అనకాపల్లి జిల్లా మే 9 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్):
ఎలమంచిలి మండలంలోని మేజర్ పంచాయతీ ఏటికొప్పాకలో తాగునీటి సమస్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. గ్రామంలోని మంచినీటి పైపులు, కుళాయిలు పాడై రోజూ వేల లీటర్ల నీరు కాలువల్లోకి వృథాగా పారిపోతున్నా అధికారులు, పంచాయతీ సిబ్బంది మాత్రం స్పందించడం లేదని గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. వేసవి వేళ తాగునీటి కోసం మహిళలు, వృద్ధులు అవస్థలు పడుతుండగా, బాధ్యత ఉన్న అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వెంటనే దెబ్బతిన్న పైపులు మరమ్మతు చేసి ప్రతి ఇంటికి సక్రమంగా తాగునీరు అందించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రజల దాహం… అధికారుల నిర్లక్ష్యం! ఏటికొప్పాకలో కాలువల్లోకి పారుతున్న తాగునీరు – నిద్రలోనే పంచాయతీ యంత్రాంగం
అనకాపల్లి జిల్లా మే 9 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్): ఎలమంచిలి మండలంలోని మేజర్ పంచాయతీ ఏటికొప్పాకలో తాగునీటి సమస్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. గ్రామంలోని మంచినీటి పైపులు, కుళాయిలు పాడై రోజూ వేల లీటర్ల నీరు కాలువల్లోకి వృథాగా పారిపోతున్నా అధికారులు, పంచాయతీ సిబ్బంది మాత్రం స్పందించడం లేదని గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. వేసవి వేళ తాగునీటి కోసం మహిళలు, వృద్ధులు అవస్థలు పడుతుండగా, బాధ్యత ఉన్న అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వెంటనే దెబ్బతిన్న పైపులు మరమ్మతు చేసి ప్రతి ఇంటికి సక్రమంగా తాగునీరు అందించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

