భారతదేశంలో కృత్రిమ మేధ (AI) విస్తరిస్తున్న నేపథ్యంలో, టెక్నాలజీ కంటే లక్షలాది మంది ఉద్యోగులకు తిరిగి శిక్షణ (Reskilling) ఇవ్వడమే అసలైన సవాల్ అని ఐబీఎం ఇండియా చీఫ్ సందీప్ పటేల్ పేర్కొన్నారు.
సమన్వయం: భారత్ ఏఐ రంగంలో అగ్రగామిగా నిలవాలంటే ప్రభుత్వం, కంపెనీలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలి.
యువశక్తి:- దేశ జనాభాలో 50% కంటే ఎక్కువ మంది 30 ఏళ్ల లోపు వారే. ఏఐ వేగానికి తగ్గట్టు వీరికి నైపుణ్యాలు అందిస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ శ్రామిక శక్తిగా భారత్ ఎదుగుతుంది.
ఉపాధిపై ప్రభావం :- జనరేటివ్ ఏఐ టూల్స్ కోడింగ్, డేటా అనలిటిక్స్ వంటి పనులను వేగంగా చేస్తున్నాయి. దీనివల్ల ఎంట్రీ లెవెల్ సిబ్బంది విధుల్లో మార్పులు వస్తున్నాయి.
నియామకాలు :- రాబోయే రోజుల్లో కంపెనీల నియామక ప్రక్రియలు పూర్తిగా మారనున్నాయి.


