డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా :
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారం బీసీలను మభ్యపెట్టేందుకేనని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ విమర్శించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలో ఆయన మాట్లాడుతూ, 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జీవో నెం.176 ద్వారా స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. అయితే టీడీపీ నేతల ద్వారా కోర్టులో పిటిషన్లు వేయించి ఆ రిజర్వేషన్లను అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుదేనని ఆరోపించారు.
వైసీపీ పాలనలో మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీలు, కార్పొరేషన్లలో బీసీలకు పెద్దఎత్తున రాజకీయ ప్రాధాన్యత కల్పించామని తెలిపారు. ఎన్నికల సమయంలో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం, 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని విమర్శించారు. బీసీలకు మేలు జరిగితే వైఎస్ జగన్ అందరికంటే ఎక్కువగా సంతోషిస్తారని అన్నారు. కూటమి ప్రభుత్వ మోసాలను బీసీ సమాజం గుర్తిస్తుందని, తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని పాటి శివకుమార్ హెచ్చరించారు.

బీసీ రిజర్వేషన్ల పేరుతో కూటమి ప్రభుత్వం మోసం చేస్తోంది: పాటి శివకుమార్
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారం బీసీలను మభ్యపెట్టేందుకేనని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ విమర్శించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలో ఆయన మాట్లాడుతూ, 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జీవో నెం.176 ద్వారా స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. అయితే టీడీపీ నేతల ద్వారా కోర్టులో పిటిషన్లు వేయించి ఆ రిజర్వేషన్లను అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుదేనని ఆరోపించారు. వైసీపీ పాలనలో మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీలు, కార్పొరేషన్లలో బీసీలకు పెద్దఎత్తున రాజకీయ ప్రాధాన్యత కల్పించామని తెలిపారు. ఎన్నికల సమయంలో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం, 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని విమర్శించారు. బీసీలకు మేలు జరిగితే వైఎస్ జగన్ అందరికంటే ఎక్కువగా సంతోషిస్తారని అన్నారు. కూటమి ప్రభుత్వ మోసాలను బీసీ సమాజం గుర్తిస్తుందని, తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని పాటి శివకుమార్ హెచ్చరించారు.

