Monday, 21 September 2026

Tag: Mumcipility

నంద్యాల

ప్రతి సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ‘ప్రజావేదిక’

నంద్యాల:ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, సత్వరమే పరిష్కరించేందుకు మున్సిపల్ కార్యాలయంలో ప్రతి సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ కె. కళ్యాణి బాయ్ తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రోడ్లు, పన్నులకు సంబంధించిన సమస్యలపై ప్రజలు లిఖితపూర్వక ఫిర్యాదులు అందజేసి ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్జీలను ఆలస్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరిస్తామని ఆమె పేర్కొన్నారు.

నంద్యాల

స్వచ్ఛ నంద్యాలకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు మంత్రి ఫరూక్‌ పిలుపు

నంద్యాల : నూనెపల్లిలోని పురపాలక ఉన్నత పాఠశాల ఆవరణలో నంద్యాల పురపాలక సంఘం, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ నంద్యాల’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు స్వచ్ఛత, మొక్కల పెంపకంపై అవగాహన కల్పించాలని, పరిశుభ్రమైన, పచ్చని నంద్యాల నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఎమ్ ఈ నాగభూషణం రెడ్డి. మెప్మా పీడీ వెంకట దాసు, మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు విక్రమ్. శభరిష్. శానిటేషన్ సూపరైజర్ లక్ష్మినారాయణ. శివ ప్రసాద్ రెడ్డి. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

నంద్యాల

స్వచ్ఛతకు ప్రజల సహకారం : జిల్లా కలెక్టర్

నంద్యాల: స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా స్వర్ణాంధ్ర సాధనకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టరేట్ ఆవరణలో శ్రమదానం చేపట్టారు.ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి, కాటన్‌ సంచులను ఉపయోగించాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్, డీఆర్వో రామునాయక్‌ తదితరులు శ్రమదానంలో పాల్గొని పిచ్చిమొక్కలు, వ్యర్థాలను తొలగించారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు.

నంద్యాల

పార్కుకు సిమెంట్ బెంచీల వితరణ

నంద్యాల పద్మావతి నగర్ పార్కులో గురువారం సేవా కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి సహకారంతో రూ.20 వేల విలువైన ఐదు సిమెంట్ బెంచీలను పార్కుకు వితరణ చేశారు. పార్కుకు వచ్చే ప్రజలు, వృద్ధులు సేదతీరేందుకు బెంచీలు ఉపయోగపడనున్నాయి.ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పాల్గొన్న వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సుధా ప్రసాద్ రెడ్డి, పీడీజీలు కల్లూరి రామలింగారెడ్డి, శ్రీరామ్మూర్తి, అసిస్టెంట్ గవర్నర్ దండే దస్తగిరి, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నయన ఐ కేర్, క్లియర్ వ్యూ లాసిక్ సెంటర్ ప్రతినిధులు సహకరించారు.

నంద్యాల

పార్కుకు సిమెంట్ బెంచీల వితరణ

నంద్యాల పద్మావతి నగర్ పార్కులో గురువారం సేవా కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి సహకారంతో రూ.20 వేల విలువైన ఐదు సిమెంట్ బెంచీలను పార్కుకు వితరణ చేశారు. పార్కుకు వచ్చే ప్రజలు, వృద్ధులు సేదతీరేందుకు బెంచీలు ఉపయోగపడనున్నాయి.ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పాల్గొన్న వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సుధా ప్రసాద్ రెడ్డి, పీడీజీలు కల్లూరి రామలింగారెడ్డి, శ్రీరామ్మూర్తి, అసిస్టెంట్ గవర్నర్ దండే దస్తగిరి, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నయన ఐ కేర్, క్లియర్ వ్యూ లాసిక్ సెంటర్ ప్రతినిధులు సహకరించారు.

నంద్యాల

టిడ్కో గృహాలను పరిశీలించిన కలెక్టర్ : రాజకుమారి గనియా

నంద్యాల : ఎస్‌ఆర్‌బీసీ కాలనీలోని టిడ్కో గృహాలను జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మున్సిపల్ కమిషనర్ శేషన్న, టిడ్కో, మున్సిపల్ అధికారులతో కలిసి పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, రహదారులు తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించారు.టిడ్కో గృహాల పనులను త్వరితగతిన పూర్తి చేసి, నిర్ణీత గడువులోగా లబ్ధిదారులకు ఇళ్లు అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కాలనీ ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు.

నంద్యాల

శకటాల ప్రదర్శనలో పురపాలక శాఖకు ప్రథమ బహుమతి

నంద్యాల : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన వివిధ శాఖల శకటాల ప్రదర్శనలో నంద్యాల పురపాలక సంఘం శకటం ప్రథమ బహుమతి సాధించింది. మొత్తం 20 శాఖల శకటాలు ప్రదర్శనలో పాల్గొనగా, వ్యవసాయ శాఖతో పాటు పురపాలక శాఖ శకటం ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న మాట్లాడుతూ, పురపాలక సిబ్బంది సమష్టి కృషి, అంకితభావంతోనే ఈ విజయం సాధ్యమైందన్నారు. శకటం రూపకల్పన నుంచి ప్రదర్శన వరకు సిబ్బంది ఉత్సాహంగా పనిచేశారని అభినందించారు. ప్రథమ బహుమతి సాధించిన పురపాలక సిబ్బందిని అధికారులు, ప్రజలు అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నంద్యాల

నంద్యాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు

నంద్యాల పురపాలక సంఘ కార్యాలయంలో ఈ నెల 15న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న తెలిపారు. శనివారం ఉదయం 7.30 గంటలకు జరిగే వేడుకల్లో జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ జి. రాజకుమారి గణియా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.వేడుకలకు అధికారులు, ప్రజాప్రతినిధులు, పురపాలక సిబ్బంది, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కమిషనర్ కోరారు. కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

నంద్యాల

ఆగస్టు 15న నంద్యాలలో మాంసం దుకాణాలు బంద్

నంద్యాల: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న నంద్యాల పట్టణంలోని అన్ని మటన్, చికెన్ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న ఆదేశించారు.జాతీయ పండుగను పురస్కరించుకుని మాంసం విక్రయాలు నిర్వహించకుండా వ్యాపారులు మున్సిపాలిటీ నిబంధనలు పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలు తెరిస్తే మున్సిపల్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయడంతో పాటు భారీగా అపరాధ రుసుం విధిస్తామని హెచ్చరించారు.దుకాణాల యజమానులు ఆగస్టు 15న పూర్తిగా దుకాణాలు మూసివేసి మున్సిపాలిటీకి సహకరించాలని కమిషనర్ కోరారు. నిబంధనల అమలును మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షిస్తారని తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.