరు ఎంపీగా వైసిపిఅభ్యర్థిగా బరిలో నిలిచి మరోసారి నెల్లూరు ఎంపీగాగెలిచారు .రాజమోహన్ రెడ్డిని ఆ ఉప ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అత్యంత సంపన్నుడైన మాజీ కేంద్రమంత్రి టి.సుబ్బిరామి రెడ్డిని మేకపాటి పై పోటీకి దించింది.
తెలుగుదేశం పార్టీ మరో ప్రముఖ వ్యాపారవేత్త ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి ని పోటీ చేయించింది. కాంగ్రెస్, టిడిపి అభ్యర్థుల జన ప్రవాహాన్ని తట్టుకొని మేకపాటి ఎంపీ గా నెల్లూరు నుండి ఘన విజయం సాధించారు. అనంతరం 2014లో మరోసారి నెల్లూరు ఎంపీ అప్పటి టిడిపి అభ్యర్థి ఆదాల పై పోటీ చేసి మేకపాటి నెల్లూరు
నుండి వరుసగా మూడు సార్లు ఎంపీగా గెలిచి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు . జగన్మోహన్ రెడ్డికి ఎవరు లేనిసమయాలలో
పార్టీకి పెద్దదిక్కుగా రాష్ట్రంలో పార్టీ ప్రతిష్టకు ఎంతో కృషి చేశారు.మేకపాటి వర్గం జగన్మోహన్ రెడ్డి ని నమ్ముకుని ఆయన వెంటనడిచిన సీనియర్ రాజకీయ నేతకు 2019 లో జగన్ మోహన్ రెడ్డి ఎంపీ టికెట్ ఇవ్వలేదు ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత టీడీపీ నుంచి వైసీపీ లోకి వచ్చిన ఆదాలకు ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు ఎంపీ టికెట్ ఇచ్చినారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోయినా మేకపాటి ఈరోజు కూడా ఎక్కడా తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయలేదు
వైఎస్ఆర్ కుటుంబానికి వైసీపీకి విధేయుడు అని ప్రకటించారు.రాజమోహన్ రెడ్డి తమ్ముడు చంద్ర
శేఖర్రెడ్డికి ఉదయగిరి ఎమ్మెల్యే
టికెట్ తనయుడు అప్పటి ఆత్మకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే గౌతమ్ రెడ్డి కి టికెట్ ఇచ్చిన వైసిపి ఒకే ఇంట్లో మూడు టికెట్లు అని అందుకే మేకపాటి ని పక్కన పెట్టారని ప్రచారం జరిగింది. ఎన్నికల
అనంతరం మేకపాటికి రాజ్యసభ సీటు ఇస్తారని రాజకీయ వర్గాలు భావించాయి వచ్చే జూన్ లో నాలుగు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు
జరగనున్నాయి నాలుగు సీ ట్లలో వైసిపి ఏ విజయం సాధిస్తుందో,అయితే సీనియర్ రాజకీయవేత్తగా ఆయన మేకపాటి రాజ్యసభకు
తీసుకువస్తే తన ప్రాధాన్యత తగ్గుతుందని ప్రస్తుత రాజ్యసభ విజయసాయిరెడ్డి మేకపాటికి సీటు రాకుండా చేసేందుకు బీదా మస్తాన్ రావు అనే టిడిపి నాయకుడిని వైసీపీలో చేర్పించారు.వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు ఆయన వెంట నడిచిన ఏకైక రాజకీయ నాయకుడు మేకపాటి రజమోహన్ రెడ్డి కుటుంబం ఆప్పటికే కాంగ్రెస్ ఎంపీగా గెలిచి ఉన్నారు. జగన్ పార్టీ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం జగన్తో ఎవరిని వెళ్లకుండా కట్టడిచేసింది. అయితే రాజమోహన్ రెడ్డి ధైర్యంగా అటు ఢిల్లీలోని కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ధిక్కరించి జగన్ మోహన్ రెడ్డి తోచేరారు. తాను కోట్లాది రూపాయలు పెట్టి చేసిన కాంట్రాస్ట్ బిల్లులు కూడా పక్కన పెట్టి జగన్ వెంట నడిచారు. జగన్మోహన్ రెడ్డి కోరిందే బీద కు రాజ్యసభ సీటు హామీ ఇచ్చి పార్టీ మార్చినట్లు ఒప్పందం కుదిరిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరుజిల్లా నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. రాజమోహన్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తే రెండు సీట్లు రెడ్డిసామాజిక వర్గానికి ఇచ్చారని నానుడి ఉంటుందని అందువల్ల బీసీలు అయిన భీదకు అవకాశం ఇవ్వాలని విజయసాయిరెడ్డి
జగన్మోహనెడ్డిని ఒప్పించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నంత మాత్రానరాజమోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదని ఎక్కడైనా ఉన్నదా అనే నిన్న మొన్న పార్టీలో చేరిన టిడిపి నాయకుడికి రాజమోహన్
రెడ్డికి అంటి పెట్టడం ఏమిటని జిల్లాలో వైసీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మేకపాటి తనయుడికి మంత్రి పదవి ఇచ్చి ఉన్నదని వారి తమ్ముడు ఉదయగిరి ఎమ్మెల్యే గా ఉన్నారని రాజమోహన్ రెడ్డికి పదవి ఎందుకని కొందరు చేస్తున్న వాదానిలోఎంత మాత్రం సమంజసం అని పార్టీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.రాజమోహన్ రెడ్డి 1985లో ని ఉదయగిరి నుండి ఎమ్మెల్యేగా
గెలిచారు. 1989లో ఒంగోలు ఎంపీ గాగెలిచారు 2004లోనరసరావుపేట ఎంపీ గా గెలిచారు. ఇంతటి సుదీర్ఘ రాజకీయ నేపధ్యం పాలన అనుభవం కలిగిన రాజమోహన్ రెడ్డి మర్రిపాడుమండలం ఆయన స్వగ్రామం మండలంలోని బ్రాహ్మణపల్లి మేకపాటి వెంకీ రెడ్డి ప్రధమ సంతానమైన రాజమోహరెడ్డి దేశంలోనే ప్రతిష్టాత్మకమైన వరంగల్ ఆర్ ఈ సి లో ఎంటెక్ చేశారు. కాంట్రాక్టు రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ పిలుపుమేరకురాజకీయాలలోప్రవేశించి 1985లో ఉదయగిరి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.
సౌమ్యుడు వివాద రహితుడు. తానుఅభిమానించే వారి పట్లవిధేయత చూపే మంచి లక్షణాలు కలిగి ఉన్న మేకపాటికి రాజ్యసభ సీటు ఇచ్చి ఆయన సేవలను వైసీపీ వినియోగించుకోవాలని జిల్లాలోని ఆ పార్టీ కార్యకర్తలు,ఆత్మకూరు నియోజక వర్గ ప్రజలు సొంతమండల మర్రిపాడు ప్రజలు జగన్మోహన్ రెడ్డిఅభిమానులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.