జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో,జూలై (పున్నమి ప్రతినిధి)
శాక్రమెంటో లో స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో భారతీయులను చైతన్య పరచడంలో అగ్రభాగాన ఉన్నట్లు నిడిగంటి గోవర్ధన్ రావు తెలిపారు.
శాక్రమెంటో లో హిందూ స్వయం సేవక్ సంఘ్ శాఖలుప్రతి నగరంలోనూ ఉండగా వాటిలో శ్రీరామ్ శాఖ ప్రముఖంగా చెప్పుకో తగినదిగా ఆయన తెలిపారు .గత 99 సంవత్సరాలుగా హిందూ సమాజాన్ని జాగృతం చేస్తూ , దేశ భక్తిని రగిలించి , హిందూ సంఘటనే ధ్యేయంగా , త్యాగము , సమర్పణ భావంతో , మన భారతావనిని తిరిగి జగద్గురువుగా నిలిపేందుకు సంఘము అకుంఠిత దీక్షతో ప్రజలను చైతన్య పరుస్తున్న వైనాన్ని ఆయన తెలిపారు . ఇక్కడి భారతీయులు ముఖ్యమైన చరిత్ర పుటల్ని నెమరు వేసుకోవడానికి ప్రతి ఆదివారం సమావేశం కావడం సంప్రదాయంగా వస్తున్నదని, సంఘ జండావందనం చేయడంతో పాటు సంఘ సభ్యులు మంత్రము పఠిస్తూ సూర్యనమస్కారములు ప్రతి రోజూ చేపడుతారని, .సంఘ కార్యకలాపాలను సంఘ చరిత్రను బాలలకు ,ఆహ్వానీతులకు వివరించే కార్యక్రమంను భౌతిక్ నిర్వహిస్తారని తెలిపారు..హిందూ సంఘటన దివస్ ఉత్సవ్ వంటి ప్రత్యేక కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తారని,.ప్రతి నెలా జ్యేష్ఠ శాఖను వయసుపైబడిన వారికోసం నిర్వహిస్తూ ఆరోగ్యకరమైన ఆటలు ఆడించి జ్యేష్ఠులకు శారీరక మానసోల్లాసం,.విద్యార్థులకు ఉపయుక్తమైన ధర్మ ఇంటర్న్ షిప్ వంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారని తెలిపారు. భారత దేశానికి భౌతికంగా దూరంగా వున్నా ప్రతి ఒక్కరు భారదేశం ఉన్నతిని గొప్పగా శ్లాఘించడం ఈ కార్యక్రమంలో ఇక్కడి భారతీయుల ప్రత్యేకత అని గోవర్ధన్ రావు తెలిపారు.



