నంద్యాల పట్టణంలోని కాపురాక్స్ కార్యాలయం నందు మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో అభిమానుల సందడి నెలకొంది. కేక్ కట్ చేసి చిరంజీవి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి ఎంతోమంది అభిమానులకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. చిరంజీవి సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యారని పేర్కొన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.చిరంజీవి నటన, సేవా కార్యక్రమాలు, అభిమానుల పట్ల చూపించే ఆప్యాయత తమను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని అభిమానులు తెలిపారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కె.ఆర్. సభ్యులు కామిని, మల్లికార్జున, చెన్నంశెట్టి శ్రీనివాసులు, సింహాద్రి, సురేష్‌బాబు, శ్రీహరి, శ్రీనివాసులు, మురళీమోహన్, సాయికుమార్, రాము, లింగం, మహేష్, సుబ్బరాయుడు, మురళి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. వేడుకల్లో అభిమానులు ఉత్సాహంగా పాల్గొని చిరంజీవి జన్మదిన వేడుకలను విజయవంతం చేశారు.

ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు నంద్యాలలో అభిమానుల సందడి