Monday, 21 September 2026

Tag: Mumcipility

నంద్యాల

సూనెపల్లె యూనియన్ బ్యాంక్‌లో ‘పీఎం స్వనిధి’ రుణ శిబిరం

నంద్యాల: మెప్మా ఆధ్వర్యంలో సూనెపల్లె యూనియన్ ಬ್ಯಾಂಕ್ శాఖలో బుధవారం పీఎం స్వనిధి ప్రత్యేక రుణ శిబిరం నిర్వహించారు. వీధి విక్రయదారులకు పూచీకత్తు లేకుండా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నట్లు మెప్మా సీఎంఎం విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. సకాలంలో వాయిదాలు చెల్లించేవారికి రాయితీలతో పాటు దశలవారీగా ₹15 వేల నుండి ₹50 వేల వరకు రుణాలు ఇస్తామని బ్యాంక్ మేనేజర్ సురేంద్రనాథ్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ శివరెడ్డి, మెప్మా సీఓ చంద్ర విద్యాసాగర్ మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

నంద్యాల

ఆర్‌ఏఆర్‌ఎస్‌ను కాపాడాలంటూ పోస్టుకార్డు ఉద్యమం

నంద్యాల: ఆర్‌ఏఆర్‌ఎస్‌ (రైతు పరిశోధన కేంద్రం) నుంచి తాత్కాలిక కలెక్టరేట్‌ను వెంటనే తరలించాలని, నూనెపల్లె మార్కెట్‌ యార్డులో టీడీపీ కార్యాలయానికి కేటాయించిన రెండు ఎకరాల భూమిని రద్దు చేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లతో చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమానికి ప్రజలు, రైతులు, యువత నుంచి విశేష స్పందన లభించింది.125 ఏళ్ల చరిత్ర కలిగిన ఆర్‌ఏఆర్‌ఎస్‌ను పరిరక్షించాలని, మార్కెట్‌ యార్డు భూమిని ప్రజా అవసరాలకే వినియోగించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అఖిలపక్ష నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

నంద్యాల

పింఛన్ దరఖాస్తుల గడువు నెలాఖరు వరకు పెంచాలి: వైసీపీ

నంద్యాల: కొత్త పింఛన్ల దరఖాస్తులకు ప్రభుత్వం ఇచ్చిన సమయం చాలక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించాలని వైసీపీ నాయకుడు సన్నల సాయిరాం రెడ్డి డిమాండ్ చేశారు.వరుసగా వచ్చిన మూడు రోజుల ప్రభుత్వ సెలవులు, సర్వర్ సమస్యలు, ధ్రువపత్రాల సేకరణలో ఆలస్యం, సదరం సర్టిఫికేట్లలో తప్పులు, గృహ మ్యాపింగ్ సమస్యల వల్ల దరఖాస్తుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి గడువు పెంచి అర్హులందరికీ న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసింహ యువరాజ్, రఫీ తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల

చెరువు కట్ట వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన: మున్సిపల్‌ కమిషనర్‌

నంద్యాల: శుక్రవారం నిర్వహించనున్న వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని నంద్యాల చెరువు కట్ట వద్ద చేపడుతున్న ఏర్పాట్లను మున్సిపల్‌ కమిషనర్‌ బి. శేషన్న మంగళవారం పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య పనులను పక్కాగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.నిమజ్జన ఘాట్‌ పరిసరాల్లో నిరంతరం చెత్త తొలగింపు, శుభ్రత చర్యలు చేపట్టాలని, కార్యక్రమం పూర్తయ్యే వరకు సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ పరిశీలనలో మున్సిపల్ ఎం.ఈ. నాగభూషణం రెడ్డి, డీఈలు పవన్‌ కుమార్‌, రసూల్‌, ఆర్‌ఐలు, శానిటేషన్ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

నంద్యాల

నంద్యాల పురపాలక వార్డుల పునర్విభజనకు అనుమతి

నంద్యాల: నంద్యాల పురపాలక సంఘంలో ప్రస్తుతం ఉన్న 42 వార్డులను 52 వార్డులుగా పునర్విభజించేందుకు కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి మంజూరు చేశారు. హైకోర్టు ఉత్తర్వులు, ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు.రూల్ 13 ప్రకారం దీనికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాజపత్రం (AP Gazette No.541) ను సెప్టెంబర్ 14న ప్రచురించినట్లు నంద్యాల మున్సిపల్ కమిషనర్ పత్రికా ప్రకటనలో తెలిపారు.

నంద్యాల

నంద్యాలకు 52 వార్డులు: మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న

నంద్యాల: నంద్యాల పురపాలక సంఘంలో ప్రస్తుతం ఉన్న 42 వార్డులను 52 వార్డులుగా పునర్విభజించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుల మేరకు వార్డుల పునర్విభజనకు సంబంధించి మున్సిపల్ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. సెప్టెంబర్ 14న పునర్విభజనకు అనుమతి వెలువడగా, ఫారం–6 ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజపత్రంలో (గెజిట్) ప్రచురించినట్లు కమిషనర్ స్పష్టం చేశారు.

నంద్యాల

పారిశుధ్యంపై మున్సిపల్ కమిషనర్ శేషన్న ప్రత్యేక నిఘా

నంద్యాల: పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న పలు ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోడ్లు, కాలనీలు, ప్రధాన కూడళ్లలో ఎక్కడా చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని, డ్రైనేజీలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.పట్టణ పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, అధికారులు-సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ తనిఖీల్లో మున్సిపల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు విక్రమ్, శభరిష్, శానిటేషన్ సూపర్‌వైజర్లు లక్ష్మీనారాయణ, శివప్రసాద్ రెడ్డి మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

నంద్యాల

నంద్యాల మున్సిపాలిటీ వార్డులు 42 నుంచి 52కు పెంపు సరిహద్దులపై ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలకు ఆహ్వానం ఈ నెల 5 నుంచి 11 వరకు గడువు

నంద్యాల: నంద్యాల పురపాలక సంఘ పరిధిలోని ప్రస్తుతం ఉన్న 42 వార్డులను 52 వార్డులుగా పునర్విభజిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఈ పునర్విభజన ప్రక్రియపై శనివారం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో కలెక్టర్ జి. రాజకుమారి గారితో ఆయన చర్చించారు.సి అండ్ డిఎమ్‌ఎ సర్క్యులర్, హైకోర్టు ఉత్తర్వుల మేరకు వార్డుల పునర్విభజనకు కొత్త షెడ్యూల్ జారీ చేశామని తెలిపారు. ప్రతిపాదిత వార్డుల సరిహద్దులపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను సెప్టెంబర్ 5 నుంచి 11వ తేదీ వరకు (7 రోజులు) స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.ప్రజల సౌకర్యార్థం ప్రతిపాదిత వార్డుల నోటిఫికేషన్ (ఫారం-1) ప్రతులను కలెక్టరేట్, ఆర్‌డిఓ, తహసీల్దార్, సబ్‌-రిజిస్ట్రార్, ఎంపీడీఓ, హెడ్ పోస్టాఫీస్ మరియు మున్సిపల్ కార్యాలయాల్లో ప్రదర్శించినట్లు వెల్లడించారు. సరిహద్దులపై ఏవైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే ఆధారాలతో సహా గడువులోగా మున్సిపల్ కార్యాలయంలో లిఖితపూర్వకంగా అందజేయాలని కమిషనర్ కోరారు.

నంద్యాల

వినాయక నిమజ్జనానికి నంద్యాల చెరువు సిద్ధం

నంద్యాల: వినాయక విగ్రహాల నిమజ్జనానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నంద్యాల చెరువులో నీటిని సిద్ధం చేసినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. చెరువు వద్ద జరుగుతున్న పారిశుధ్య పనులను శుక్రవారం మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న ప్రత్యక్షంగా పరిశీలించారు.నిమజ్జన ప్రాంతంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తాచెదారాన్ని వెంటనే తొలగించాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. భక్తులకు సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు విక్రమ్, శభరిష్, శానిటేషన్ సూపర్‌వైజర్లు మురళీధర్, శివ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల

మెప్మాలో సీఆర్పీల తొలగింపుపై రాజకీయ ఒత్తిళ్లు.. కలెక్టర్‌కు బాధితుల ఫిర్యాదు

నంద్యాల : మెప్మా కార్యాలయంలో కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్స్ (CRP) తొలగింపు వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. సీఆర్పీలుగా పనిచేస్తున్న కొందరిని తొలగించాలని అధికార పార్టీ నాయకుల నుంచి అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో ఎలాంటి కారణాలు చూపకుండా తమను విధుల నుంచి తొలగించారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత సీఆర్పీలు జిల్లా కలెక్టర్ నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. ఒకవైపు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, మరోవైపు బాధితుల ఫిర్యాదులతో ఏం చేయాలో పాలుపోక మెప్మా పీడీ కార్యాలయ అధికారులు సతమతమవుతున్నారు. అర్హులైన సీఆర్పీలకు అన్యాయం జరగకుండా, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.