కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ 2025 నియామకాల్లో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నాయని, దీనిపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని శ్రీకాళహస్తి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలకు నిరసనగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు శ్రీకాళహస్తి పార్టీ కార్యాలయం వద్ద చేపట్టిన ‘ఏపీ Gen-Z War’ రిలే నిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరాయి. ఈ దీక్షలకు ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి కోగిలి మునిచందు, విద్యార్థి సంఘ నాయకులు హాజరై పూర్తి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా పేరిట అర్హత లేని టీడీపీ కార్యకర్తలకు, నకిలీ సర్టిఫికేట్లు ఉన్నవారికి డీఎస్సీ ఉద్యోగాలను అంగట్లో సరుకుల్లా పంచిపెట్టిందని మండిపడ్డారు. అర్హులైన మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, వారికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. దీంతో పాటు 20 లక్షల మంది నిరుద్యోగులకు ఇవ్వాల్సిన రూ.2000 కోట్ల బకాయిల నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలని, గత ప్రభుత్వం అందించిన విధంగానే నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన నిధులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకంగా జరిగాయని, కానీ ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థులను, నిరుద్యోగులను నట్టేట ముంచుతోందని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, నియోజకవర్గ పరిశీలకులు ఓడూరు గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి-మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ 2025 నియామకాల్లో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నాయని, దీనిపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని శ్రీకాళహస్తి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలకు నిరసనగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు శ్రీకాళహస్తి పార్టీ కార్యాలయం వద్ద చేపట్టిన ‘ఏపీ Gen-Z War’ రిలే నిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరాయి. ఈ దీక్షలకు ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి కోగిలి మునిచందు, విద్యార్థి సంఘ నాయకులు హాజరై పూర్తి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా పేరిట అర్హత లేని టీడీపీ కార్యకర్తలకు, నకిలీ సర్టిఫికేట్లు ఉన్నవారికి డీఎస్సీ ఉద్యోగాలను అంగట్లో సరుకుల్లా పంచిపెట్టిందని మండిపడ్డారు. అర్హులైన మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, వారికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. దీంతో పాటు 20 లక్షల మంది నిరుద్యోగులకు ఇవ్వాల్సిన రూ.2000 కోట్ల బకాయిల నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలని, గత ప్రభుత్వం అందించిన విధంగానే నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన నిధులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకంగా జరిగాయని, కానీ ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థులను, నిరుద్యోగులను నట్టేట ముంచుతోందని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, నియోజకవర్గ పరిశీలకులు ఓడూరు గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

