నంద్యాల పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోడ్ల వెంట పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను వెంటనే తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.కాలువలు, రహదారుల పరిసరాల్లో పారిశుధ్య పనులను వేగవంతం చేయాలని, చెత్త పేరుకుపోయే ప్రాంతాలను గుర్తించి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం లేకుండా బాధ్యతగా పనిచేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.కమిషనర్ వెంట మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ విక్రమ్, పారిశుధ్య సూపర్వైజర్ శివప్రసాద్‌రెడ్డి, మున్సిపల్, సచివాలయ సిబ్బంది ఉన్నారు.

పారిశుధ్య పనులపై మున్సిపల్ కమిషనర్ శేషన్న పరిశీలన