Saturday, 9 May 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అరటి ఆకుల్లో భోజనం.. కాగిత సంచుల్లో ప్రసాదం

ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి @ ఆత్రేయపురం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం తిరుమల వాడపల్లి దేవాలయంలో ప్లాస్టిక్ నిర్మూలనకు చర్యలు చేపట్టారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో భాగంగా సంయుక్త కమిషనర్, ఉప కమిషనర్, కమిషనర్ క్యాడర్లో ఉన్న ఆలయ ప్రాంగణాలను ప్లాస్టిక్ రహితంగా మార్చాలన్న దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశాల మేరకు డీసీ క్యాడర్లో ఉన్న వాడపల్లి వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీకారం చుట్టారు. నిత్యం రద్దీ ఇలా.. ఆలయంలో శనివారం 10 వేల నుంచి 15 వేల వరకు, మిగతా రోజుల్లో నిత్యం 3 వేల నుంచి 5 వేల మందికి అన్నప్రసాద వితరణ చేస్తుంటారు. వీరికి గతంలో ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనాలు వడ్డించేవారు. ప్రస్తుతం స్టీల్ కంచంలో అరటి ఆకులను వేసి అన్నప్రసాదం పెడుతున్నారు. త్వరలో పూర్తిగా అరటి ఆకులు వినియోగించేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులకు అరటి ఆకు, కుట్టుడు ఆకుతో తయారుచేసిన కప్పుల్లో ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. లడ్డూ, పులిహోర ప్రసాదాలను కాగితం సంచుల్లో అందజేస్తున్నారు. దుకాణదారులకు నోటీసులు..: నల్లం సూర్యచక్రధరరావు, ఈవో ఆలయ సమీపంలోని దుకాణాల్లో పాలిథిన్ సంచులు విక్రయించరాదని వ్యాపారులకు నోటీసులు అందజేశాం. తహసీల్దార్ సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించాం. దేవస్థానంలో ప్లాస్టిక్ రహిత వస్తువులను వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్లాస్టిక్ కవర్లు తీసుకురావద్దని భక్తులను కోరుతున్నాం. ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉన్నట్లు బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. క్షేత్రంలో మైక్లో ప్రచారం చేస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్

పోలవరం ప్రాజెక్టు లో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన

ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి @ పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు ను శుక్రవారం అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించింది. సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు వీరు పోలవరం ప్రాజెక్ట్ లోని వివిధ నిర్మాణాలను పరిశీలిస్తారు. జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్షలు నిర్వహిస్తారు. అంతర్జాతీయ నిపుణుల వెంట కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ లో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించి జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు తగు సూచనలు సలహాలు ఈ బృందం ఇవ్వనుంది. అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డొన్నెల్లి, జియాన్ఫ్రాన్కో డి సికో, డేవిడ్ బి పాల్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు.

హైదరాబాద్

వినాయక మండపంలో గణనాధునికి ప్రత్యేక పూజలు

పున్నమి: హైదరాబాద్: డాక్టర్ BRKR ప్రభుత్వ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ ESI హాస్పిటల్ ఎదురుగా, AG కాలనీ రోడ్, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ లో వినాయక మండపం నందు గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో డాక్టర్ బి ఆర్ కే ఆర్ బూర్గుల రామకృష్ణారావు ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థినిలు. దూపం పావని, శ్రీకళ, శ్రేయ, దీప్తి ప్రియ, సౌమ్య, మెడికల్ కాలేజ్ కి చెందిన డాక్టర్స్, మెడికల్ కాలేజీకి చెందిన యువకులు తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

గణేశ్ఉత్సవకమిటీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కాసుశ్రీనివాస్*

* *ఘనంగా సన్మానించిన నాగార్జున స్ట్రీట్ బాలగణపతి సంఘ సభ్యులు* రాజోలు నాగార్జున స్ట్రీట్ లో ఉన్న బాలగణపతి సంఘం వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రాజోలు తాలూకా గణేష్ నిమజ్జన కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన కాసు శ్రీనివాస్ గారికి సంఘం సభ్యులు అలాగే గరుడ యూత్ సభ్యులు కలిసి ఘనంగా సత్కరించారు.. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు చెల్లుబోయిన రాంబాబు మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారని.. ఏ ఆటంకం లేకుండా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని.. ఈ సంవత్సరం రాజోలు ప్రముఖులు కాసు శ్రీనివాస్ గారి ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా ఎన్నాళ్లయినా చాలా శుభపరిణామం అని.. ఆయన ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా ఘనంగా గణేష్ నిమజ్జనం చేయడం మా వంతు కృషి చేయడం రాంబాబు అన్నారు.. ఈ కార్యక్రమంలో గుబ్బల శ్రీను,ఉత్సవకమిటీ సభ్యులు దార్లబాబు,కాట్నరాజు,సుబుద్ధి,మావూరినాగబాబు,యేడిదనానాజీ,అప్పారిగుణ,తదితరులు వరకు..

జాతీయ అంతర్జాతీయ

టైటానోబోవా! 45 అడుగుల పొడవు.. 2,500 పౌండ్ల బరువున్న పామును చూశారా?

ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ అరు కోట్ల సంవత్సరాల క్రితం సంగతి ఇది! దక్షిణ అమెరికాలోని దట్టమైన అడవులు! భయానకమైన ఉక్కపోత! అక్కడ మహా హంతక వేటగాడు ఉద్భవించాడు! అప్పటికి డైనోసార్లు అంతరించిపోయాయి! వాటి స్థానంలో వచ్చిన కొత్త వేటగాడు. ఆ అడవిని రూల్ చేశాడు! ఆ వేటగాడి పేరే.. టైటానోబోవా! 45 అడుగుల పొడవు! దాదాపు 11 వందల కిలోల బరువు! ఆహారం కంటబడితే క్షణంలో స్వాహా! అది జంతువు కావొచ్చు! భయానక మొసలి కావొచ్చు! ఏదైనా ఆ వేటగాడి ముందు బలాదూర్! ఆ మహా వేటగాడి ఆనవాళ్లు.. 2009 వరకూ ఎవరూ కనిపెట్టలేకపోయారు! ఆ తర్వాత చరిత్ర పూర్వపు జీవితం, పర్యావరణానికి సంబంధించిన అంచనాలు మారిపోయాయి. మరుగునపడిన భారీ కాయాల చరిత్ర బయటకు వచ్చింది! మీరు అతిపెద్ద పామును చూశారా? నిజంగా కాకపోయినా వీడియోల్లోనైనా చూశారా? కోబ్రాలు అయితే 14 అడుగుల వరకూ పెరుగుతాయి. కొండచిలువలు మరో ఐదు అడుగులు ఎక్స్ట్రా పెరుగుతాయి. కానీ.. ఏకంగా 45 నుంచి 50 అడుగుల పొడువు ఉంటుంది.. టైటానోబోవా! సింపుల్గా చెప్పాలంటే మీరెక్కే సిటీ బస్సు అంత పొడవు.. ఒక ఆయిల్ డ్రమ్ అంత చుట్టుకొలతతో ఉండేది. అది ఇప్పటి కాలపు ఒక చిన్నకారును చుట్టుముట్టిందంటే… ఆ కారు కనిపించదు! ఈ భూప్రపంచంపై డైనోసార్లు అంతరించిపోయిన తర్వాత ధరిత్రిపై పాకులాడిన భయానక సర్పం! టైటానోబోవాకు ఉన్న మితిమీరిన శక్తి కారణంగా అది మొసళ్లను, భారీ చేపలను సైతం అలవోకగా భోం చేసేసేది. అదే ఆ కాలపు మహా వేటగాడిగా దాన్ని నిలిపింది. అనకొండ.. హారర్ సినిమా గుర్తుకొస్తున్నదా? దీని శిలాజ ఆనవాళ్లు ప్రస్తుత కొలంబియాలో కనుగొన్నారు. అప్పటిదాకా భారీ సర్పాలు ఉన్నాయని భావించినా.. 2009 తర్వాతే అది నిజమే అని తేలింది. 2009లో కొలంబియాలోని సెరెజోన్ బొగ్గు గనుల్లో ఈ భారీ సర్పం శిలాజాలను శాస్త్రవేత్తలు గుర్తించడంతో టైటానోబోవా వెలుగులోకి వచ్చింది. దాని ఎముకల వ్యవస్థ ఇప్పటికాలపు ఏ జీవితోనూ సరిపోలలేదు. ఇప్పటిలాగా నాటి అడవులు సరైన పరిస్థితులను కలిగి ఉండేవి కావు. అత్యంత వేడి, తేమ కారణంగా సరీసృపాలు ఊహించనంత స్థాయిలో పెరిగిపోయాయి. ఇదే పరిస్థితుల్లో టైటానోబోవా సైతం భారీ కాయంతో ఈ అడవుల్లో తిరుగాడింది. ఇప్పటి పాములు వేటలో ఎక్కువగా తమ విషంపై అధారపడేవి. కానీ.. టైటానోబోవా మాత్రం ఈనాటి కొండచిలువ ఎలా జీవులను అమాంతం మింగేస్తుందో.. అలా మిగేసేది. తన ఆహారాన్ని దొరకపట్టుకుని, తన భారీ కాయంతో దానిని చుట్టేసి.. ప్రాణం పోయేలా చేసేది. ఆ తర్వాత అమాంతం మింగేసేది. అన్ని పాములకు మాదిరిగానే దాని దవడలు మింగేసేది. అన్ని పాములకు మాదిరిగానే దాని దవడలు ఎంత కావాలంటే అంత స్థాయిలో తెరుచుకునేవి. ఇక దాని బలంతో భారీ మొసళ్లు, భారీకాయంలో ఉండే తాబేళ్లు, భారీ చేపలు వంటివాటిని అవలీలగా తినేసేది. కావాలంటే.. 45 అడుగుల పాము.. మీకు సమీపం నుంచి పాకుతూ వెళుతూ తనకు కనిపించిన ఆహారాన్ని అమాంతం నోట్లోకి లాగేసుకున్న దృశ్యాన్ని ఊహించుకోండి! ఒళ్లు జలదరిస్తుంది కదా!

ఆంధ్రప్రదేశ్

ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు అందరికీ ఈ ఫైలింగ్ కు ఆఖరి తేదీ సెప్టెంబర్ 15

ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు అందరికీ నమస్కారం. ఈ ఫైలింగ్ కు ఆఖరి తేదీ సెప్టెంబర్ 15వ తారీకు. ఈ క్రింది సూచనలు పాటించవలసినదిగా మనవి. నూతన స్లాబ్ విధానంలో పన్ను చెల్లించిన వారు మీ ఇన్కమ్ టాక్స్ క్యాలిక్యులేషన్ షీట్ మొదటి పేజీని పంపించవలసి ఉంటుంది. అదేవిధంగా నూతన టాక్స్ విధానాల్లో ఎటువంటి మినహాయింపులు లేవు కాబట్టి గత ఆర్థిక సంవత్సరంలో *అదనంగా పొందిన ఆదాయం మీద తప్పనిసరిగా ఇప్పుడు పన్ను చెల్లించవలసి ఉంటుంది. సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నందు జమకాబడిన వడ్డీ మరియు ఇన్కమ్ టాక్స్ రిఫండ్ పొందడం వలన అదనంగా వచ్చిన వడ్డీ మరియు ఇతర ఆదాయాలు పై E ఫైలింగ్ చేసేటప్పుడు పన్ను కట్టవలసి ఉంటుంది. గమనించగలరు.

క్రైమ్

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హత్యకు భారీ సుఫారీ సమాచారం కలకలం

ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ నెల్లూరు నెల్లూరు లో ఫ్యాక్షన్ రాజకీయాలు తెరమీదకు వచ్చాయి. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హత్యకు భారీ సుఫారీ సమాచారం కలకలం సృష్టించింది. రాజకీయవర్గాల్లో కలవరం సృష్టించింది. ఈ మేరకు ఓ వీడియో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని చంపితే డబ్బే డబ్బు అంటూ రౌడీషీటర్ల సంబాషణలు వెలుగు చూశాయి. ఆయన్ను చంపేందుకు ఐదుగురు రౌడీషీటర్లు మాస్టర్‌ ప్లాన్‌ వేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హత్యకు పక్కా ప్లాన్‌ వేసినట్లు సమాచారం బయటకు రావడంతో సంచలనం చెలరేగింది. “చంపితే డబ్బే డబ్బు” అంటూ రౌడీషీటర్ల సంభాషణలతో కూడిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఎమ్మెల్యే ప్రాణాలకు ముప్పు ఉందన్న ఆందోళన నెలకొంది.

తిరుపతి

బొజ్జల బృందమ్మ చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయనిధి పంపిణీ

శ్రీకాళహస్తి పట్టణం నందు ముఖ్యమంత్రి సహాయనిధి క్రింద చెక్కుల పంపిణీ కార్యక్రమం శాసన సభ్యులు బొజ్జల సుదీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ చేతుల మీదుగా జరిగింది.ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నటువంటి వారికి ఇంటివద్దకే వెళ్లి చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బృందమ్మ మాట్లాడుతూ ఇప్పటివరకు నియోజకవర్గ స్థాయిలో సీఎం సహయనిధి క్రింద 147 మందికి గాను 1,78,76,702 రూపాయలు అందచేశామని తెలియజేసారు.

ఆంధ్రప్రదేశ్

మరో అల్పపీడనం..! పిడుగులాంటి వార్త చెప్పిన వాతావరణ శాఖ.. ఇక నాన్‌స్టాప్ వానలే వానలు.

ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ పిడుగులాంటి వార్త ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే నెల 2వ తేదీ తర్వాత వర్షాల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సెప్టెంబర్‌ 2 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దాని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథకుమార్‌.. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు కొనసాగుతాయని చెప్పారు. కాగా.. ఏపీ, తెలంగాణలో వచ్చే 24గంటల్లో ఎలాంటి వాతావరణం ఉండబోతోంది?.. ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది?.. అనే వివరాలను తెలుసుకోండి.. కుండపోత వానలు.. ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ మరోసారి వర్షసూచన చేస్తోంది. ముఖ్యంగా.. బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని రెండు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ఇచ్చింది. అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. ఈ రెండు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు కొన్ని చోట్ల పిడుగులు పడే చాన్స్‌ ఉందని తెలిపింది. మరోవైపు.. ఏపీలోని 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ కొనసాగుతోంది. ప్రకాశం, నెల్లూరు, కడప, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, విశాఖపట్నం, అల్లూరి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం.. ఈ 11 జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక.. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతుండగా.. ఇప్పుడు మరికొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ వెవీ రెయిన్‌ అలర్ట్‌ జారీ చేసింది. తెలంగాణలోని 24జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ ఇచ్చింది. ఆదిలాబాద్‌, కొమురంభీం, నిర్మల్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్‌, జనగామ, వికారాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, నారాయణపేట్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

జయశంకర్ భూపాలపల్లి తెలంగాణ పిల్లలకు విద్య విజ్ఞానం

విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ

కాటారం, ఆగస్టు 29: ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండ‌లం దామెరకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా పాఠ‌శాల విద్యార్థుల‌కు ప్రధానోపాధ్యాయులు పి. సుధాకర్,ఆధ్వ‌ర్యంలో శుక్రవారం 40 మంది విద్యార్ధిని విద్యార్ధులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు ఫిజికల్ డైరెక్టర్ రాధ, ఎం. శ్రీనివాస్, పి. కుమార్, ఏ. రవీందర్, జి. వియేందర్, సాజిదా బేగం, ఎం. చైతన్య, బి. వెంకటరమణ, డి. శ్రీధరచార్యులు విరాళాలతో విద్యార్థి, విద్యార్థినుల‌కు క్రీడా దుస్తులు అందజేశారు. అంతే కాకుండా పాఠ‌శాల‌కు కావాల్సిన సౌక‌ర్యాల క‌ల్ప‌న‌లో త‌మ స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేయ‌నున్న‌ట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ రాధ మాట్లాడుతూ… విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని, అన్నారు. విద్యార్థులు చ‌దువుతో పాటు క్రీడ‌ల్లోనూ రాణించాల‌ని ఆమె సూచించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.