Tuesday, 12 May 2026
  • Home  
  • మహానాడుకు మొట్టమొదటిగా నెల్లూరు ఆతిథ్యం బీదా రవిచంద్ర
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మహానాడుకు మొట్టమొదటిగా నెల్లూరు ఆతిథ్యం బీదా రవిచంద్ర

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మహానాడు నిర్వహించే అవకాశం నెల్లూరుకు దక్కడం ఇదే ప్రథమం అని మహానాడు ను విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నాం,మహానాడు ఏర్పాట్లను ప్రతీరోజు పర్యవేక్షిస్తున్నాం అని జిల్లా అధ్యక్షుడు యమ్ యల్ సి బీదా రవిచంద్ర తెలిపారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా మహానాడులో భాగస్వాములు అయ్యి, మహానాడును విజయవంతం చెయ్యాలని కోరారు. ఈ సందర్భం గా బీద మాట్లాడుతూ. మహానాడు విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై మంత్రి నారాయణ, సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, టీడీపీ నేతలతో సమీక్షించడం జరిగిందని తెలిపారు. మే 27,28 తేదీలలో జరగనున్న ప్రతినిధుల సభ, 29 న బహిరంగ సభకు అవసరమైన వసతులు, భోజనాలు, పార్కింగ్, రవాణా ఏర్పాట్లపై చర్చించామని మహానాడుకు వేలాదిగా తరలిరానున్న బస్సులను ఎలాంటి అసౌకర్యం లేకుండా సభాప్రాంగణంలోకి తేవడంపై పోలీసు శాఖతో చర్చించామని తెలిపారు. ఈ నెల 13 న మహానాడు నిర్వహణ కమిటీలతో చర్చించి, రాష్ట్ర, జిల్లా టీడీపీ నాయకత్వాల సూచనలతో సంబంధిత బాధ్యతలను వారికి అప్పగిస్తామని ప్రతినిధుల నమోదు, సభా ప్రాంగణం, వాలంటీర్స్, భోజనం, వసతి, సాంస్కృతిక విభాగం, ఫోటో ఎగ్జిబిషన్ తదితర కమిటీలకు తెలుగుదేశం పార్టీ నేతలు తగు సూచనలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారం , సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు పర్యవేక్షణ, జిల్లా శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నేతల తోడ్పాటుతో మహానాడు ప్రాంగణం వేగంగా రూపు దిద్దుకుంటోందని రవిచంద్ర పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మహానాడు నిర్వహించే అవకాశం నెల్లూరుకు దక్కడం ఇదే ప్రథమం అని మహానాడు ను విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నాం,మహానాడు ఏర్పాట్లను ప్రతీరోజు పర్యవేక్షిస్తున్నాం అని జిల్లా అధ్యక్షుడు యమ్ యల్ సి బీదా రవిచంద్ర తెలిపారు.
తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా మహానాడులో భాగస్వాములు అయ్యి, మహానాడును విజయవంతం చెయ్యాలని కోరారు.
ఈ సందర్భం గా బీద మాట్లాడుతూ.
మహానాడు విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై మంత్రి నారాయణ, సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, టీడీపీ నేతలతో సమీక్షించడం జరిగిందని తెలిపారు.
మే 27,28 తేదీలలో జరగనున్న ప్రతినిధుల సభ, 29 న బహిరంగ సభకు అవసరమైన వసతులు, భోజనాలు, పార్కింగ్, రవాణా ఏర్పాట్లపై చర్చించామని
మహానాడుకు వేలాదిగా తరలిరానున్న బస్సులను ఎలాంటి అసౌకర్యం లేకుండా సభాప్రాంగణంలోకి తేవడంపై పోలీసు శాఖతో చర్చించామని తెలిపారు.
ఈ నెల 13 న మహానాడు నిర్వహణ కమిటీలతో చర్చించి, రాష్ట్ర, జిల్లా టీడీపీ నాయకత్వాల సూచనలతో సంబంధిత బాధ్యతలను వారికి అప్పగిస్తామని
ప్రతినిధుల నమోదు, సభా ప్రాంగణం, వాలంటీర్స్, భోజనం, వసతి, సాంస్కృతిక విభాగం, ఫోటో ఎగ్జిబిషన్ తదితర కమిటీలకు తెలుగుదేశం పార్టీ నేతలు తగు సూచనలు చేయనున్నట్లు తెలిపారు.
జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారం , సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు పర్యవేక్షణ, జిల్లా శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నేతల తోడ్పాటుతో మహానాడు ప్రాంగణం వేగంగా రూపు దిద్దుకుంటోందని రవిచంద్ర పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.