నంద్యాల: నంద్యాల పురపాలక సంఘ పరిధిలోని ప్రస్తుతం ఉన్న 42 వార్డులను 52 వార్డులుగా పునర్విభజిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఈ పునర్విభజన ప్రక్రియపై శనివారం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో కలెక్టర్ జి. రాజకుమారి గారితో ఆయన చర్చించారు.సి అండ్ డిఎమ్‌ఎ సర్క్యులర్, హైకోర్టు ఉత్తర్వుల మేరకు వార్డుల పునర్విభజనకు కొత్త షెడ్యూల్ జారీ చేశామని తెలిపారు. ప్రతిపాదిత వార్డుల సరిహద్దులపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను సెప్టెంబర్ 5 నుంచి 11వ తేదీ వరకు (7 రోజులు) స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.ప్రజల సౌకర్యార్థం ప్రతిపాదిత వార్డుల నోటిఫికేషన్ (ఫారం-1) ప్రతులను కలెక్టరేట్, ఆర్‌డిఓ, తహసీల్దార్, సబ్-రిజిస్ట్రార్, ఎంపీడీఓ, హెడ్ పోస్టాఫీస్ మరియు మున్సిపల్ కార్యాలయాల్లో ప్రదర్శించినట్లు వెల్లడించారు. సరిహద్దులపై ఏవైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే ఆధారాలతో సహా గడువులోగా మున్సిపల్ కార్యాలయంలో లిఖితపూర్వకంగా అందజేయాలని కమిషనర్ కోరారు.

నంద్యాల మున్సిపాలిటీ వార్డులు 42 నుంచి 52కు పెంపు సరిహద్దులపై ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలకు ఆహ్వానం ఈ నెల 5 నుంచి 11 వరకు గడువు