పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై రాజకీయ పార్టీలతో మున్సిపల్ కమిషనర్ సమావేశం
నంద్యాల: నంద్యాల పురపాలక పరిధిలోని 52 వార్డులకు సంబంధించి 217 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాపై శనివారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిద్ధం చేసిన ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే శనివారం సాయంత్రంలోగా లిఖితపూర్వకంగా అందజేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. పరిశీలన అనంతరం తుది జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు









