Saturday, 9 May 2026

Blog

ఖమ్మం

రేపటి ధర్నా కార్యక్రమం ని జయప్రదం చెయ్యండి. నెల్లూరు కోటేశ్వరరావు విజ్ఞప్తి

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతి నిధి భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ తల్లి మీద కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యల కి నిరసన గా రేపు అనగా ఆదివారం నాడు స్థానిక R&B అతిది గృహం నుండి జిల్లా పరిషత్ కార్యలయం వరకు జరిగే ర్యాలీ జిల్లా పరిషత్ కార్యలయం దగ్గర జరిగే ధర్నా మరియు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దహనం కార్యక్రమం లో బీజేపీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్య లో పాల్గొనాలని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు విజ్ఞప్తి చేసారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మాజీ మంత్రి కాకాణి ని కలిసిన ముద్దు కృష్ణంరాజు

సీతారామపురం ఆగస్టు(పున్నమి ప్రతినిధి ) మాజీమంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి యూత్ వింగ్ జాయింట్ సెక్రటరీ శనివారం నెల్లూరులోని కాకాణి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం పలు రాజకీయ అంశాలపై ఇరువురు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ముద్దు కృష్ణంరాజు మాట్లాడుతూ మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై కూటమి ప్రభుత్వం పెట్టిన అన్ని అక్రమ కేసుల పై బెయిల్ రావడం సంతోషంగా ఉందని త్వరలోనే కడిగిన ముత్యంలా అన్ని కేసులు కొట్టివేయబడతాయని న్యాయస్థానంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి విసిరిన సవాళ్లను స్వీకరిస్తూ కావలి పర్యటనకు సిద్ధమైన మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలను హౌస్ అరెస్టులు చేయడం దారుణమని కూటమి ప్రభుత్వ నాయకులు పిరికిపందల్లా వ్యవహరిస్తూ సవాల్లను విసడమే గాని సవాలను స్వీకరించే దమ్ము కూటమి నాయకులకు లేదన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని తమ అక్రమాలు దౌర్జన్యాలను కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా నిర్వహిస్తుందని రాష్ట్ర ప్రజలందరూ కూటమి పాలన అరాచకాలను గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూటమి ప్రభుత్వానికి పరాభవం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో పామూరు మండల యూత్ జనరల్ సెక్రటరీ ఇర్రి వినోద్ రెడ్డి,సీతారామపురం వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి కప్ప పృద్వి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

బత్తాయి సాగుపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం కు హాజరైన : కమీషన్ చైర్మన్

నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) రైతు సంక్షేమ కమిషన్ రెండు రోజుల నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా శనివారం (30 ఆగస్ట్) జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భవన్ లో బత్తాయి రైతులు,ఉద్యాన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలతో, బత్తాయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు సూచనలు, సలహాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండ రెడ్డి గారు మాట్లాడుతూ కమిషన్ పర్యటనలో భాగంగా నల్గొండ జిల్లాలో నిడమనూరు మండలంలోని కొన్ని గ్రామాలలో పరిశీలించడమే కాకుండా రైతులతో మాట్లాడడం జరిగిందని తెలిపారు. అదేవిదంగా జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న బత్తాయి మార్కెట్ ను సందర్శించినారు. భవిష్యత్తులో బత్తాయి తోటను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని, జిల్లాలో బత్తాయి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు కమిషన్ దృష్టికి వచ్చిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఏ రకంగా బత్తాయి మార్కెట్ ను కాపాడవచ్చు ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని బత్తాయి పండించే క్షేత్రాలకు వెళ్లి పరిశీలించి ఒక నివేదిక సమర్పించాలని ఆయన సూచించారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపుతున్నారని ప్రభుత్వం వీరికి సహకరించి ధ్రువీకరణ వ్యవస్థ ఏర్పాటు చేస్తే, అటు వినియోగానికి ఇటు రైతులకు బాగుంటుందని సూచించారు .

జాతీయ అంతర్జాతీయ

చైనా చేరుకున్న ప్రధాని మోదీ.. ఏడేళ్ల తర్వాత తొలిసారి

ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి @ చైనా: ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో అడుగుపెట్టారు. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు లో పాల్గొనేందుకు ఆయన తియాంజిన్కు చేరుకున్నారు. 2020లో లద్దాఫ్ సరిహద్దుల్లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణల అనంతరం ప్రధాని మోదీ ఆ దేశాన్ని సందర్శిస్తుండటం ఇదే మొదటిసారి. చైనాలో చివరిసారి 2018లో పర్యటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో భారతైపై విరుచుకుపడుతున్న వేళ.. ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. జపాన్లో రెండు రోజుల పర్యటన అనంతరం ప్రధాని మోదీ చైనాకు చేరుకున్నారు. ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో తియాంజిన్ వేదికగా నిర్వహించనున్న ఎస్సీవో సదస్సులో పాల్గొననున్నారు. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధినేత పుతిన్ సహా ఆయా దేశాధినేతలతో సమావేశం కానున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం తీసుకువచ్చేందుకు భారత్- చైనా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. భారత ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా తన జపాన్ పర్యటన కొనసాగిందని ప్రధాని మోదీ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. ఈ పర్యటన సందర్భంగా భారత్- జపాన్ల మధ్య దాదాపు 13 ఒప్పందాలు ఖరారయినట్లు తెలుస్తోంది. భారత్లో వచ్చే దశాబ్దకాలంలో రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ సుముఖత వ్యక్తంచేసింది. సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ, టెలికాం సహా కీలకమైన ఖనిజాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు వంటి వ్యూహాత్మక రంగాల్లో సహకారం పెంచుకునేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి.

అన్నమయ్య

బొప్పాయి ధరలు పడిపోతే మాకు బతుకు లేదు” – పురుగుమందు సీసాలతో రైతుల ఆవేదన

బొప్పాయి ధరలు కిలోకు రూ.5కే పడిపోవడంతో చిట్వేల్ రైతులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. తమ కష్టపడి పండించిన పంటకు ధర రాకపోతే ఆత్మహత్య తప్పదని వీడియోల ద్వారా హెచ్చరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ రైతులు, అధికారులు, వ్యాపారులు, దళారులతో సమావేశం నిర్వహించి బొప్పాయిని రూ.10 కన్నా తక్కువకు కొనరాదని ఆదేశించినా, దళారులు పట్టించుకోక రైతులను దోచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సబ్ కలెక్టర్ కూడా హెచ్చరించినా పరిస్థితి మారకపోవడంతో రైతుల్లో ఆగ్రహం, నిరాశ పెరిగిపోతున్నాయి. “మా చెమటను, మా పంటను ఇలా చులకన చేస్తే బ్రతకడం కష్టమే. న్యాయం చేయకపోతే ప్రాణాలు తీసుకోవాల్సిందే” అని రైతులు విలపిస్తున్నారు. ప్రజలు, స్థానిక సంఘాలు అధికారులు వెంటనే జోక్యం చేసుకొని దళారుల దోపిడీని అరికట్టాలని, రైతులకు కనీస న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఖమ్మం

సిపిఎం ధర్నా..

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ పాత కాలువ నిరుపయోగంగా ఉన్న దానిలో సింగరేణి మట్టి పోయించి అర్హులైన వారందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని గ్రామ పంచాయతీ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ , పార్టీ మండల కార్యదర్శి శ్రీమతి జాజిరి జ్యోతి, మండల కమిటీ సభ్యులు వేపులపాటి కుమారస్వామి, పార్టీ శాఖ కార్యదర్శి బండి వేలాద్రి, అయినంపూడి సనందరావు, కావూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్

సెప్టెంబర్ లో స్థానిక సమరం. రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

పున్నమి ఆగష్టు సెప్టెంబర్ లో స్థానిక సంస్థ ల ఎన్నికలు నిర్వహించాలీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత న జరిగిన క్యాబేనెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కి లేఖ రాసింది. రిజర్వేషన్ లలో పరిమితి ని ఎత్తి వేస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్

ఏపీలో బార్‌ లైసెన్సుల జారీ విఫలం – ప్రధాన సమస్య ఇదే!

ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి @ కొత్తగా బార్‌ లైసెన్సులకి తీసుకొచ్చిన పాలసీ విఫలం – 43.70 శాతం బార్లకే నేడు లాటరీ, మిగతా 56.30 శాతానికి మళ్లీ నోటిఫికేషన్‌ ఇవ్వాల్సిందే, గిట్టుబాటు కాదని ఆసక్తి చూపని వ్యాపారులు ఏపీలో కొత్తగా బార్‌ లైసెన్సుల జారీకి ఎక్సైజ్‌ శాఖ తీసుకొచ్చిన పాలసీ విఫలమైంది. మొత్తం 840 బార్లను నోటిఫై చేయగా 43.70 బార్లకే నేడు లాటరీ తీయనున్నారు. మిగతా 56.30 శాతానికి మళ్లీ నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వం లైసెన్సు రుసుముల రూపంలో రావాల్సిన ఆదాయాన్ని కోల్పోతుంది. రాష్ట్రంలో కొత్తగా బార్‌ లైసెన్సుల జారీకి ఎక్సైజ్‌ శాఖ తీసుకొచ్చిన పాలసీ ప్రకారం ప్రతి బార్‌కు కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే వాటిలోంచి లాటరీ తీసి లైసెన్సుదారును ఎంపిక చేయాలన్నది పాలసీలో ప్రధాన నిబంధన. మొత్తం 840 బార్లను నోటిఫై చేయగా శుక్రవారం రాత్రి 10 గంటల వరకు 367 బార్లకే నాలుగు, అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. మిగతా 473 బార్లకు లాటరీ తీసే అవకాశం లేదు. వాటికి నాలుగేసి దరఖాస్తులు వచ్చేవరకూ నోటిఫికేషన్‌ ఇస్తూనే ఉండాలి. ఆసక్తి చూపని వ్యాపారులు:ఫలితంగా సగానికి పైగా బార్లు తెరుచుకోవు. దీంతో లైసెన్స్‌ రూపంలో వచ్చే ఆదాయాన్ని సర్కార్‌ కోల్పోతుంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. స్టేక్‌హోల్డర్స్‌ అభిప్రాయాలు, వినతులు పరిగణనలోకి తీసుకోకపోవడం, పాలసీ రూపకల్పనలో విశేష అనుభవమున్న అధికారుల సూచనలు, సలహాలు తీసుకోకుండా ఓ కన్సల్టెన్సీకే బాధ్యత అప్పగించేయడం వలనే బార్‌కు కనీస దరఖాస్తులు రాలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి బార్‌కు కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ తీస్తామనే నిబంధన పెట్టడం, 15శాతం అదనపు ఏఆర్‌ఈటీ తొలగించకపోవడంతో నూతన బార్‌ పాలసీ తమకు గిట్టుబాటు కాదని వ్యాపారులు దరఖాస్తులు వేయడానికి ముందుకు రాలేదు. ప్రధానంగా క్వార్టర్‌ రూ.99కే లభించే మద్యాన్ని బార్లలో విక్రయించకూడదన్న నిబంధన, అదే విధంగా మద్యం దుకాణాల్లో పర్మిట్‌రూమ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతివ్వడంతో బార్ల కోసం దరఖాస్తులు వేయడానికి వ్యాపారులు ఏ మాత్రం ఆసక్తి చూపించలేదు. గీత కార్మిక కులాల కోసం అదనంగా మరో 84 బార్లను నోటిఫై చేశారు. అందులో 80 బార్లకు నాలుగు, అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. సాధారణ బార్ల కంటే వీటి దరఖాస్తు రుసుము, లైసెన్సు రుసుము 50 శాతం తక్కువ కావడంతో వాటికి పూర్తిస్థాయిలో దరఖాస్తులు రావడం గమనార్హం. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి బార్లకు దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్‌ కమిషనర్‌ నిషాంత్‌కుమార్ చెప్పారు. 2019లో 517 2022లో పదకొండు వందల యాభై దరఖాస్తులు రాగా ఈ సారి 2వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ఒక్కో దుకాణానికి కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ తీస్తామనే నిబంధన పెట్టామనీ, దాని ప్రకారం శనివారం ఉదయం ఆయా జిల్లాల్లో 367 బార్లకు లాటరీ తీసి లైసెన్సు జారీచేస్తామని తెలిపారు. గీత కార్మికులకు రిజర్వు చేసిన దాదాపు 84 బార్లలో 80 బార్లకూ శనివారమే లాటరీ తీస్తామని అధికారులు వెల్లడించారు.

క్రైమ్

వినియోగదారులకు గూగుల్ అప్‌డేట్.. మీ సేఫ్టీ కోసం ఇలా చేయండి

ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి @ జీమెయిల్ యూజర్లకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఎందుకంటే మీ జీమెయిల్ ఖాతా భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని, పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చాలని గూగుల్ 2.5 బిలియన్ యూజర్లకు సూచించింది. ఎందుకనే విషయాలను ఇప్పుడు చూద్దాం. మీరు జీమెయిల్ వినియోగిస్తున్నారా. అయితే ఈ వార్త గురించి తప్పక సమాచారం తెలుసుకోవాలి. ఎందుకంటే గూగుల్ తాజాగా దాదాపు 2.5 బిలియన్ల మంది వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల జరిగిన పెద్ద సైబర్ దాడి వల్ల, అనేక వినియోగదారుల ఖాతాలు ప్రమాదంలో ఉన్నాయని గూగుల్ తెలిపింది. ఈ సైబర్ దాడి Salesforce అనే థర్డ్ పార్టీ డేటా లీక్‌తో సంబంధం కలిగి ఉందని గుర్తు చేసింది. ఈ లీక్ కారణంగా హ్యాకర్లకు వినియోగదారుల అకౌంట్‌లను దుర్వినియోగం చేయడానికి కొత్త అవకాశాలు లభించాయని వెల్లడించింది. సెక్యూరిటీని పెంచుకోవాలి గూగుల్ తెలిపినట్లుగా, ఈ డేటా బ్రీచ్ (data breach) కారణంగా, జీమెయిల్, గూగుల్ క్లౌడ్, ఇతర గూగుల్ సేవల వినియోగదారులకు తీవ్ర ప్రమాదం ఏర్పడింది. హ్యాకర్లు ఈ సమాచారాన్ని ఉపయోగించి, వినియోగదారుల ఖాతాలకు యాక్సెస్ చేసేందుకు ఫిషింగ్ (phishing), మాల్వేర్ (malware) పద్ధతులు ఉపయోగిస్తున్నారు. ఈ ప్రాసెస్‌లో హ్యాకర్లు వినియోగదారులను ఫేక్ లాగిన్ పేజీలకు డైరెక్ట్ చేసి, వారి పాస్‌వర్డ్‌లను లేదా 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2FA) కోడ్స్‌ను కూడా పొందేందుకు ప్రయత్నిస్తారు. సైబర్ దాడులు ఈ క్రమంలో అప్రమత్తమైన గూగుల్ తన వినియోగదారులను పాస్‌వర్డ్‌లు అప్‌డేట్ చేయమని సూచిస్తోంది. ఈ సైబర్ దాడి చాలా పెద్దది కాబట్టి జీమెయిల్ ఖాతాలకు మాత్రమే కాకుండా, గూగుల్ సేవల అన్నింటికి కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. Salesforce అనేది క్లౌడ్ ఆధారిత CRM (Customer Relationship Management) సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్. ఈ ప్లాట్‌ఫామ్‌లో భారీగా డేటా నిల్వ ఉంటుంది. అది హ్యాకర్ల చేతిలో పడితే, చాలా ఇబ్బందులు ఏర్పడవచ్చు. వినియోగదారులను నమ్మించి.. ఈ సైబర్ దాడి కారణంగా, వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారు. గూగుల్, ఈ సమాచారాన్ని ఉపయోగించి, వినియోగదారులను నమ్మించి వారి ఖాతా వివరాలను చోరీ చేసేందుకు అనేక పద్ధతులను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. ఈ హెచ్చరిక ప్రధానంగా వినియోగదారుల ఖాతాలను కాపాడుకోవడం కోసమే. సైబర్ దాడుల్లో ఎక్కువగా ఫిషింగ్ పద్ధతులు ఉపయోగిస్తారు. ఇవి, మోసపూరితమైన వెబ్‌సైట్‌లను ఉపయోగించి, వ్యక్తిగత సమాచారాన్ని లేదా 2FA కోడ్స్‌ను పొందడం వంటి చర్యలతో లింకై ఉంటాయి. ఈ సైబర్ దాడి వెనుక ఉన్న హ్యాకర్లు, ఈ పద్ధతులను మరింత అధికస్థాయిలో ఉపయోగించి, గూగుల్ వినియోగదారుల ఖాతాలకు ప్రాక్టికల్‌గా పూర్తి యాక్సెస్ పొందటానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? పాస్‌వర్డ్‌ను వెంటనే మార్చండి: మీ Gmail ఖాతాకు సంబంధించి మీరు ఇప్పటికే పాస్‌వర్డ్ మార్చకపోతే, అది వెంటనే మార్చేయండి. పాస్‌వర్డ్‌ బలమైనదిగా ఉండాలి. 2FA అమలు చేయండి: 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2FA) ను ఎప్పుడూ ఎనేబుల్ చేయండి. ఇది మీ ఖాతా సెక్యూరిటీని మరింత పెంచుతుంది. అనుమానాస్పద ఇమెయిల్స్‌ని జాగ్రత్తగా చూడండి: మీ inboxలోకి వచ్చే ఏదైనా అనుమానాస్పద ఇమెయిల్స్ విషయంలో జాగ్రత్త వహించండి. గూగుల్ ఖాతా సెట్టింగ్స్‌ను చెక్ చేయండి: మీ గూగుల్ ఖాతా సెట్టింగ్స్‌లో ఎలాంటి అపరిమిత యాక్సెస్ లేదా అనుమానాస్పద లింక్స్ ఉంటే వాటిని తొలగించండి.

ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.53,922 కోట్లతో భారీ పెట్టుబడులు! ఈ జిల్లాలకు మహర్దశ!

ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి @ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రాబోతున్నాయి. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో రూ.53,922 కోట్ల పెట్టుబడులతో 30 కంపెనీలకు అనుమతి లభించింది. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 83,437 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్ ఏర్పాటు ప్రణాళికలో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టుల పురోగతిని ప్రతి నెల సమీక్షిస్తామని తెలిపారు. ఈ పెట్టుబడుల్లో ప్రధాన ఆకర్షణ గూగుల్ సంస్థ నుంచి వచ్చింది. విశాఖపట్నంలో రూ.50 వేల కోట్లతో 1 గిగావాట్ సామర్థ్యం గల డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద హైపర్‌స్కేల్ డేటా సెంటర్ కానుంది. అమెరికా వెలుపల ఇంత భారీ స్థాయిలో గూగుల్ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. దీని ద్వారా గూగుల్ క్లౌడ్, యూట్యూబ్, సెర్చ్, ఏఐ సేవలు మరింత విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్ట్‌తో ఏపీలో ఐటీ రంగం కొత్త అవకాశాలను సృష్టించుకోనుంది. గూగుల్ పెట్టుబడి ద్వారా దశలవారీగా 25 వేలమందికి ప్రత్యక్షంగా, మరో 50 వేలమందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో చింతా గ్రీన్ ఎనర్జీ, బ్రైట్ ఫ్యూచర్ పవర్, నవయుగ ఇంజినీరింగ్ వంటి పలు కంపెనీలు కూడా పెద్ద ప్రాజెక్టులకు ముందుకొచ్చాయి. వీటితో అనేక జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పడి స్థానిక యువతకు ఉద్యోగాలు కలిగే అవకాశం ఉంది. విశాఖ డేటా సెంటర్ ఏర్పాటుతో దేశీయ డేటా దేశంలోనే భద్రంగా ఉండనుంది. డేటా చోరీ సమస్యలు తగ్గి భద్రత పెరుగుతుంది. దీనికి అవసరమైన ఇంటర్నెట్ వేగం కోసం ముంబై నుండి విశాఖ వరకు సముద్ర మార్గంలో సబ్ మెరైన్ కేబుల్స్ ఏర్పాటు చేయనున్నారు. తక్కువ ఖర్చుతో డార్క్ ఫైబర్ సౌకర్యం ద్వారా డేటా చేరవేయవచ్చు. గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి నీటి అవసరం ఎక్కువగా ఉండటంతో విశాఖ సముద్రతీరాన్ని ప్రాధాన్యంగా ఎంచుకుంది. ఈ ప్రాజెక్ట్ కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాదు, దేశం మొత్తం ఐటీ రంగానికి గొప్ప మైలురాయిగా నిలవనుంది. పెట్టుబడులు, ఉద్యోగాలు, సాంకేతిక అభివృద్ధి—all కలసి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతమివ్వనున్నాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.