Sunday, 23 August 2026
  • Home  
  • ఉమ్మడి గోదావరి జిల్లాల క్యాన్సర్ రోగులకు తీపి కబురు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఉమ్మడి గోదావరి జిల్లాల క్యాన్సర్ రోగులకు తీపి కబురు

కాకినాడ: ఉమ్మడి గోదావరి జిల్లాల క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు కీలక ముందడుగు పడింది. రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు ప్రత్యేక చొరవతో కాకినాడ జీజీహెచ్‌లో అధునాతన క్యాన్సర్ చికిత్స కేంద్రం ఏర్పాటు కానుంది. ఇందుకోసం ఓఎన్జీసీ సీఎస్‌ఆర్ నిధుల నుంచి సుమారు రూ.16 కోట్లు కేటాయించనుంది. హై ఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్, సీటీ సిమ్యులేటర్ వంటి ఆధునిక పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. క్యాన్సర్ చికిత్స కోసం విశాఖపట్నం, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గనుంది. ఆగస్టు 3న కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీని కలిసి ఎంపీ వినతిపత్రం అందజేయగా, ఆగస్టు 7న ఓఎన్జీసీ ఒప్పంద పత్రం పంపింది. ఆగస్టు 12న జీజీహెచ్ అధికారులు ఒప్పందంపై సంతకం చేశారు. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే వేలాది మంది రోగులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.