డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో నిర్వహించిన “స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర” కార్యక్రమంలో పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులతో కలిసి స్వచ్ఛత అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రజలు, విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛమైన గ్రామాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. “స్వచ్ఛత మన బాధ్యత–పరిశుభ్రత మన కర్తవ్యం–అభివృద్ధి మన లక్ష్యం” అనే స్ఫూర్తితో ముందుకు సాగుతామని తెలిపారు.


