Saturday, 9 May 2026

Blog

బిజినెస్

ఢిల్లిలో ముగిసిన GST సమావేశం

ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ ఢిల్లీ ఢిల్లిలో ముగిసిన GST సమావేశం హాజరైన 8 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు GST రేట్ల సవరణ, దాని ప్రభావంపై చర్చ రాష్ట్ర ఆదాయాలను కాపాడుతూ GST హేతుబద్ధీకరణ చేయాలని నిర్ణయం వచ్చేనెల 3, 4 తేదీల్లో GST కౌన్సిల్‌ సమావేశం.

అన్నమయ్య

సాయి పుట్టినరోజు వేడుకలు ఘనంగా

తాడపత్రి ఆగస్టు (పున్నమి ప్రతినిధి) తాడపత్రి పట్టణంలో టిడిపి నాయకులు, వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో సాయి పుట్టినరోజు వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న ఆశీస్సులతో పాటు టిడిపి సీనియర్ నాయకుడు ఎస్.వి. రవీంద్రారెడ్డి అన్న ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి.ఈ సందర్భంగా వాల్మీకి సేవా పార్లమెంట్ అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్య, పుష్ప నారాయణ రెడ్డి, ఆది రాజేష్, పులి చంద్ర తదితరులు పాల్గొని సాయి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు వందలు జరుపుకోవాలని, ప్రజా సేవలో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.తాడపత్రి టిడిపి మరియు వాల్మీకి సేవ సంఘం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, జై తెలుగుదేశం నినాదాలతో సభను ముగించారు.

జాతీయ అంతర్జాతీయ

భారత కోచ్ నుంచి అంతర్జాతీయ విజేతగా చెయ్యనూరు సాయికుమార్ విజయయాత్ర

చికాగో రాష్ట్ర విజేతగా చెయ్యనూరు సర్వత్రా అభినందనల జల్లులు ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ గూడూరు : భారత బ్యాడ్మింటన్‌లో కోచ్‌గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చెయ్యనూరు సాయికుమార్, ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై క్రీడాకారుడిగా కూడా విజయాలు సాధిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన సాయికుమార్, చిన్న వయసులోనే బ్యాడ్మింటన్‌పై ఆసక్తి పెంచుకుని, ఆ ఆసక్తిని వృత్తిగా మార్చుకున్నారు. కోచ్‌గా ఆయనకు ఉన్న గుర్తింపు వెనుక బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ లెవల్ 1 కోచింగ్ సర్టిఫికేషన్, నేషనల్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ వంటి అర్హతలు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ అందించే స్థాయికి చేర్చాయి. సాయికుమార్ శిక్షణలో ఉన్న క్రీడాకారులు స్టేట్ ఛాంపియన్ల నుంచి నేషనల్ మెడలిస్టుల వరకు ఎదగడం విశేషం. ఆయన శిష్యుల్లో కొందరు ఇప్పటికే భారతదేశానికి అంతర్జాతీయ వేదికపై ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులను ప్రోత్సహించడం, వారికి ఉచిత శిక్షణ ఇవ్వడం ఆయన కోచింగ్ తత్వంలో ఒక ముఖ్యమైన భాగం. యూఎస్ చికాగో రాష్ట్ర చాంపియన్ గా మిక్సడ్ డబుల్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. అమెరికాలోని చికాగోలో రెడ్ క్రాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎగ్రేట్ బాడ్మింటన్ అకాడమీలో నిర్వహించిన ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో సాయి కుమార్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో గోల్డ్ మెడల్ గెలిచారు. సెమీస్‌లో చైనా ఆటగాళ్లు స్టీవెన్ జియాజ్ లీ – ఎరికా చెన్ లిన్ పై 21-16, 21-10తో విజయం సాధించారు. ఫైనల్స్‌లో మలేషియా ఆటగాడు ఆండీ ఐక్ ట్షాంగ్ ఎన్ – చైనా ఆటగాడు రురు జాంగ్ పై 15-21, 21-12, 21-16 తేడాతో గెలిచి గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు. అలాగే అనేక అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించి, యూఎస్ నేషనల్స్ పోటీలకు అర్హత పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారుల విజయమే నా గొప్ప పతకం అన్నారు. కానీ ఆటగాడిగా నా విజయాలు వారికి నమ్మకాన్ని ఇస్తాయని, ఈ రెండు పాత్రల సమ్మేళనం నన్ను ముందుకు నడిపిస్తోందన్నారు. క్రీడలో క్రమశిక్షణ, కోచింగ్‌లో నిబద్ధత, శిష్యుల పట్ల మమకారం ఈ గుణాలు తనను అంతర్జాతీయ వేదికపై ప్రత్యేకంగా నిలబెట్టాయన్నారు. నెల రోజుల క్రితం అట్లాంటా రాష్ట్రం, ప్రస్తుతం చికాగో రాష్ట్ర ఛాంపియన్ గా గోల్డ్ మెడల్ సాధించడం పట్ల సాయి కుమార్ ప్రతిభ కేవలం గూడూరుకే కాకుండా, మొత్తం భారతదేశానికి గర్వకారణమని క్రీడాభిమానులు అభినందనల జల్లులు కురిపిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

బస్సులో 130 మంది ప్రయాణికులు..!!

ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ విశాఖలో ఓవర్ లోడ్ కారణంగా బస్సు లో చెలరేగిన మంటలు బస్సు కెపాసిటీ 65కాగా 130 మంది ప్రయాణించడంతో ప్రమాదం 130 మంది ప్రయాణికులలో 99 మంది మహిళలు ఉన్నట్టు గుర్తింపు కుర్మన్నపలెం నుంచి విజయనగరం వెళ్తున్న బస్సు

ఆంధ్రప్రదేశ్

సెప్టెంబర్ మొదటి వారం చివరిలో కాకినాడ పోర్ట్‌కు 30,000 మెట్రిక్ టన్నుల యూరియా

ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. రాష్ట్రంలో పంట సాగు ముమ్మరంగా సాగుతున్న వేళ యూరియా కొరత నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంది. కేంద్ర రసాయనాలు అండ్ ఎరువుల శాఖ మంత్రితో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చర్చలు జరిపారు. రైతులకు యూరియా అవసరాల దృష్ట్యా రాష్ట్రానికి 10,350 మెట్రిక్ టన్నుల యూరియాను విశాఖపట్నంలోని గంగవరం పోర్టులో దిగుమతికి కేంద్రం జీవో జారీ చేసింది. యూరియా విశాఖలోని గంగవరం పోర్ట్ ద్వారా దిగుమతి కానుంది. రాష్ట్రంలో అత్యవసరంగా యూరియా కోసం ఎదురుచూస్తున్న జిల్లాలకు యుద్ధప్రాతిపదికన యూరియా బస్తాలను పంపాలని మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గంగవరం పోర్ట్‌కు సెప్టెంబర్ 6వ తేదీన యూరియా షిప్ రావాల్సి ఉండగా.. రైతుల అత్యవసర అవసరాల దృష్ట్యా వారం రోజులు ముందుగానే షిప్‌ వచ్చేలా మంత్రి చర్యలు తీసుకున్నారు. సెప్టెంబర్ మొదటి వారం చివరిలో కాకినాడ పోర్ట్‌కు 30,000 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపిన మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ యూరియా కూడా రాష్ట్రంలోని రైతుల అవసరాల కోసం వినియోగించబడుతుందని చెప్పారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైన సమయంలో యూరియా అందించే బాధ్యత తమది అని మంత్రి స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్

ఇళ్ల స్థలాల కోసం నిర్మల్ కలెక్టరేట్ ముందు జర్నలిస్టుల నిరసన:

కలెక్టరేట్ ముట్టడి చేసిన టియుడబ్ల్యూజే ( ఐ జేయు) పున్నమి ప్రతినిధి నిర్మల్ ఆగస్టు: నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులు తమ ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ-IJU) ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో, అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు, రైల్వే పాసులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొండూరు రవీందర్, ప్రధాన కార్యదర్శి వెంక గారి భూమయ్య మాట్లాడుతూజర్నలిస్టుల కుటుంబాల ఆవేదననిరసనకారులు, సమాజంలో ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. పల్లెల నుంచి పట్టణాల వరకు 24 గంటలూ శ్రమిస్తున్నప్పటికీ, తమకు సొంత ఇల్లు లేకపోవడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు, ఇతర జిల్లాల్లో జర్నలిస్టులకు ఇప్పటికే ఇళ్ల స్థలాలు కేటాయించారని, అదే తరహాలో నిర్మల్ జిల్లాలో కూడా అన్ని మండల కేంద్రాలతో పాటు నిర్మల్ పట్టణంలో ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని కోరారు.సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యంజర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇళ్ల స్థలాలకు మాత్రమే పరిమితం కాలేదు. వారికి సరైన గుర్తింపు కార్డులు, రైల్వే పాసులు, ఆరోగ్య భీమా వంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల నిత్యం ఆర్థికంగా, సామాజికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది జర్నలిస్టులు తక్కువ జీతాలతో పనిచేస్తున్నందువల్ల, తమ కుటుంబాల కనీస అవసరాలను తీర్చడానికే కష్టపడుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో, ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించడానికి చొరవ చూపకపోవడం వారిని మరింత నిరాశకు గురిచేసింది. ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతో పాటు అన్ని సౌకర్యాలను కల్పించాలని, వారి శ్రమను గుర్తించి గౌరవించాలని ఈ నిరసనకారులు డిమాండ్ చేశారు.కలెక్టర్ స్పందనపై ఆశలుతమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని పరిపాలనా అధికారికి అందజేసిన అనంతరం, వారు ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే, ఈ నెల 29న జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమం జర్నలిస్టుల నివాస సమస్య ఎంత తీవ్రంగా ఉందో మరోసారి స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో జాతీయ కమిటీ సభ్యులు గాండ్ల రాజశేఖర్, సోషల్ మీడియా కన్వీనర్ యోగేష్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు టి. రవీందర్, జిల్లా సంయుక్త కార్యదర్శి సట్ల హనుమాన్లు, జల్దా మనోజ్, చావణ్ ప్రకాష్, జిల్లా కమిటీ సభ్యులు డిఎస్ మధు , రాహుల్, విజయ్ కుమార్, సవీణ్, చంద్ర మోహన్ గౌడ్, లక్ష్మీనారాయణ. వరప్రసాద్, రమణ, లింగేశ్వర్, నవీన్,దిగంబర్, శివకుమార్, నరేష్ గౌడ్, సట్ల శంకర్, జి అశోక్, కే రమేష్, కే రాజు, ఈ సంకేత్ వర్ధన్, కైసర్ సాజిద్, కౌసర్ జానీ, సిహెచ్ రవి, ఆడెపు శ్రీనివాస్, వడ్లకొండ నరేష్,జిల్లాలోని పలు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్

ఈ నెల 30లోగా అప్పీల్ చేసుకోవడం మర్చిపోవద్దు లేదా వారికి పెన్షన్ రాదు

ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల కోటాలో పింఛన్ తీసుకుంటున్నవారిలో అనర్హులకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే నోటీసులు జారీ చేసిన వారిలో అర్హత ఉంటే కనుక మరోసారి అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు సీఎస్ విజయానంద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పింఛన్ల పంపిణీలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని ఆదేశించారు. ఎక్కడైనా ఫిర్యాదు వస్తే జిల్లా కలెక్టర్లే బాధ్యత వహించాలని సూచించారు. పింఛన్ల పంపిణీలో జిల్లా కలెక్టర్ల నుంచి మండల స్థాయి అధికారులు అందరూ పాల్గొనాలని విజయానంద్ అన్నారు. పింఛన్ల తనిఖీలో భాగంగా 1.35 లక్షల మందికి నోటీసులు ఇచ్చామని. వీరిలో.88,319 మంది ఎంపీడీవోలకు అప్పీలు చేసుకున్నారని.. ఇంకా 23 వేల మంది అప్పీలు చేసుకోలేదన్నారు. పింఛన్లకు సంబంధించిన సమస్యల్ని నెల రోజుల్లో పరిష్కరించాలని సీఎస్ ఆదేశించారు. ఇదిలా ఉంటే దివ్యాంగుల కోటాలో పింఛన్ రద్దు నోటీసులు అందుకున్నవారు వెంటనే అప్పీల్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇలా అప్పీల్ చేసుకున్నవారందరికి సెప్టెంబర్ 1న పింఛన్ అంజేస్తారు. ఎవరైతే అప్పీల్ చేసుకోరో వారి పింఛన్ నిలిపివేస్తారు. కాబట్టి నోటీసులు అందుకున్నవారు వెంటనే దగ్గరలోని ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపాలిటీ పరిధిలో అధికారులకు అప్పీల్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ అప్పీల్ చేసుకోకపోతే సెప్టెంబర్ 1 నుంచి పించన్ నిలిపివేస్తారు. అయితే పింఛన్ రద్దు నోటీసులు అందుకున్న వారిలో ఇప్పటికి 80% అప్పీల్ చేసుకున్నారని.. మిగిలిన 20%మంది ఈ నెల 29-8-2025 సాయంత్రం లోపల అప్పీల్ చేసుకోవాలని సూచించారు. ఆఫ్‌లైన్‌లో అప్పీల్ చేసుకునేందుకు ఈ నెల 29 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది. అదే ఆన్‌లైన్‌లో అయితే ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉంది. ఈ విషయాన్ని గమనించి అప్పీల్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఏవైనా అనుమానాలు ఉంటే దగ్గరలోని సచివాలయంలో సంప్రదించాలి.. ఈ నెల 30లోగా అప్పీల్ చేసుకోవడం మర్చిపోవద్దు. పింఛన్ రద్దు నోటీసులు అందుకున్న వారు ఎంపీడీవోకు అప్పీల్ చేసుకుంటూ ఒక లేఖ రాయాలి.. ఆధార్ కార్డు, రేషన్ కార్డు కాపీలు.. పింఛన్ రద్దు/పింఛన్ మార్పు నోటీసు.. సదరం సర్టిఫికేట్ (పాతది).. సదరం సర్టిఫికేట్ (కొత్తది) ఉండాలి. అలాగే పింఛన్ లబ్ధిదారులకు సంబంధించిన ఏవైనా హాస్పిటల్ చికిత్స పొందిన/పొందుతున్న డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే కూడా సమర్పించాలి. అప్పీల్ చేసుకున్నవారికి ఎంపీడీవో Reassement కు నోటీసు జారీ చేస్తారు. అప్పుడు పింఛన్ లబ్ధిదారులు మరొకసారి Reasssement కొరకు హాజరవుతారు. అయితే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. అప్పీల్ చేసుకున్నవారికి ప్రభుత్వం సెప్టెంబర్ 1న పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఆ తర్వాతే Reassement ఉంటుందని చెబుతున్నారు. అలాగే దివ్యాంగుల కోటాలో నోటీసులు అందుకున్న వారిలో వితంతు పింఛన్‌కు అర్హులైన వారిని ఆ కేటగిరిలోకి మార్చేశారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

స్వాతంత్య్రo రాకముందే ఆణనాణెంపై మన తెలుగు భాష గొప్పతనము.

న్యూస్ ఆగస్టు 29 ఈరోజు కే జగన్నాధపురం గ్రామంలో ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీ జి సూర్య కుమారి గారి ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గిడుగు వెంకట రామమూర్తి గారి చిత్రపటానికి మేజర్ దయాన్ చంద్ గారి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు ఆ తర్వాత స్కూల్ హెడ్ మాస్టర్ స్కూల్ చైర్మన్ అంకం నాగమల్లేశ్వరరావు స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు గని శెట్టివెంకటేశ్వర్రావు (బాబీ మాస్టారు) ఉపాధ్యాయులు తెలుగు పండితులు విత్తనాల సూర్య నారాయణ మాస్టర్ కి మల్లాడి కామేశ్వరి మేడం కి ఘనంగా సన్మానించారు ఉపాధ్యాయులు మాట్లాడుతూ మన మాతృభాష తెలుగు యొక్క గొప్పతనాన్ని భావితరాలకు అందేలా వాడవాడలా వ్యాప్తి చెందేలా మనమందరము కృషి చేయాలని విద్యార్థిని విద్యార్థుల ఉద్దేశించి తెలుగు భాష అభివృద్ధికై ఉద్యమంలో కృషిచేసిన మహానుభావుల చరిత్రలో చదవాలని అన్నారు ఈ కార్యక్రమంలో లక్ష్మీ పద్మజ స్కూల్ చైర్మన్ మిద్దెనూతన రవిరాజు నల్ల పల్లం రాజు బల్లసర్వేశ్వరరావు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

స్వాతంత్య్రo రాకముందే ఆణనాణెంపై మన తెలుగు భాష గొప్పతనము.

న్యూస్ ఆగస్టు 29 ఈరోజు కే జగన్నాధపురం గ్రామంలో ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీ జి సూర్య కుమారి గారి ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గిడుగు వెంకట రామమూర్తి గారి చిత్రపటానికి మేజర్ దయాన్ చంద్ గారి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు ఆ తర్వాత స్కూల్ హెడ్ మాస్టర్ స్కూల్ చైర్మన్ అంకం నాగమల్లేశ్వరరావు స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు గని శెట్టివెంకటేశ్వర్రావు (బాబీ మాస్టారు) ఉపాధ్యాయులు తెలుగు పండితులు విత్తనాల సూర్య నారాయణ మాస్టర్ కి మల్లాడి కామేశ్వరి మేడం కి ఘనంగా సన్మానించారు ఉపాధ్యాయులు మాట్లాడుతూ మన మాతృభాష తెలుగు యొక్క గొప్పతనాన్ని భావితరాలకు అందేలా వాడవాడలా వ్యాప్తి చెందేలా మనమందరము కృషి చేయాలని విద్యార్థిని విద్యార్థుల ఉద్దేశించి తెలుగు భాష అభివృద్ధికై ఉద్యమంలో కృషిచేసిన మహానుభావుల చరిత్రలో చదవాలని అన్నారు ఈ కార్యక్రమంలో లక్ష్మీ పద్మజ స్కూల్ చైర్మన్ మిద్దెనూతన రవిరాజు నల్ల పల్లం రాజు బల్లసర్వేశ్వరరావు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

స్వాతంత్య్రo రాకముందే ఆణనాణెంపై మన తెలుగు భాష గొప్పతనము.

న్యూస్ ఆగస్టు 29 ఈరోజు కే జగన్నాధపురం గ్రామంలో ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీ జి సూర్య కుమారి గారి ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గిడుగు వెంకట రామమూర్తి గారి చిత్రపటానికి మేజర్ దయాన్ చంద్ గారి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు ఆ తర్వాత స్కూల్ హెడ్ మాస్టర్ స్కూల్ చైర్మన్ అంకం నాగమల్లేశ్వరరావు స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు గని శెట్టివెంకటేశ్వర్రావు (బాబీ మాస్టారు) ఉపాధ్యాయులు తెలుగు పండితులు విత్తనాల సూర్య నారాయణ మాస్టర్ కి మల్లాడి కామేశ్వరి మేడం కి ఘనంగా సన్మానించారు ఉపాధ్యాయులు మాట్లాడుతూ మన మాతృభాష తెలుగు యొక్క గొప్పతనాన్ని భావితరాలకు అందేలా వాడవాడలా వ్యాప్తి చెందేలా మనమందరము కృషి చేయాలని విద్యార్థిని విద్యార్థుల ఉద్దేశించి తెలుగు భాష అభివృద్ధికై ఉద్యమంలో కృషిచేసిన మహానుభావుల చరిత్రలో చదవాలని అన్నారు ఈ కార్యక్రమంలో లక్ష్మీ పద్మజ స్కూల్ చైర్మన్ మిద్దెనూతన రవిరాజు నల్ల పల్లం రాజు బల్లసర్వేశ్వరరావు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.