Saturday, 9 May 2026

Blog

సినిమా

బాలయ్య ‘అఖండ-2’ సినిమాకి భారీ ధర…

ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @ సినిమా : బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబోలో రూపొందుతోన్న ‘అఖండ-2’ సినిమా డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు సినీ వర్గాలు తెలిపాయి. జియో హాస్టార్ సంస్థ రూ.85 కోట్లకు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నాయి. బాలకృష్ణ సినిమాల్లో ఇదే రికార్డు ధర అని చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజయ్యే అవకాశం ఉంది.

జాతీయ అంతర్జాతీయ

భారత్ దెబ్బ అట్లుంటది మరి.. అమెరికా కంపెనీలు విలవిల.. మ్యాటర్ ఏమంటే.

ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @ భారత్ దెబ్బ: రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అదనపు సుంకాలను విధించినప్పటి నుంచి రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతోంది. ట్రంప్ నిర్ణయానికి నిరసనగా దేశంలో అమెరికా వ్యతిరేక సెంటిమెంట్ పెరిగింది. పెప్సి, కోకా-కోలా, మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ వంటి అమెరికా కంపెనీల ఉత్పత్తులను బహిష్కరించాలన్న పిలుపు బలం పుంజుకుంటోంది. ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ భారతీయులందరినీ అమెరికన్ ఉత్పత్తులను బహిష్కరించాలని సూచించారు. పెప్సి, కోకా కోలా, సబ్వే, కేఎఫ్‌సీ లేదా మెక్‌డొనాల్డ్స్ కౌంటర్ల వద్ద ఒక్క భారతీయుడు కూడా కనిపించకూడదు అని ఆయన అన్నారు. ఇది జరిగితే అమెరికాలో గందరగోళం ఏర్పడుతుందని చెప్పారు. ‘‘అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ట్రంప్ స్వయంగా ఈ సుంకాలను ఉపసంహరించుకోవాల్సి రావచ్చు. ట్రంప్ భారత్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుని పెద్ద తప్పు చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారు. ఇప్పుడు ఆర్థిక స్వేచ్ఛ కోసం పోరాటం చేయాలి. అగ్రరాజ్యం అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి’’ అని రామ్‌దేవ్ అన్నారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులను స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని కోరారు. ‘‘మనవాళ్లు చెమటతో తయారు చేసిన వస్తువులను మనం కొనుగోలు చేయాలి’’ అని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ స్థానికులకు స్వరం అనే సూత్రాన్ని పాటించాలన్నారు. ఇది దేశ ఆర్థిక ప్రయోజనాలను కాపాడటంలో సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. US కంపెనీలపై ప్రభావం దేశంలో 1.5 బిలియన్ల జనాభా అమెరికన్ కంపెనీలను బహిష్కరిస్తే, అది వారికి భారీ నష్టాలు, సవాళ్లకు దారితీస్తుంది. ఉదాహరణకు.. పెప్సికో ఇండియా 2024 ఆర్థిక సంవత్సరానికి రూ. 8,200 కోట్ల ఆదాయాన్ని నివేదించింది. భారత్ పెప్సికోకు ప్రపంచంలోనే టాప్ 15 మార్కెట్లలో ఒకటి. అదేవిధంగా మెక్‌డొనాల్డ్స్‌ను నిర్వహించే వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్ లిమిటెడ్ కూడా రూ. 2,390 కోట్ల ఆదాయాన్ని నివేదించింది. ఈ బహిష్కరణలు ఈ కంపెనీల ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆప్ ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్ కూడా ట్రంప్‌కు బహిరంగ లేఖ రాశారు. ‘‘146 కోట్ల మంది భారతీయులు అమెరికా ఉత్పత్తులను కొనుగోలు చేయడం ఆపేస్తే, దాని ప్రభావం యునైటెడ్ స్టేట్స్‌పై చాలా తీవ్రంగా ఉంటుంది’’ అని లేఖలో పేర్కొన్నారు. ఈ నిరసనలు భారత్-అమెరికా సంబంధాలలో ఒక కీలక మలుపును సూచిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సుంకాల పెంపు – భారత్ రియాక్షన్ ఆగస్టు 6న ట్రంప్ భారత్‌పై 25 శాతం సుంకాలకు అదనంగా మరో 25 శాతం జరిమానాను విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి, దానిని బహిరంగ మార్కెట్‌లో లాభాలకు అమ్ముతుందంటూ ఈ టారీఫ్ విధించారు. ట్రంప్ నిర్ణయం అన్యాయం, అసమంజసం అని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్రం ప్రకటించింది. ఈ పెరిగిన జరిమానా ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చింది

ఆంధ్రప్రదేశ్

ఏపీకి వస్తున్నాం.. IBM సంస్థ ప్రకటన

ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి@ IBM సంస్థ ప్రకటన: ఏపీలోని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్పార్క్ క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ పెడుతున్నట్లు దిగ్గజ ఐటీ సంస్థ IBM ప్రకటించింది. 2026 మార్చి నాటికి దీనిని ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధి క్రౌడర్ ప్రకటించారు. క్వాంటమ్ కంప్యూటింగ్లో భారత్ బలమైన శక్తిగా ఎదుగుతుందని, భవిష్యత్తులో ఈ రంగంపై ఎక్కువ పరిశోధనలు చేయాలని ఆయన అన్నారు. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్, కెనడా, ద.కొరియాలో IBM క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్లు ఉన్నాయి

E-పేపర్

పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం సర్పంచ్

నందలూరు వినాయక చవితి వేడుకల్లో భాగంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీలోని నారాయణ రాజుపేట గ్రామంలో నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని సర్పంచ్ జంబు సూర్యనారాయణ తన మిత్రులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శివ నరసింహ తిరుపాల్ వెంకటసుబ్బయ్యల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం శాలువాల తో ఘనంగా సత్కరించారు. దానాల్లో కల్లా అన్నదానం ఎంతో గొప్పదని ఈ సందర్భంగా సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు నాగేంద్ర మాజీ సభ్యులు తిరుపాల్ ధనంజయ నాయుడు కానాకుర్తి వెంకటయ్య జయరాం రెడ్డి బలరాం. మట్టిబాబు.హనుమంతు పవనకుమార్ మెహర్ తుమ్మాది శివకుమార్ అక్కివెంకటరమణ శివనరసింహులు. రాఘవులు వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శర్వాణి విద్యార్థినులకు సత్కారాలు

నరసన్నపేట స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో ఆగస్టు 31న రచయితల వేదిక ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి గారి చేతుల మీదుగా తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రచయితల వేదిక అధ్యక్షులు సదాశివుని కృష్ణ గారు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శర్వాణి విద్యాలయానికి చెందిన విద్యార్థినులు లక్ష్మీ, తనుశ్రీ, జాహ్నవి, సాక్షిని వ్యాసరచన పోటీలో విజేతలుగా నిలిచి, ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి గారి చేతుల మీదుగా సత్కరింపబడ్డారు. అలాగే శర్వాణి విద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, రచయితల వేదికలో సభ్యునిగా ఉన్న శ్రీ గిరీష్ గారును కూడా ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సన్మానించారు. తెలుగు భాష గౌరవాన్ని కాపాడుతూ, విద్యార్థుల్లో సాహిత్యాభిరుచిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఒక స్ఫూర్తిదాయక వేదికగా నిలిచింది.

ఆంధ్రప్రదేశ్

ప్రమాదకరంగా మారినా తోరి చెరువు

ముధోల్ మండలంలోని ఏడ్బిడ్ గ్రామంలో ఆదిక వర్షాపాతం వల్ల తోరి చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు బయబ్రాంతులకు గురి అవుతున్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయంలో మిషన్ కాకతీయలో చెరువు కట్ట మరియు పూడికలు సరిగా చేయలేక పోవటంవల్ల తోరి చెరువు ప్రమాదంగా మారిందని గ్రామస్తులు వాపోతున్నారు ఈ చెరువు క్రింద సుమారు 200 ల ఏకరాలకు సాగునీరు అందుతుందనీ , బి ఆర్ ఎస్ పాలకుల నిర్లక్ష్యం వల్ల కాంటాక్టర్ సదరు పనులను సక్రమంగా చేయక నిమిత్తమాత్రం చేసి బిల్లులు తిసుకోవడం జరిగిందని గ్రామస్తులు వాపోతున్నారు.కాంటాక్టర్ పై తగిన చర్యలు తిసుకోవాలని ఇరిగేషన్ ఎ ఇ దేవేందర్ ను కొరారు. ఇప్పుడైనా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు చోరవ తీసుకొని చెరువు మరమ్మత్తులు చేయించాలని కోరుతున్నారు.ఈ చెరువు పరిషిలించినా యo పి డి ఓ శివకుమార్ మరియు ఆర్ ఐ నారాయణ్ పటేల్ ,ముధోల్ మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు రావుల గంగారెడ్డి గారు, పై అధికారుల దృష్టికి తిసుకెల్లి చెరువు మరమ్మత్తులు చేయిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు

ఖమ్మం

రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. బీజేపీ రాష్ట్ర నాయకులు గల్లా

ఖమ్మం పున్నమి ప్రతినిధి బోనకల్ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి పై రాహుల్ గాంధీ సమక్షంలో ఇండికూటమి నేతలు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బోనకల్ మండలకేంద్రంలో BJP మండల అధ్యక్షురాలు శ్రీమతి తాళ్లూరిమౌనిక ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేసారు. ఈ కార్యక్రమం కీ ముఖ్య అతిధి గా బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్య నారాయణ హాజరై మాట్లాడుతు రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ధర్నా చేస్తున్న బీజేపీ నేతల్ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం అన్యాయం అని గల్లా సత్య నారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మధిర నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ ఏలూరు నాగేశ్వరావు మధిర నియోజకవర్గ నాయకులు పాపట్ల రమేష్ యువ మోర్చా నాయకులు స్వర్ణాకర్, తాల్లూరి సురేష్,మరియు బోనకల్ మండల నాయకులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

సుఖీభ‌వ‌, త‌ల్లికివంద‌నం లేటైనా ఇచ్చేద్దాం.. అంద‌రూ హ్యాపీ..!

ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @సుఖీభ‌వ‌, త‌ల్లికివంద‌నం: రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కీల‌క ప‌థ‌కాల‌కు సంబంధించి సీఎం చంద్ర‌బాబు తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అన్న‌దాత సుఖీభ‌వ‌, త‌ల్లికి వంద‌నం ప‌థ‌కాల‌కు సంబంధించి నిధులు ఎప్పుడో విడుద‌లైనా.. ల‌బ్ధిదారుల‌కు చేర‌డంలో కొంత జాప్యం చోటు చేసుకుంది. అదేవిధంగా మ‌రికొంద‌రు ల‌బ్ధి దారుల‌ను కూడా చేర్చుకోవాల్సి వ‌చ్చింది. నిజానికి ఈ రెండు ప‌థ‌కాల‌కు నిధులు కేటాయించ‌డం స‌ర్కా రుకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అయినా… ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేర‌కు నిధులు కేటా యించారు. ఈ రెండు ప‌థ‌కాల‌కు సంబంధించి అనుకున్న దానిక‌న్నా ఎక్కువ‌గా ల‌బ్ధిదారుల సంఖ్య పెరిగింది. ముం దుగా స‌ర్వే చేసి కొంద‌రు ల‌బ్ధి దారుల‌ను ఎంపిక చేశారు. అయితే.. ఆ త‌ర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫా రసుల‌తో జిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గాల్లో ల‌బ్ధిదారుల సంఖ్య మ‌రింత పెరిగింది. అయితే.. అప్ప‌టికే నిధులు కేటాయించిన నేప‌థ్యంలో కొత్త‌గా ల‌బ్ధిదారులుగా ఎంపికైన వారికి నిధులు స‌రిపోలేదు. దీంతో త‌ల్లికి వంద‌నం, అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కాల‌కు సంబంధించి ల‌బ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ను పెండింగులో పెట్టారు. దీనిపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న రేగింది. కార్యాల‌యాల చుట్టూ తిరుగుతున్న ల‌బ్ధిదారులు, క‌లెక్ట‌ర్ల నుంచి విన తులు, ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి కూడా విజ్ఞ‌ప్తులు పెరిగిపోయాయి. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఈ లెక్క‌లు తేల్చాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. మొత్తంగా 332 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు అద‌నంగా ఈ ల‌బ్ధిదారుల‌కు నిధులు కేటాయించాల్సి వచ్చింది. ఈ సొమ్మును కూడా ఇచ్చేయాల‌ని చంద్ర‌బాబు ఆర్థిక శాఖ‌కు విన్న‌వించ‌డంతో స‌ద‌రు నిధుల విడుద‌ల‌కు మార్గం సుగ‌మం అయింది. ఇదిలావుంటే.. త‌ల్లికి వంద‌నం ప‌థ‌కాన్ని గ‌త నెల‌లోనూ.. అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కాన్ని ఈ నెల ప్రారం భంలోనూ చంద్ర‌బాబు ప్రారంభించారు. ఈ క్ర‌మంలో ఇంత ఆల‌స్యంగా నిధులు విడుద‌ల చేయ‌డం స‌రికాద‌న్న వాద‌న కూడా వినిపించింది. దీనిపై విప‌క్షాలు ఎద్దేవా చేస్తాయ‌ని కూడా భావించారు. అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు నిధుల విడుద‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఫ‌లితంగా త‌ల్లికి వంద‌నం, అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కాల అద‌న‌పు ల‌బ్ధి దారుల‌కు నిధులు జ‌మ కానున్నాయి. పండుగ ముందు నిర్ణ‌యంతో స‌ర్కారుకు మరింత పేరు వ‌స్తుంద‌ని భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

మహిళలకు ఏపీ ప్రభుత్వ శుభవార్త.. 50వేల నుండి 2లక్షలు పొందొచ్చు!

ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి@మహిళలకు సంక్షేమం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని వర్గాల వారికి అందించే సంక్షేమం అందించటం కోసం, సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు ఏదైనా సరే నేరుగా వారి వద్దకే చేరేలా శతవిధాల కృషి చేస్తోంది. తాజాగా డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం మరోమారు శుభవార్త చెప్పింది. జీవనోపాధుల ప్రోత్సాహక విధానం ద్వారా స్వయం ఉపాధి పొందాలనుకునే డ్వాక్రా మహిళలకు రుణాలను సులభతరం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళలకు సులభంగా రుణాలు డ్వాక్రా మహిళలకు బ్యాంకు రుణాలను సులభంగా ఇచ్చేలా, వారు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన అనుమతులు కూడా సులభతరం చేసేలా నిర్ణయించింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పోర్టల్ లో ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తే పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలు సులభంగా రుణాలను పొందవచ్చు. ఇప్పటివరకు డ్వాక్రా మహిళలు రుణాలు పొందాలంటే సంబంధిత డాక్యుమెంట్లతో బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సి ఉండేది. మహిళల స్వయం ఉపాధి యూనిట్స్ కోసం కొత్త విధానం ప్రస్తుతం అటువంటి ఇబ్బంది లేకుండా మెప్మా ద్వారా ఆన్లైన్ పోర్టల్ లో వివరాలు నమోదు చేసి రుణాలను ఈజీగా పొందవచ్చు రాష్ట్రవ్యాప్తంగా 2.74 లక్షల స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉండగా వారిలో చాలామంది ఇప్పటికే అనేక స్వయం ఉపాధి యూనిట్లను నెలకొల్పి పని చేస్తున్నారు. ఇక మిగతా వారికి ఈ కొత్త విధానం ద్వారా సహాయం అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్ లైన్ పోర్టల్ లో లోన్ కోసం దరఖాస్తు డ్వాక్రా మహిళలు మెప్మా పోర్టల్ లో ఉన్న స్వయం ఉపాధి యూనిట్లను పరిశీలించి తమకు నచ్చిన యూనిట్ ను ఎంచుకోవచ్చు. మెప్మా పోర్టల్ లో ఎల్ హెచ్ పి సెల్ పైన క్లిక్ చేసి తమకు నచ్చిన, తాము పని చెయ్యాలి అనుకుంటున్న యూనిట్ కోసం బ్యాంకు రుణం కోసం ఆన్లైన్ లోనే పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి. తమ పూర్తి వివరాలను సబ్మిట్ చేయాలి. అప్పుడు రుణం కోసం ప్రాసెస్ మొదలవుతుంది. బ్యాంకుల ద్వారా 50 వేల నుండి 2 లక్షల వరకు రుణాలు మెప్మా రిసోర్స్ పర్సన్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు దరఖాస్తులను పరిశీలించి అర్హతలను చూస్తారు. యూనిట్ ఏర్పాటుకు ఎంత పెట్టుబడి అవుతుంది? ఆదాయం ఎంత వస్తుంది? వంటి వివరాలన్నింటినీ పరిశీలించి అర్హత ఉంటే బ్యాంకులకు ప్రతిపాదిస్తారు. ఆపై బ్యాంకులు 50 వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు లోన్ లను శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇలా డ్వాక్రా గ్రూప్ సభ్యులు ఏర్పాటు చేసిన యూనిట్ ను ఏడాది పాటు అధికారులు పర్యవేక్షిస్తారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.