ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 7 (మల్లికార్జునరావ్ పున్నమి ప్రతినిధి)
ఎన్రోల్మెంట్ డ్రైవ్‌లో భాగంగా మనుబోలు మండలం మనుబోలు, మడమనూరు గ్రామాల్లో ఎంఈఓ నరేష్ కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులను తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు కార్పొరేట్ స్థాయి ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, విద్యాసామగ్రిని ప్రభుత్వం అందిస్తోందన్నారు. మానసిక ఒత్తిడి లేని విద్యాభ్యాసం ప్రభుత్వ పాఠశాలల్లో లభిస్తుందని వివరించారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి – ఎంఈఓ నరేష్ కుమార్ ఇంటింటి ప్రచారం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 7 (మల్లికార్జునరావ్ పున్నమి ప్రతినిధి) ఎన్రోల్మెంట్ డ్రైవ్‌లో భాగంగా మనుబోలు మండలం మనుబోలు, మడమనూరు గ్రామాల్లో ఎంఈఓ నరేష్ కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులను తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు కార్పొరేట్ స్థాయి ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, విద్యాసామగ్రిని ప్రభుత్వం అందిస్తోందన్నారు. మానసిక ఒత్తిడి లేని విద్యాభ్యాసం ప్రభుత్వ పాఠశాలల్లో లభిస్తుందని వివరించారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

