Thursday, 7 May 2026
  • Home  
  • నందిపాడులో టిడిపి గ్రామ కమిటీ సమావేశం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందిపాడులో టిడిపి గ్రామ కమిటీ సమావేశం

దుత్తలూరు నందిపాడు (ఉస్మాన్ ప్రతినిధి ) Date:07-5-2026 నందిపాడు గ్రామ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడు గ్రామంలో టిడిపి గ్రామ కమిటీ సమావేశం నిర్వహించారు. ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు, దుత్తలూరు మండల కన్వీనర్ ఉండేల గురవారెడ్డి మార్గదర్శకత్వంలో ఈ సమావేశం జరిగింది. గ్రామ కమిటీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, కమిటీ సభ్యులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా రైతులకు సరైన విద్యుత్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వ్యవసాయానికి అవసరమైన సమయంలో కరెంట్ అందక పంటలు నష్టపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, కలుషిత నీటి కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నందిపాడులో ఆర్‌ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నాయకులు కోరారు. గ్రామంలోని సీసీ రోడ్ల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధిపై కూడా సమావేశంలో చర్చించారు. గ్రామ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని నాయకులు తెలిపారు.

దుత్తలూరు
నందిపాడు (ఉస్మాన్ ప్రతినిధి )
Date:07-5-2026
నందిపాడు గ్రామ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడు గ్రామంలో టిడిపి గ్రామ కమిటీ సమావేశం నిర్వహించారు. ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు, దుత్తలూరు మండల కన్వీనర్ ఉండేల గురవారెడ్డి మార్గదర్శకత్వంలో ఈ సమావేశం జరిగింది. గ్రామ కమిటీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, కమిటీ సభ్యులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా రైతులకు సరైన విద్యుత్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వ్యవసాయానికి అవసరమైన సమయంలో కరెంట్ అందక పంటలు నష్టపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, కలుషిత నీటి కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నందిపాడులో ఆర్‌ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నాయకులు కోరారు.
గ్రామంలోని సీసీ రోడ్ల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధిపై కూడా సమావేశంలో చర్చించారు. గ్రామ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని నాయకులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.