డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా :
దిండి–చించినాడ మధ్య వశిష్ట నదిపై ఉన్న కీలక వారధి మరమ్మతులు పూర్తయ్యాయని అధికారులు ప్రకటించి భారీ వాహనాలకు అనుమతులు ఇచ్చారు. అయితే వంతెనపై పూర్తిస్థాయి బీటీ రోడ్డు నిర్మించకపోవడంపై వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుంతలు, జాయింట్ల వద్ద ఎలాస్టోమెరిక్ షీట్లతో తాత్కాలిక ఏర్పాట్లు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది రూపాయల పనుల అనంతరం కూడా ప్రయాణికులకు కుదుపుల ప్రయాణమే మిగిలిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వాహనాల రాకపోకలతో ఈ తాత్కాలిక ఏర్పాట్లు ఎంతకాలం మన్నుతాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వంతెనపై వెంటనే నాణ్యమైన తారు రహదారి నిర్మించి, పనుల నాణ్యతను ఉన్నతాధికారులు పరిశీలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు.



