నంద్యాల: స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా స్వర్ణాంధ్ర సాధనకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టరేట్ ఆవరణలో శ్రమదానం చేపట్టారు.ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, కాటన్ సంచులను ఉపయోగించాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీఆర్వో రామునాయక్ తదితరులు శ్రమదానంలో పాల్గొని పిచ్చిమొక్కలు, వ్యర్థాలను తొలగించారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు.

స్వచ్ఛతకు ప్రజల సహకారం : జిల్లా కలెక్టర్