Saturday, 9 May 2026

Blog

భక్తి

రూ.77,77,777 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో గణపతికి అలంకరణ

ఆగస్టు పున్నమి ప్రతినిధి @ ఆంద్రప్రదేశ్ :గుంటూరు రాష్ట్రవ్యాప్తంగా గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అలాగే గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా పెదనందిపాడు మండలం నాగులపాడులో శ్రీరామ యూత్‌ ఆధ్వర్యంలో భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. మూడోరోజు గణేశుడిని రూ.77,77,777 విలువైన కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్

తేటి శివశంకర్ IAS ను ఆంధ్రప్రదేశ్ కు కేటాయిస్తూ కేంద్ర పరిపాలన శాఖ ఆదేశాలు.!

ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి @ అమరావతి హైదరాబాద్ లోనీ తేటి శివశంకర్ IAS ను ఆంధ్రప్రదేశ్ కు కేటాయిస్తూ కేంద్ర పరిపాలన శాఖ ఆదేశాలు.! లోతేటి శివశంకర్ IAS ను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించాలంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేసిన కేంద్ర పరిపాలన శాఖ… తక్షణమే లోతేటి శివశంకర్ IAS ను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు.

అన్నమయ్య

కె.కందులవారిపల్లిలో వినాయక చవితి – భక్తి, సేవ కలగలిపిన వేడుక : కందుల దుర్గ, వారి కుటుంబ సభ్యులు సమిష్టిగా అన్నదానం – కోతులకు కూడా ఆహారం పంచడం విశేషం

చిట్వేల్ మండలం కే.కందులవారిపల్లిలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గ్రామంలోని కందుల దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వందలాది మంది భక్తులు వినాయక స్వామి దరికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసుకొని అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ప్రత్యేకత ఏమిటంటే : భోజనానికి మిగిలిన ఆహారాన్ని వృథా కాకుండా రాపూర్ ఘాటులోని కోతులకు అందించారు. కందుల దర్గా, కందుల చౌదరి, మరియు కే.కందులవారిపల్లి యువత ముందడుగు వేసి ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ యూత్ అందరూ కలిసి కోతులకు ఆహారం పంచడం ద్వారా వినాయక చవితి పండుగను మరింత విశిష్టంగా నిలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ, “అన్నం పరబ్రహ్మ స్వరూపం. దానిని పంచడం ద్వారానే పండుగకు పూర్తి సార్థకత లభిస్తుంది” అని అభిప్రాయపడ్డారు.

తిరుపతి

లాటరీ టికెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

శ్రీకాళహస్తి పట్టణం లోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద జానీ భాషా అనే వ్యక్తి లాటరీ టికెట్లు అమ్ముతున్నాడు అన్న సమాచారం అందుకున్న రెండవ పట్టణ పోలీసులు ఆర్టీసీ బస్టాండ్ వద్ద అతడిని అరెస్ట్ చేసి అతని నుండి 12,050 రూపాయల నగదు,లాటరీ టికెట్లను స్వాధీనం చేసుకొని ,అతినిపై కేసు నమోదు చేశారు.

తిరుపతి

కనబడుటలేదు

శ్రీకాళహస్తి పట్టణం, ముత్యాలమ్మ గుడి వీధిలో కాపురం ఉంటున్న టి.మునిరత్నం అనే వ్యక్తి(75సం”) 29-08-2025 మధ్యాహ్నం 2 గంటల నుండి,కొంచెం మతి స్థిమితం (వయస్సు ప్రభావ రీత్యా) లేనందున, ఇంటి నుండి బయటకు వచ్చి దారి తప్పిపోయాడు. దయచేసి ఈ వ్యక్తిని ఎక్కడైనా కనుగొనిన యెడల దయవుంచి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగలరని,కుటుంబ సభ్యులు ప్రార్ధిస్తున్నారు. Cell – 7993486755 9491499080

పశ్చిమ గోదావరి

బిజెపి రాష్ట్ర నూతన పదాధికారుల సంస్థాగత కార్యశాల కార్యక్రమం

శుక్రవారం విజయవాడలో నిర్వహించిన బిజెపి రాష్ట్ర నూతన పదాధికారుల సంస్థాగత కార్యశాల కార్యక్రమంలో జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శ్రీ శివప్రకాశ్ జీ గారు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారు మరియు ఇతర పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని రాష్ట్ర నూతన పదాధికారులను కోరారు.

పశ్చిమ గోదావరి

లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అంజిబాబు

భీమవరం : సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని స్వామివారిని భీమవరం ఎమ్మెల్యే రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో, అర్చకులు ఎమ్మెల్యే అంజిబాబు కు స్వాగతం పలికి ప్రత్యేక పూజలను నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యే అంజిబాబు ను సత్కరించారు.

తెలంగాణ పెద్దపల్లి

ఉద్యమకారుల హామీలపై అసెంబ్లీ సమావేశాలలో ప్రకటన చేయాలి: పోతు జ్యోతి రెడ్డి

  మంథని, ఆగస్టు 29: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు నేటి నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పోతు జ్యోతి రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోతు జ్యోతి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యమకారులకు హామీ ఇచ్చిన 250 గజాల స్థలం, అలాగే ఝార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నవిధంగా పింఛన్, గుర్తింపు కార్డులు, ఉచిత బస్సు, రైలు ప్రయాణం హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు. అలాగే బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, ఎంఐఎం పార్టీల పెద్దలు సైతం ఉద్యమకారుల హామీల అమలుపై అసెంబ్లీలో గొంతెత్తి ఉద్యమకారులకు అండగా ఉంటామని ప్రకటించాలని జ్యోతి రెడ్డి ఆయా పార్టీలను కోరారు.

హైదరాబాద్

*అల్పపీడనంకు అనుబంధంగా ఆవర్తనం.. ఏపీ, తెలంగాణకు మరో వారం రోజులపాటు భారీ వర్షాలే*

పున్నమి ప్రతినిధి హైదరాబాద్ ఆగస్టు: ఛత్తీస్‌గఢ్‌లో అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు ఏపీలోని 6 ప్రధాన పోర్టుల్లో మూడో ప్రమాద సిగ్నల్ జారీ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కుండపోత వానల అంచనా తెలుగు రాష్ట్రాలను వర్షాలు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో వారం రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతుండటంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందుజాగ్రత్త చర్యగా రాష్ట్రంలోని ఆరు ప్రధాన ఓడరేవుల్లో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు గట్టిగా హెచ్చరించారు. మరోవైపు, తెలంగాణలోనూ వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పై ఫేక్ న్యూస్ కలకాలం

ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి @ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ఒక నకిలీ జీవో ను సృష్టించిన కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జీవో ఆర్టీ నెం.1575 తేదీ 29-08-2025న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు ప్రచారం అవుతున్న ఈ జీవో నకిలీది. ఇందులో 62 సంవత్సరాల నుంచి పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ఉన్నది. అయితే వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఆర్టీ నెం 1545 తేదీ 22-08-2025న విడుదల చేసింది. ఈ వాస్తవ జీవోలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతున్నట్లుగా మాత్రమే ఉన్నది. దురుద్దేశపూర్వకంగా కొందరు వ్యక్తులు తప్పుడు జీవోను సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులలో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా ప్రభుత్వ ఉత్తర్వులను కూడా నకిలీవి సృష్టించి ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.