Saturday, 9 May 2026

Blog

E-పేపర్

భక్తులకు అన్నప్రసాదం పంపిణి జంబూ సూర్య నారాయణ

నందలూరు భక్తులకు అన్నప్రసాదం పంపిణి కార్యక్రమాన్ని సర్పంచ్ జంబు సూర్య నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. శుక్రవారం నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ లోని స్వామి వివేకానంద నగర్ లో మేస్త్రి గోపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక ఉత్సవాల్లో భాగంగా సర్పంచ్ జంబు సూర్యనారాయణ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సర్పంచ్ సూర్యనారాయణ ను ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా సత్కరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు నాగేంద్ర ఆదినారాయణ.మరియు అరిగే హరిబాబు ధనుంజయ నాయుడు హనుమంతు పవన్ కుమార్ జయరాం రెడ్డి బలరాం మెహర్ శివ నరసింహులు శ్రీనివాసులు తెరవాకులు పెద్ద ఎత్తున ప్రజలు భక్తులు పాల్గొన్నారు.

తిరుపతి

ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి పట్టణంలోని సిద్దార్థ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు గిడుగు రామమూర్తి పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.తెలుగు భాష ఎంతో మధురమైనది అని దేశంలో అత్యధికులు మాట్లాడే భాషలలో ఒకటని,తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన గిడుగు రామమూర్తి పంతులు జన్మదినం సందర్భంగా తెలుగుభాషా దినోత్సవం జరుపుకుంటామని,మన తెలుగు భాష క్రీ.శ 575 లో రేనాటి చోళరాజులు తొలి తెలుగు శాసనాన్ని వేయించినట్లు ఆదారాలు తెలియజేస్తున్నాయి అని తెలుగు భాష పురాతనమైనది అంతటి పురాతన భాష మన మాతృభాష అని దానికి మనం గౌరవించాలని విద్యార్థులకు తెలియజేశారు.పర భాషను అవసరం మేరకు ఉపయోగించాలని ,మాతృభాషను మరవకూడదని సూచించారు.మనం ఎక్కడ ఉన్నా మన కన్న తల్లిని ఉన్న ఊరిని మాతృభాషను మరవకూడదని తెలిపారు,ఆ తరువాత విద్యార్థుల కు వ్యాసరచన,వక్తృత్వ పోటీ లను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఘనంగా నల్లగొండ్ల దేవస్థానం నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం..!విశిష్ట అతిథులుగా హాజరైన, ఎమ్మెల్యే కాకర్ల సురేష్, సినీ హీరో గుత్తికొండ కార్తికేయ..!

దేవస్థానం చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన లెక్కల కాంత రెడ్డి, తొమ్మిది మంది పాలకమండలి సభ్యులు..! ప్రసిద్ధి కలిగిన ఆలయాన్ని, అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం.. ముఖ్యఅతిథితుల సందేశం..! వింజమూరు పున్నమి న్యూస్ ప్రతినిధి : ఆగస్టు 29 //// వింజమూరు మండలం నల్ల గొండ్ల గ్రామంలో నీలగిరి పర్వతంపై వేంచేసి యున్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి, నూతన చైర్మన్ మరియు పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం, ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధులుగా ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ సినిమా హీరో గుత్తికొండ కార్తికేయ గారు హాజరయ్యారు. మాజీ చైర్మన్ లెక్కల చిన్న కొండారెడ్డి నివాసం వద్ద అతిధులకు ఘన స్వాగతం పలికారు. చైర్మన్ నివాసం నుండి ముఖ్య అతిథులు పాలక మండల సభ్యులు ఆలయం వరకు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వరకు భాజ భజంత్రీలు, మేళ తాళాలు, బాణాచంచాలు లతో ఊరేగింపుగా వెళ్లారు. ముందుగా క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి, అధినాయకుడు గణపతికి, బోలా శంకరుడు శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం గర్భగుడి వెలుపల ప్రాంగణంలో ఆలయ ఈవో శాంతయ్య ఆలయ చైర్మన్ గా లెక్కల కాంతారెడ్డి, చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అక్కడే పాలక మండలి సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశిష్ట అతిధులు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి, లెక్కల చిన్న కొండారెడ్డి కుటుంబం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఈ ఆలయం అభివృద్ధి చెంది ఈ ప్రాంతానికి తలమానికం అవుతుందని చెప్పారు. అంతకుముందు పనిచేసిన చైర్మన్లు పాలకమండలి సభ్యులు ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అభినందించారు. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి నా సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని హామీ ఇచ్చారు. సినీ హీరో కార్తికేయ మాట్లాడుతూ, మా అత్తగారైన లెక్కల లక్ష్మీకాంతరెడ్డి, ఆలయ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేయడం అందుకు నేను రావడం ఆనందంగా ఉందన్నారు. మామగారు ఎల్ సి కొండారెడ్డి ఆలయం గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటారని, పెళ్లి సమయంలో వచ్చానని, ఇది రెండో పర్యాయం రావడం అని తెలిపారు. తిరుపతి,శ్రీశైలం ,అన్నవరం, తదితర ఆలయాల చేరువలో లక్ష్మీ నరసింహ స్వామి వెలుగొందాలని ఆకాంక్షించారు. అంతకుముందు లెక్కల చిన కొండారెడ్డి మాట్లాడుతూ పాలకమండలి సభ్యులలో ఎక్కువ మంది మహిళలు ఉండడం మహిళా చైర్మన్ ఉండడం విశేషం అన్నారు. ఆలయ అభివృద్ధికి శక్తివంతన లేకుండా కృషి చేస్తానని తెలియజేశారు. అనంతరం వక్తలను, పాలక మండలి సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలోమాజీ ఎమ్మెల్యే కంభం విజయరామి రెడ్డి, పోలీస్ హౌసింగ్ మాజీ చైర్మన్ మెట్టుకూరి చిరంజీవి రెడ్డి, మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, ఉదయగిరి బిజెపి ఇంచార్జ్ కదిరి రంగారావు,పొలిటికల్ మేనేజర్ మాలే పార్టీ చైతన్య, ఎంపీటీసీ సభ్యులు సర్పంచ్ అన్నపురెడ్డి ప్రమీల, మాజీ చైర్మన్లు భోగి రెడ్డి నాగిరెడ్డి, అన్నపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, లెక్కల మాలకొండ రెడ్డి, అన్నపరెడ్డి మురళీధర్ రెడ్డి, అన్నపురెడ్డి మోహన్ రెడ్డి, రూపునేని వెంకటేశ్వర్లు నాయుడు, లెక్కల చిన్న కొండారెడ్డి,లెక్కల రాజశేఖర్ రెడ్డి, బొల్లా వెంకటకృష్ణ, ఆకిలి రవి ప్రసాద్, అంకినపల్లి నరసింహులు, మీసాల నరసమ్మ, భోగి రెడ్డి శార్వాణి, చంచల సుభాషిని, పొన్నూరు అంకమ్మ, గ్రామ పెద్దలు నాయకులు, ఆయనకినపల్లి ఓబుల్ రెడ్డి, అంకినపల్లి శివశంకర్ రెడ్డి, ఎంపీపీ ఇనగనూరి మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఆనంగి రమణయ్య, సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, జడ్పిటిసి సభ్యులు గణపం బాలకృష్ణారెడ్డి,సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి, జూపల్లి రాజారావు, కటకం ప్రసన్నకుమార్,చల్లా శ్రీనివాసుల యాదవ్, కొండారెడ్డి, రూపు నేని రత్నం, గాలి రామ్మోహన్ నాయుడు, గాలి నరసప నాయుడు, ఉదయగిరి మండల కన్వీనర్ సిహెచ్ బయన్న, పాములపాటి మాల్యాద్రి, మద్దూరి రాజగోపాల్ రెడ్డి, పోలనేని చంద్రబాబు నాయుడు,ఆలయ ఈవో శాంతయ్య, మాజీ జెడ్పిటిసి సభ్యులు పులిచెర్ల వెంకటనారాయణ రెడ్డి, అన్నపురెడ్డి తిరుపాలు రెడ్డి, అన్నపురెడ్డి ధర్మారెడ్డి, బొల్లా సుబ్రహ్మణ్యం, బొమ్ము పెంచల రెడ్డి, బొమ్ము నరసింహారెడ్డి, వీరం రెడ్డి శ్రీనివాసులురెడ్డి, రూపినేని అశోక్, భోగి రెడ్డి ఓబుల్ రెడ్డి, లెక్కల మురళి తదితరులు ఉన్నారు.

కామారెడ్డి

హైవేలో వాహన దారులకు పుడ్ పంపిణీ

కామారెడ్డి పున్నమి ప్రతినిధి ఆగస్టు 29 కామారెడ్డి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నందున, రైలు, బస్సు సౌకర్యం ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జి.ఆర్ కాలనీలో ఇండ్లు నీట మునిగాయి. వరద ఉధృతికీ దాదాపు 10 కార్లు వరదలో కొట్టుకుపోయాయి. చరిత్రలో ఇలాంటి వానను ఎప్పుడూ చూళ్ళేదు అని కామారెడ్డి జిల్లా వాసులు తెలిపారు. కుంటలు, చెరువులు, పొంగిపోయాయి. రోడ్లు దాదాపుగా అంతటా పాడినాయి. కామారెడ్డికి రాకపోకలు నిలిపోయాయి. అన్ని రకాల వసతులు కోల్పోయిన వారికి కామారెడ్డి RSS స్వయం సేవకులు సకాలంలో స్పందించి ఐదారు బృందాలుగా ఏర్పడి రిస్క్ టీంకు సహకరించి ఎందరినో నీటి నుండి సురక్షితంగా రక్షించారు. బాధితులకు పండ్లు, ఆహారం అందించారు. జాతీయ రోడ్ పై వేళ్ళు వాహన దాడులకు ఆహారం నీరు అందించి మానవతను చాటారు.

కాకినాడ

పాదగయా క్షేత్రం దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ

పిఠాపురం : ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ శుక్రవారం పాదగయా క్షేత్రంకు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి, స్వయంభూ శ్రీ దత్తాత్రేయ స్వామివారి, పదవ శక్తి పీఠం శ్రీ పురుహుతికా అమ్మవార్ల దర్శనం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద ఆశీర్వచనం అనంతరం, దేవస్ధాన సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ వారికి శేష వస్త్రాలు, స్వామి వారి చిత్ర పటం, ప్రసాదం అందజేశారు. ఈకార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ బి.వీర భద్రరావు, ఆర్.ఆర్.డి.ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ దత్తత్రేయ, పిఠాపురం సిఐ జి. శ్రీనివాస్, ఎస్ఐ వి.మణికుమార్ పాల్గొన్నారు.

E-పేపర్

తెలుగు వెలుగుల వైభవం – కవిత కళాత్మక భవిత

ఆగష్టు 29 తెలుగు భాషా దినోత్సవం (తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతి) సందర్భంగా రచించబడిన కవిత. తెలుగు వెలుగుల వైభవం – కవిత కళాత్మక భవిత రచన: డాక్టర్ బద్రి. పీర్ కుమార్ కందుకూరి విశిష్ట పురస్కార గ్రహీత అర్థశాస్త్ర అధ్యాపకులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల గూడూరు, తె – తెలుగు పలుకుల తెల్లదనం భావాలంకరణకు మూలధనం లు – లుంబిని లో జన్మించి ధ్యానం ద్వారా పొందిన బుద్ధుని జ్ఞానం గ గు – గురజాడ అడుగుజాడల్లో మన సాహిత్యం సుసంపన్నం వె – వెలకట్టలేని అనుబంధ విలువల వరసల సరాగాలు లు – లుకలుకలు వికవికలు పకపకలు తేనె చినుకుల సవ్వడలు గు – గుణాత్మక దృశ్యాంశాలు మనో నేత్ర మార్గదర్శకాలు ల – లయబద్ధంగా పదాక్షరాల ఉచ్చారణ పసిడి కాంతుల మధురిమలు. వై – వైవిధ్యమైన భావ ప్రకంపనలు వ్యవహారిక విశ్లేషణలు భ – భజన గీతాల బృంద విన్యాసాల చిందులే ఉత్సవాలు వం – వందన చందనాల అభినందన వేదికలు సమాజ సౌభాగ్యాలు. క – కమనీయం కవితాత్మ కథనంపై ప్రశంసలు వి – విజయతలంపు పులకించిన స్వాగత గీతాలు త – తరతరాల మానసోల్లాస చారిత్రక స్మృతులు. క – కళలు కలల కళాకారుల ఆత్మీయ సిరులు ళా – అలాంటివి మానసిక వికాసానికి ఆసనాలు త్మ- తమ ఇష్టాఇష్టాల విశ్లేషణ రూపాలు క – కవుల కావ్య దీపాల అపురూప కనువిందులు భ – భగవంతున్ని ప్రసన్నం చేసుకునే శక్తి కొలది వి – విధాతరాతను మార్చుకునే నేర్పు కలది త – తన్మయత్వమే ప్రయత్నంగా సాగే ప్రవాహమిది. ఈ కవిత కుటుంబ పునాదులకు పటుత్వాన్నిచ్చే ఆప్యాయత ఇదే తెలుగు వెలుగుల వైభవోత్సవం శ్రోత సంతృప్త హృదయలయల సంభవం.

కామారెడ్డి

కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

కామారెడ్డి పున్నమి ప్రతినిధి ఆగస్టు 29 *ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం* =========================== హాకీ మాంత్రికుడు శ్రీ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లాలో గల ఇందిరాగాంధీ స్టేడియంలో S.G.F ఆధ్వర్యంలో 29-8-25 న ఘనంగా క్రీడా దినోత్సవం జరిగింది. కామారెడ్డి జిల్లాలో డీ.ఈ.వో గారు హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ చిత్ర పటానికి పూల మాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. యస్.జీ.ఎఫ్ బాధ్యులు శీ నీలం లింగం గారు, ఫిజికల్ డైరెక్టర్లు రంగా వెంకటేశ్వర్ గారు, మోహన్ రెడ్డి గారు, మధుసూదన్ గారు, భాస్కర్ రెడ్డి గారు మొదలైన వారు పాల్గొన్నారు. డీ.ఈ.వో గారు మాట్లాడుతూ వ్యక్తి నిజ జీవితంలో క్రీడలు అత్యవసరమని , పాఠశాలల్లో విద్యార్థులకు తప్పనిసరిగా ఆటలు ఆడించాలని , విద్యార్థులను క్రీడలలో జాతీయ స్థాయికి తీసుకురావాలని తెలిపారు. నీలం లింగం గారు మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలన్న, మానసికంగా దృఢంగా ఉండాలన్నా ఆటలనీవి తప్పని సరి అని ఈ విషయంలో ప్రతి వ్యాయామ ఉపాధ్యాయులు పాఠశాలల్లో ప్రత్యేక శ్రద్ధ చూపాలన తెలిపారు. అనంతరం స్టేడియంలో కబడీ, ఖో.ఖో , వాలీ బాల్ , అథెలిటిక్స్ మొదలైనవి ఆడించడం జరిగింది.

తెలంగాణ

నల్గొండ కొత్త కలెక్టర్ కార్యాలయ భవనం గ్రౌండ్ ఫ్లోర్ ను డిసెంబర్ లోగా పూర్తి చేయాలన్న : మంత్రి

నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ కొత్త కలెక్టర్ కార్యాలయ భవనం గ్రౌండ్ ఫ్లోర్ డిసెంబర్ లోగా, మొత్తం భవనాన్ని వచ్చే సంవత్సరం జూన్ 2 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ అండ్ బి అధికారులు, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. 82 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తుల తో నిర్మిస్తున్న ఈ భవనంలో పూర్తిగా రెవెన్యూ విభాగం, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ల చాంబర్లు,మంత్రి చాంబర్, ఉండేలా ఏర్పాటు చేయాలని, పాత కలెక్టర్ కార్యాలయంలో పూర్తిగా జిల్లాలోని అన్ని శాఖల అధిపతుల కార్యాలయాలు ఏర్పాటు చేయాలని, ఇందుకుగాను పాత కలెక్టర్ కార్యాలయాన్ని పూర్తిగా ఆధునికరించాలని ఆదేశాలు జారీ చేశారు. కొత్త కలెక్టర్ కార్యాలయంలో మీటింగ్ హాల్ లో పాల్ సీలింగ్ ఎల్ఈడి స్క్రీన్లు,అన్ని సౌకర్యాలతో నిర్మించాలని చెప్పారు. కొత్త కలెక్టర్ కార్యాల భవన నిర్మాణ అంచనాలను ఎట్టి పరిస్థితులలో మార్చకూడదని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. గ్రౌండ్ ఫ్లోర్ ను డిసెంబర్ నాటికి పూర్తి చేసి ఇవ్వాలని, కార్యలయ భవనం మొత్తాన్ని జూన్ 2 నాటికి పూర్తి చేసి అప్పగించాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. భవన నిర్మాణ పనులు నాణ్యత పై ప్రత్యేక దృష్టి నిలపాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కోరారు. నల్గొండ కొత్త కలెక్టర్ కార్యాలయం నిర్మాణం జిల్లాలలో ఉన్న సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవనాల కన్నా బాగుండాలని అన్నారు. ఈ కార్యాలయం మొత్తం పూర్తి అయితే బయట ఉన్న డిఈఓ,డి ఎం హెచ్ ఓ కార్యాలయాలను ఇక్కడికి తీసుకురావడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి బ్రహ్మంగారి గుట్ట, లతీఫ్ సాబ్ దర్గా గుట్టలపై నిర్మిస్తున్న ఘాట్ రోడ్ల నిర్మాణ పనులపై ఆర్ అండ్ బి అధికారులతో సమీక్షించారు. రెండు గుట్టలపై నిర్మిస్తున్న ఘాట్ రోడ్లకు సంబంధించి ఇప్పటివరకు ఐదు కిలోమీటర్ల రోడ్డు పూర్తయిందని ఆర్ అండ్ బి అధికారులు మంత్రికి తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఘాట్ రోడ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు.

జనగాం

జడ్‌.పి.హెచ్‌.ఎస్‌. ఏడునూతుల – జాతీయ క్రీడా దినోత్సవం & తెలుగు భాషా దినోత్సవం

ఆగస్టు 29, పున్నమి ప్రతినిధి, జనగాం: జడ్‌.పి.హెచ్‌.ఎస్‌. ఏడునూతుల పాఠశాలలో విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, భాషా గౌరవం పెంపొందించేందుకు జాతీయ క్రీడా దినోత్సవం మరియు తెలుగు భాషా దినోత్సవంలను ఘనంగా నిర్వహించారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా జరిపిన జాతీయ క్రీడా దినోత్సవానికి ఫిజికల్ డైరెక్టర్ శ్రీమతి జి. రజిత ఆధ్వర్యం వహించారు. క్రీడలు క్రమశిక్షణ, ఆరోగ్యం, ఐక్యతకు ప్రతీకలని ఆమె వివరించారు. ప్రధానోపాధ్యాయులు శ్రీ నారబోయిన యాకయ్య విద్యార్థులకు ప్రసంగిస్తూ ధ్యాన్‌చంద్ జీవితం అంకితభావానికి, పట్టుదలకు చిహ్నమని, అదే ఆత్మబలం విద్యార్థులు సొంతం చేసుకోవాలని ప్రేరేపించారు. అదే విధంగా తెలుగు భాషా దినోత్సవంను తెలుగు ఉపాధ్యాయురాలు శ్రీమతి ఎం. రజిత ఆధ్వర్యంలో జరిపారు. ఆమె ప్రసంగిస్తూ: “తెలుగు భాష మన ఆత్మ, మన గౌరవం, మన సంస్కృతి. ఈ భాషను సజీవంగా ఉంచడం మన అందరి బాధ్యత” అని విద్యార్థులకు ప్రేరణనిచ్చారు. ఈ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు కమల్‌కుమార్, రాంబాబు, సోమేశ్వర్, భాస్కర్, యాదగిరి, మమత, విజయ, ఈర్య, కవిత పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు

క్రైమ్

సుప్రీంకోర్టుకు నటుడు విజయ్ టీవీకే పార్టీ

ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ తమిళనాడు పరువు హత్యలపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు వేసింది. ఇటీవల తమిళనాడులో ఓ దళిత సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు గురైన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టీవీకే పార్టీ జనరల్ సెక్రెటరీ అధవ్ అర్జున పిటిషనన్ను కోర్టులో సమర్పించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.