శ్రీకాళహస్తి, మే 07 (పున్నమి న్యూస్): ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్, ఎంజీఎం హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నేడు శ్రీకాళహస్తిలో భారీ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ శిబిరంలో ప్రముఖ స్పెషలిస్ట్ వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించనున్నారు. నియోజకవర్గంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు చేరవేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. సాధారణ వైద్య సేవలతో పాటు పలు ఆరోగ్య సమస్యలపై నిపుణుల సూచనలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెద్ద ఎత్తున పాల్గొని వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలని ప్రెస్ క్లబ్ ప్రతినిధులు కోరారు.

ఆరోగ్యమే మహాభాగ్యం- నేడు శ్రీకాళహస్తిలో మెగా హెల్త్ క్యాంప్