Sunday, 23 August 2026
  • Home  
  • పి.గన్నవరంలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పి.గన్నవరంలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా : 156 అడుగుల భారీ ఫ్లెక్సీతో డొక్కా సీతమ్మ వారధిపై అభిమానుల ర్యాలీ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ రాష్ట్ర కో-కన్వీనర్ కందాల చంటి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చిరంజీవి సినీ ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా ఆయన నటించిన 156 సినిమాల చిత్రాలతో 156 అడుగుల భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. లంకల గన్నవరం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం నుంచి పి.గన్నవరం త్రీ రోడ్ జంక్షన్ వరకు అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచే కందాల చంటికి చిరంజీవిపై ఉన్న అభిమానం సేవా కార్యక్రమాల రూపంలో కొనసాగడం అభినందనీయమన్నారు. చిరంజీవి సినీ రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. చిరంజీవి స్ఫూర్తితో అభిమానులు ప్రతి ఏడాది రక్తదానం, అన్నదానం, పేదలకు సహాయం, వస్త్రాలు, దుప్పట్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఆయన క్రమశిక్షణ, కష్టపడే తత్వం, సేవా దృక్పథం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో మెగా యూత్ ఫోర్స్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ సుదా చిన్న, జాయింట్ కన్వీనర్ కోళ్ల బాబి, నగరం ఏఎంసీ చైర్మన్ పెనుమాల లక్ష్మి, గుండాబత్తుల తాతాజీ, సిరిగినీడి వెంకటేశ్వరరావు, వులిశెట్టి లక్ష్మణరావు, దైవాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. Uploaded Video:

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా :
156 అడుగుల భారీ ఫ్లెక్సీతో డొక్కా సీతమ్మ వారధిపై అభిమానుల ర్యాలీ
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ రాష్ట్ర కో-కన్వీనర్ కందాల చంటి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
చిరంజీవి సినీ ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా ఆయన నటించిన 156 సినిమాల చిత్రాలతో 156 అడుగుల భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. లంకల గన్నవరం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం నుంచి పి.గన్నవరం త్రీ రోడ్ జంక్షన్ వరకు అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచే కందాల చంటికి చిరంజీవిపై ఉన్న అభిమానం సేవా కార్యక్రమాల రూపంలో కొనసాగడం అభినందనీయమన్నారు. చిరంజీవి సినీ రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు.
చిరంజీవి స్ఫూర్తితో అభిమానులు ప్రతి ఏడాది రక్తదానం, అన్నదానం, పేదలకు సహాయం, వస్త్రాలు, దుప్పట్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఆయన క్రమశిక్షణ, కష్టపడే తత్వం, సేవా దృక్పథం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు.
ఈ కార్యక్రమంలో మెగా యూత్ ఫోర్స్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ సుదా చిన్న, జాయింట్ కన్వీనర్ కోళ్ల బాబి, నగరం ఏఎంసీ చైర్మన్ పెనుమాల లక్ష్మి, గుండాబత్తుల తాతాజీ, సిరిగినీడి వెంకటేశ్వరరావు, వులిశెట్టి లక్ష్మణరావు, దైవాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.